newssting
BITING NEWS :
*విజయవాడలో ప్రజావేదిక కూల్చివేత *అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతాం: సీఎం జగన్ *పార్టీ మారడం ఖాయం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి *పార్టీ అంటే కుల సంఘం కాదని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి: పవన్ కళ్యాణ్ *హోదా బాధ్యత జగన్‌దే: ఎంపీ గల్లా జయదేవ్‌*‘నెహ్రూ-గాంధీ’ కుటుంబంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు *ప్రపంచకప్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా

బాబు రాజీ ఫార్ములా టాలీ కాలేదు..!

25-05-201925-05-2019 11:51:05 IST
2019-05-25T06:21:05.333Z25-05-2019 2019-05-25T06:21:00.636Z - - 26-06-2019

బాబు రాజీ ఫార్ములా టాలీ కాలేదు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

అనేక ద‌శాబ్దాలుగా రాజ‌కీయంగా ప్ర‌త్య‌ర్థి కుటుంబాలు అవి. ఫ్యాక్ష‌న్ న‌డిపిన చ‌రిత్ర వారిది. వీరి కుటుంబాల ఆధిప‌త్య పోరులో వీరి అనుచ‌రులు, గ్రామ‌స్థాయి నాయ‌కులు ఎన్నో ఇబ్బందులు ప‌డ్డారు. అయితే, ఈసారి చంద్ర‌బాబు నాయుడు వీరి మ‌ధ్య రాజీ ఫార్ములాను అమ‌లు చేశారు. ఒకే ఒరలో రెండు క‌త్తులు ఇమ‌డ‌వు అనే నానుడిని త‌ప్పు చేయాల‌ని భావించారు. ఒకే పార్టీలోకి బ‌ద్ధ వీరోధుల‌ను తీసుకువ‌చ్చారు.

రాయ‌ల‌సీమ జిల్లాల్లో చంద్రబాబు అమ‌లు చేసిన  వ్యూహం దారుణంగా విఫ‌ల‌మైంది. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ట్టున్న, ఇద్ద‌రు ప్రత్యర్థులుగా మెలిగే నాయ‌కుల‌ను ఒకే పార్టీలోకి తీసుకువ‌చ్చారు. ఇలా చేయ‌డం ద్వారా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో, జిల్లాల్లో త‌మ‌కు తిరుగు ఉండ‌ద‌ని అంచ‌నా వేశారు. అయితే, చంద్ర‌బాబు వేసిన ఈ స్కెచ్ రివ‌ర్స్ అయ్యింది.

పైస్థాయిలో నేత‌లు ఒక్కట‌యినా క్షేత్రస్థాయిలో గ్రామాల్లో మాత్రం రెండు వ‌ర్గాల క్యాడ‌ర్ చేతులు క‌ల‌ప‌లేదు. ఇన్నేళ్లుగా త‌మ నాయ‌కుల ప‌గ‌ను త‌మ ప‌గ‌గా భావించి అన్ని ర‌కాలుగా న‌ష్ట‌పోయి, కేసులు ఎదుర్కున్న గ్రామ‌స్థాయి నేత‌లు ఇప్పుడు త‌మ నాయ‌కులు ప్రత్య‌ర్థి నాయ‌కుల‌తో చేతులు క‌ల‌ప‌డాన్ని వారు జీర్ణించుకోలేదు.ఇది అవ‌త‌లి పార్టీకి బాగా క‌లిసివ‌చ్చింది.

క‌డ‌ప జిల్లా జ‌మ్మల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గంలో ఆదినారాయ‌ణ‌రెడ్డి, రామ‌సుబ్బారెడ్డి కుటుంబాల మ‌ధ్య ద‌శాబ్దాలుగా ఫ్యాక్షన్ న‌డుస్తోంది. ఈ ఇద్దరూ ఇన్నేళ్లుగా చెరో పార్టీలో కొన‌సాగుతూ వ‌స్తున్నారు. కొన్నిసార్లు ఒక‌రు, మ‌రికొన్ని సార్లు మ‌రొక‌రు గెలిచారు. ఈసారి చంద్రబాబు ఫిరాయింపుల‌ను ప్రోత్సహించి వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డిని టీడీపీలో చేర్చుకొని మంత్రిని చేశారు.

ఇక్కడ ఆదినారాయ‌ణ‌రెడ్డి, రామ‌సుబ్బారెడ్డి మ‌ధ్య స‌యోధ్య కుదిర్చేందుకు చంద్ర‌బాబు రెండు మూడు నెల‌ల పాటు అనేక‌సార్లు స‌మావేశ‌మై చ‌ర్చలు జ‌రిపారు. చంద్రబాబు స‌మ‌యం వృధా అయ్యింది కానీ ఫ‌లితం లేకుండా పోయింది. జ‌మ్మ‌ల‌మ‌డుగులో రెండు ఫ్యాక్షన్ కుటుంబాలు ఒక‌ట‌వ‌డంతో ప్ర‌జ‌లు ఈసారి కొత్త నాయ‌క‌త్వం వైపు మొగ్గు చూపారు.

ఇక్కడ గ‌ట్టి పోటీ ఉంటుంద‌నుకుంటే ఏక‌ప‌క్షంగా కొత్త అభ్యర్థి, డాక్ట‌ర్ అయిన సుధీర్ రెడ్డిని ప్రజ‌లు 47 వేల భారీ మెజారిటీతో గెలిపించారు. క‌డ‌ప పార్లమెంటులో ఆదినారాయ‌ణ‌రెడ్డిని వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి సుమారు మూడున్నర ల‌క్షల ఓట్ల మెజారిటీతో ఓడించారు. దీంతో క‌డ‌ప జిల్లాలో చంద్రబాబు రాజీ ఫార్ములా దారుణంగా ఫెయిల్ అయ్యింది.

 

క‌ర్నూలు జిల్లాలోనూ ఇదే ఫార్ములా అమ‌లు చేసిన ఎన్నిక‌ల ముందు కేఈ కుటుంబంతో సుదీర్ఘ రాజ‌కీయ వైరం ఉన్న కోట్ల కుటుంబాన్ని టీడీపీలో చేర్చుకున్నారు. ఇక్క‌డ కూడా చంద్ర‌బాబు వ్యూహం ఫ్లాప్ అయ్యింది. రెండు బ‌ల‌మైన కుటుంబాలు క‌లిసినా జిల్లాలో టీడీపీకి దారుణ ఫ‌లితాలు వ‌చ్చాయి. క‌ర్నూలు జిల్లాను వైసీపీ స్వీప్ చేసేసింది. 14 నియోజ‌క‌వ‌ర్గాల్లో, 2 లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ఘ‌న విజ‌యం సాధించింది. కేఈ, కోట్ల కుటుంబాలు ఓడిపోయాయి. మొత్తంగా సీమ జిల్లాల్లో చంద్ర‌బాబు వ్యూహాలు ప‌నిచేయ‌లేదు.


Sharat Bhamidi


With 5 years of experience in Digital Media, Sharat Bhamdi specialises in creating content for webistes, developing ad campaigns and social media campaigns. At NewsSting, he handles the video division where he brings in content through feature videos and interviews.
 sharat@rightfolio.co.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle