newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

బాబోయ్...బాలయ్య మళ్లీ వాయించేశాడు

08-04-201908-04-2019 12:28:10 IST
2019-04-08T06:58:10.529Z08-04-2019 2019-04-08T06:58:08.666Z - - 22-09-2019

బాబోయ్...బాలయ్య మళ్లీ వాయించేశాడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చంద్రబాబుకు ఎన్నికల వేళ హీరో కం ఎమ్మెల్యే బాలకృష్ణ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాడు. మొన్న ఓ జర్నలిస్ట్ మీద దాడి చేసి, బూతులు తిట్టి నేను పులినీ, సింహాన్ని అని గర్జించి జనాన్ని ఎంటర్‌టైన్ చేశాడు. అప్పుడే బాలయ్యా.. ఇదేం గోలయ్యా కంట్రోల్.. కంట్రోల్ అని చంద్రబాబు మందలించాడట. అయినా సరే కంట్రోల్ అయితే ఆయన బాలకృష్ణ ఎందుకవుతారు. ముందే సీమసింహం, సమరసింహం, నరసింహం, సీమసింహంలాంటి భయంకరమైన సినిమాలు చేసిన కొదమసింహమాయె.. అందుకే బాలయ్యను ఎవ్వరూ కంట్రోల్ చెయ్యలేరు. 

ఇంతకీ ఇప్పుడు మళ్లీ బాలయ్య ఎందుకు టాక్ ఆఫ్ ది ఎలక్షన్ అయ్యారంటే.. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ప్రచారానికి వెళ్లిన బాలకృష్ణ టీడీపీ కార్యకర్తలను తరిమి తరిమి కొట్టారు. రోడ్డుపై వెంటాడుతూ కాళ్లతో తన్నుతూ పిడిగుద్దులు కురిపించారు. చీపురుపల్లిలో అక్కడి అభ్యర్థి తరఫున ప్రచారానికి వెళ్లారు. ఆ సమయంలో కొంతమంది కార్యకర్తలు బాలయ్యతో ఫోటోలు దిగడానికి వెంటపడ్డారట. ఎండల్లో తిరగడం వల్ల వచ్చిన ఇరిటేషనో ఏమో గానీ ఏయ్.. ఏంట్రా మీ గోల అంటూ నడి రోడ్డుపై వీర వివిహారం చేశారు బాలయ్య బాబు. 

ఒక్కసారిగా అక్కడి సీన్ షూటింగ్‌లో ఫైటింగ్ సీన్‌లా మారిపోయేసరికి టీడీపీ అభ్యర్థి కిమిడి నాగార్జున బిత్తరపోయారు. గెలిపిస్తాడని బాలయ్యను తీసుకొస్తే.. ఇంతలా డ్యామేజ్ చేస్తున్నాడేంటని ఆయన కార్యకర్తలతో చెప్పి గొల్లుమన్నాడట. సొంత నియోజకవర్గంలోనూ బాలకృష్ణకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.

పోనీ.. స్టార్ క్యాంపెయినర్‌గా నాలుగు డైలాగులైనా చెప్తాడేమో అనుకుంటే అక్కడ మిగతా వాళ్ల గెలుపునకు గండి కొట్టేలా డ్యామేజ్ చేస్తున్నాడని తలపట్టుకున్నారట చంద్రబాబు. గతంలోనూ విశాఖలోనూ ఓ కార్యకర్తపై ఇలాగే ఊగిపోయి అంతు చూస్తా ఖబడ్దార్ అన్నాడట బాలయ్య. ఇదంతా చూస్తోంటే.. చంద్రబాబుకు జగన్ లాంటి రాజకీయ శత్రువులు అక్కర్లేదు. ఒక లోకేష్, ఒక బాలయ్య ఉంటే చాలు అంటున్నారంతా. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle