newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

‘బాబూ డ్రామాలు ఆపు..’జీవీఎల్ విసుర్లు

03-05-201903-05-2019 08:32:47 IST
Updated On 02-07-2019 12:47:23 ISTUpdated On 02-07-20192019-05-03T03:02:47.751Z03-05-2019 2019-05-03T02:55:36.732Z - 2019-07-02T07:17:23.771Z - 02-07-2019

‘బాబూ డ్రామాలు ఆపు..’జీవీఎల్ విసుర్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం చంద్రబాబు-బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా జీవిఎల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. మూడు వారాల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి పదవి ఊడిపోవడం ఖాయమని జీవీఎల్‌ నరసింహారావు జోస్యం చెప్పారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ..తన సమీక్షల వల్ల ఏదో వెలగబెట్టినట్లు ఆయన చేస్తోన్న ప్రకటనలు చూస్తుంటే అందరికీ నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. 

బాబు వస్తే కరువు వస్తుందని, ఆయన పాలనలో కరవు కాటకాలతో రైతులు అల్లాడుతున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు.‘దొంగ డ్రామాలు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఎన్నికల నియమావళిని రాజకీయం చేయాలని ఆరాటపడుతున్నారు. ఎన్నికల సంఘంతో చర్చించిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది.

రైల్వే జోన్‌ ప్రకటన సమయంలో ఇంకా ఎన్నికల ప్రకటన రానప్పటికీ ఎన్నికల సంఘం అనుమతితోనే రైల్వే శాఖ ప్రకటన చేసింది’’ అని జీవీఎల్ అన్నారు.‘స్థానికంగా కౌన్సిల్‌ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ అనుమతితో రైల్వే జోన్‌ ప్రకటన చేశారు. ప్రతి దానికీ చంద్రబాబు రాజకీయం చేయడం వల్ల టెన్షన్‌ తప్ప ఆయనకు ఒరిగేదేమీ లేదు. మొత్తం మీద జీవీఎల్ వ్యాఖ్యలు టీడీపీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle