newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

బాబూ ఎందుకింత అసహనం...?

13-04-201913-04-2019 12:10:18 IST
Updated On 06-07-2019 14:43:09 ISTUpdated On 06-07-20192019-04-13T06:40:18.658Z13-04-2019 2019-04-13T06:40:16.973Z - 2019-07-06T09:13:09.286Z - 06-07-2019

బాబూ ఎందుకింత అసహనం...?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీరులో మార్పు గమనించారా? మిన్ను విరిగి మీదపడ్డా చలించకుండా నిబ్బరంతో ఉండే చంద్రబాబు ఎందుకిలా మారిపోతున్నారు? ప్రతి చిన్న విషయానికి ఆయన ఎందుకింత ఓవర్‌గా రియాక్టవుతున్నారు? ఏపీ రాజకీయాల్లో ఈ ప్రశ్నలే తిరుగుతున్నాయి.  రాజకీయాల్లో తనకంటే సీనియర్ లేరని చెప్పే చంద్రబాబులో అసహనం బాగా ఎక్కువవుతోందని పలు సంఘటనల్ని బట్టి అర్థం అవుతోంది.

అనేక విషయాలపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై ఇప్పుడు చ‌ర్చ సాగుతోంది. ఎన్నిక‌ల ప్రచారంలో కుమ్మక్కు రాజ‌కీయాలనే మాటలను ఆయన పదేపదే వాడుతున్నారు. ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు. సీనియర్ నేతలు కూడా వాడడానికి వెనుకాడే పదాలను చంద్రబాబు పలుకుతున్నారు. 

ఎప్పుడూ లేనిది ఆయన ఏకంగా ఎన్నికల సంఘాన్ని ఆడిపోసుకుంటున్నారు. పైగా ఈసీ కార్యాలయంముందే ధర్నాకు దిగడం, ఈసీని మూసేసుకోండి అని వ్యాఖ్యలు చేయడం చంద్రబాబులాంటి అపార రాజకీయ అనుభవం కలిగిన నేతలకు తగదంటున్నారు. ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా వ్యవహరించడంపై విమర్శలు వచ్చాయి. పైగా ప్రెస్ మీట్లో ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై తీవ్ర ఆరోపణలు చేయడం విమర్శల పాలవుతోంది.

పదే పదే జగన్ గురించి, నేరస్థులు చెబితే బదిలీలు చేస్తారా అని వ్యాఖ్యానించడం కూడా సబబుగా లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా ఎన్డీఏ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన నాటి నుండి ప్రధాని మోదీ లక్ష్యంగా చంద్రబాబు ఆరోపణలు, విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. అవి కొండొకచో తారాస్థాయికి చేరుతున్నాయి. 

ఏపీకి అన్యాయం చేస్తున్నారని, చిన్న మోడీ, పెద్ద మోడీ అంటూ కేసీఆర్, జగన్‌లను కలిపేశారు. ఎన్నికల ప్రచారం ముగింపుదశలో కేసీఆర్‌ని టార్గెట్ చేశారు. వైసిపి ఫిర్యాదు మేర‌కు ఇంట‌లిజెన్స్ డిజి మొద‌లు ముగ్గురు ఎస్పీలు.. ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి ని బ‌దిలీ చేయ‌డంపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. కొత్త సీఎస్ నియామకం గురింరి తనను సంప్రదించలేదని బాబు మండిపడ్డారు. 

కొత్త సీయ‌స్ ఎల్వీ సుబ్రహ్మణ్యం గురించి కూడా హాట్ కామెంట్స్ చేశారు. ఆయ‌న్ను కోవ‌ర్టు అని ఆరోపించ‌టంతో పాటుగా జ‌గ‌న్ సహ ముద్దాయి అంటూ విమ‌ర్శించారు. అయితే, గ‌తంలోనే కోర్టు ఎమ్మార్ వ్యవ‌హారంలో ఆయ‌నపై వ‌చ్చిన అభియోగాల‌ను కొట్టేసింది. అయితే సీఎస్‌పైన ఇలాంటి ఆరోపణలు చేయడంతో చంద్రబాబులో చాలా మార్పు వచ్చిందని, అసహనం తారాస్థాయికి చేరిందనే విమర్శలు వస్తున్నాయి. ఇవి చంద్రబాబు స్థాయిని తగ్గిస్తున్నాయంటున్నారు. 

ఎన్నికల్లో తొలిసారి ఒంటరిపోరు చేసిన చంద్రబాబునాయుడికి ఎక్కడో ఈక్వేషన్స్ తేడా కొడుతున్నాయంటున్నారు. ప్రజల భవిష్యత్తు తన చేతుల్లో ఉందంటూ ‘మీ భవిష్యత్ నా బాధ్యత’ అన్న చంద్రబాబుకి తన భవిష్యత్తుపైనే బెంగ పట్టుకున్నట్టు ఉందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎన్నికల్లో ఓడి పోతామని తెలిసి.. అసహనంతో వ్యవహరించలేదు.

మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సైతం ఇటీవలి ఎన్నికల్లో తన ఓటమిని హుందాగా స్వీకరించారని, పైగా ముఖ్యమంత్రి కమల్ నాథ్ ప్రమాణ స్వీకారానికి వచ్చి తన హుందాతనం చాటుకున్నారని కొందరు రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. చంద్రబాబుకి ప్రజల తీర్పుపై భయం పట్టుకుందని, అందుకే ఆయనలో ఆత్మవిశ్వాసం సడలుతోందని కొందరు రాజకీయనేతలు విమర్శిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు వ్యవహారశైలి 40 రోజుల తర్వాత రాబోయే ప్రజాతీర్పునకు అద్దం పడుతోందంటున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle