newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 108 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 2099 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

బాబూ పాల్ స్థాయికి పడిపోయావా...?

28-03-201928-03-2019 08:19:06 IST
2019-03-28T02:49:06.386Z28-03-2019 2019-03-28T02:48:47.543Z - - 28-05-2020

బాబూ పాల్ స్థాయికి పడిపోయావా...?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రజా శాంతి పార్టీ గుర్తయిన హెలికాప్టర్.. వైసీపీ ఫ్యానుకు దగ్గరగా ఉంటుంది. అలాగే.. వైసీపీ జెండాలు, కండువాల రంగులనే పాల్ పార్టీ కూడా కాపీ కొట్టింది. దాఖలైన నామినేషన్లను చూసినట్లయితే.. చాలా నియోజకవర్గాల్లో పేర్లు ఇంటిపేర్లు వైసీపీ అభ్యర్థులను పోలి ఉన్నాయి. ఒక్క అనంతపురంలో జిల్లాలోనే ఏకంగా 8 నియోజకవర్గాల్లో నామినేషన్లు వేశారు ప్రజా శాంతి పార్టీ అభ్యర్థులు.. రాయదుర్గంనుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కాపు చంద్రారెడ్డికి పోటీగా ఉండాల రామచంద్రారెడ్డిని, ఉరవకొండ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డికి పోటీగా విశ్వనాథరెడ్డిని, కల్యాణదుర్గంనుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఉషాశ్రీచరణ్‌కు పోటీగా ఉషారాణిని, రాప్తాడులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశరెడ్డికి పోటీగా డి. ప్రకాష్‌ను నిలిపారు.

పెనుకొండ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఎం శంకరనారాయణకు పోటీగా ఎస్‌ శంకరనారాయణను, ధర్మవరం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి పోటీగా పెద్దిరెడ్డిగారి వెంకటరామిరెడ్డిని, కదిరి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సిద్ధారెడ్డికి పోటీగా నన్నక సిద్ధారెడ్డిని...ప్రజాశాంతి పార్టీ నిలబెట్టింది. అంతేకాదు..అనంతపురం అర్బన్‌ నియోజకవర్గానికి పగడి వెంకటరామిరెడ్డి అనే వ్యక్తి...ప్రజాశాంతి పార్టీ తరుఫున నామినేషన్‌ వేశారు. 

అతను రేషన్‌ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడేగాక తెలుగుదేశం పార్టీ నేత కావడం గమనార్హం. తెలుగు దేశం పార్టీ, ప్రజాశాంతి పార్టీ మధ్య వున్న అంతర్గత బంధం ఏమిటో ఈ ఘటన రుజువు చేస్తోంది. ఈ పేర్ల కుట్ర వెనుక చంద్రబాబు హస్తమందని  స్పష్టం చేస్తోంది. ప్రకాశం జిల్లాలోనూ అదే జరిగింది. పర్చూరు నియోజకవర్గంనుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వర రావు పోటీ చేస్తున్నారు. ఆయన విజయావకాశాలను దెబ్బకొట్టేందుకు దగ్గుబాటి వెంకటేశ్వరావు పేరున్న ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి నామినేషన్ వేశారు. గుంటూరు జిల్లాలోనూ అదే జరిగింది. పెదకూరపాడు నియోజకవర్గంనుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా నంబూరు శంకరరావు పోటీ చేస్తున్నారు.

దాదాపు అదే పేరుతో వున్న నంబూరి శంకరరావును ప్రజాశాంతి పార్టీ తమ అభ్యర్థిగా నిల్చోబెట్టి... ఓటర్లను గందరగోళ పరిచే ఎత్తుగడకు పూనుకుంది. అయితే నంబూరికి చుక్కెదురైంది. నామినేషన్ తిరస్కరించారు అధికారులు. అంతేకాదు...ఈవీఎంల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సింబల్‌ సీలింగ్‌ ఫ్యాన్‌, ప్రజాశాంతి పార్టీ సింబల్‌ హెలికాప్టర్ గుర్తులు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేలా పక్కా ప్లాన్‌ చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు చంద్రబాబు పాల్‌తో చేతులు కలపడాన్ని నెటిజన్లు చీల్చి చెండాడుతున్నారు.. బాబూ ఇన్ని సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన నువ్వు పాల్ స్థాయికి దిగజారిపోయావా అని చీవాట్లు పెడుతున్నారు.

బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు

బోరుబావిలో పడ్డ బాలుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు

   11 hours ago


బోరుబావిలో మూడేళ్ళ బాలుడు..మెదక్‌లో  ఘటన

బోరుబావిలో మూడేళ్ళ బాలుడు..మెదక్‌లో ఘటన

   11 hours ago


మీడియా స్వీయనియంత్రణ పాటించాల్సిందే

మీడియా స్వీయనియంత్రణ పాటించాల్సిందే

   12 hours ago


ప్యాకేజీలు పుచ్చుకోవడం వల్లే ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం

ప్యాకేజీలు పుచ్చుకోవడం వల్లే ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం

   16 hours ago


మృతదేహాలకూ కరోనా పరీక్షలు చేయాల్సిందే.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

మృతదేహాలకూ కరోనా పరీక్షలు చేయాల్సిందే.. తెలంగాణ హైకోర్టు ఆదేశం

   16 hours ago


తెలుగు రాష్ట్రాల్లో కరోనా వీరవిహారం

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వీరవిహారం

   19 hours ago


ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

   a day ago


రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

   a day ago


ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

   a day ago


కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

   a day ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle