newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

బాబోయ్.. ఈ అతి ఏంటో?

11-01-201911-01-2019 15:25:36 IST
2019-01-11T09:55:36.763Z11-01-2019 2019-01-11T09:55:32.327Z - - 17-07-2019

బాబోయ్.. ఈ అతి ఏంటో?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో నామమాత్రంగా తన ప్రభావం చూపిస్తాడని రాజకీయ విశ్లేషణల్ని బట్టి తెలుస్తోంది. అయితే తమ పార్టీ ప్రభావాన్ని ఇతర మీడియా సంస్థలు తక్కువ చేసి చూపిస్తున్నాయని, మాకున్న జనబలాన్ని కించపరుస్తున్నాయని పవన్ వీరాభిమానులు, జనసేన సైనికులు మండిపడుతున్నారు. రాజకీయ సర్వేలపై వారు విరుచుకుపడుతున్నారు. పవన్‌కి చెందిన మీడియా సంస్థలు గత కొద్దికాలంగా తమ పార్టీ పరిస్థితిపై నేలవిడిచి సాము చేస్తున్నాయి. ఏపీలో ఎన్నికల సర్వేల్లో అనుసరించిన శాంపిల్స్‌పై ఆ టీవీలో జనసేన పార్టీ నేతలు. రాజకీయ విశ్లేషకుల పేరుతో చర్చలకు దిగుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావి సీఎం అంటూ ఆయన మీడియాలోనే భజన ప్రారంభమయిందని టీవీ చూస్తున్న సామాన్య జనం అంటున్నారు.  

‘చంద్రబాబులా, జగన్‌లా నాకు సొంత మీడియా లేదు, నాకు ప్రజలే మీడియా, ప్రజల ఫేస్‌బుక్ ఎకౌంట్లే నాకు ఛానెళ్లు’ అంటూ బీద అరుపులు అరిచిన పవన్ కల్యాణ్ ఇప్పుడు తన సొంతడబ్బా బాగానే కొట్టుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన ఈమధ్య టేకోవర్ చేసిన సదరు టీవీ ప్రచారం పరాకాష్టకు చేరుతోంది. ఆ ఛానెల్ చూసిన వారెవరికైనా రాష్ట్రంలో జనసేన తప్ప ఇంకే పార్టీ లేనట్టు, పవన్ తప్ప మరే నాయకుడూ రాష్ట్రంలో లేడన్నట్టు అనిపిస్తుంది. చంద్రబాబు అనుకూల మీడియా తనని పక్కన పెట్టేసిందనే ఉద్ధేశంతో పవన్ తనకంటూ ఓ మూడు ఛానెళ్లు పెట్టుకున్నారు. దీనికి ఓ దినపత్రిక అదనం. ఇవన్నీ కలిసి ఇప్పుడు పవన్‌ను భావి ముఖ్యమంత్రి అనేస్తున్నాయి. 2019లో ఏపీకి పవనే ముఖ్యమంత్రి అని, పవన్ రాకపోతే రాష్ట్రంలో అభివృద్ధే జరగదని, పేదరికం పోదని హితబోధ చేస్తోంది సదరు ఛానెల్.  ఏపీ ఎన్నికల ఫ్లాష్ సర్వే పేరుతో వస్తున్న ప్రోగ్రామ్ టీడీపీ, వైసీపీల వైపు కాకుండా జనమంతా జనసేన వైపు ఉన్నారని తేల్చిచెప్పింది. సొంత డబ్బా కొట్టినా.. జనాలు ఆ ఛానెల్‌ చూడాలంటే టైం పడుతుంది. పవన్ కల్యాణ్ కూడా ఈమధ్య మీడియా మేనేజ్‌మెంట్ బాగానే నేర్చుకున్నారని ప్రస్తుత పరిణామాలను బట్టి అర్థం అవుతోంది. 

టీడీపీకి, వైసీపీకి మంచి పట్టున్న కొన్నిజిల్లాల్లో మెజారిటీ స్థానాలు జనసేనకు రావడం గ్యారంటీ అంటోంది సదరు టీవీ. పవన్ కళ్యాణ్‌పై అభిమానం వేరు, ఓటు వేయడం వేరు. స్వామి భక్తి ఉండవచ్చు గానీ, మరీ అతిగా ఉండడం మంచిది కాదంటున్నారు ఇతర పార్టీల నేతలు. గతంలో పవన్ అన్నయ్య ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల్లో పోటీచేసిన సందర్భంలోనూ ఇలాంటి అంచనాలే కనిపించాయి. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ ఎలా బాక్సాఫీస్ ఫ్లాప్ అయిందో అందరికీ తెలుసు. ఇప్పుడు జనసేన అంచనాలు కూడా ప్రజారాజ్యం-2 లా ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. పార్టీ సభలకు, పాదయాత్రలకు వచ్చే జనమంతా తమ పార్టీకి ఓటేస్తారని అనుకుంటే అది పొరపాటే.. అక్షరాలా దిద్దుకోలేని పొరపాటు. ఆత్మస్థుతి-పరనింద ఎప్పుడూ అభిలషణీయం కాదు. సర్వేలు, అంచనాలు వాస్తవాన్ని ప్రతిబింబించాలి కానీ.. ఆకాశానికి నిచ్చెనలు వేయకూడదు. ఇప్పటివరకూ వచ్చిన సర్వేలన్నీ ఇంచుమించుగా ఒకేలా ఉన్నాయి. అధికార పార్టీపై వ్యతిరేక ఓటు ఉంటుంది కానీ..అధికార పార్టీ విజయావకాశాల గ్రాఫ్ అంతగా పడిపోదు. కొత్తగా పుట్టుకొచ్చిన, క్యాడర్ పునాదులు లేని పార్టీ ఏపీలో కీలకంగా మారబోతోందంటూ పేర్కొనడం సమంజసం కాదంటున్నారు ఇతర పార్టీల నేతలు. ఈ మీడియా మేనేజ్‌మెంట్ జనసేన విశ్వసనీయతను దెబ్బతీస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle