newssting
BITING NEWS :
* గ‌త 24 గంట‌ల్లో భార‌త్‌లో 52,050 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు.. 803 మంది మృతి.. 18,55,746కి చేరిన క‌రోనా కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 38938 మంది మృతి*తెలంగాణలో 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. 12 మంది మృతి, ఇప్పటి వరకు 68,946 పాజిటివ్ కేసులు నమోదు.. 563 మంది మృతి *కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత *జానపద కళాకారుడు, రచయిత వంగపండు ప్రసాదరావు అనారోగ్యంతో పార్వతీపురంలో మృతి.. గ‌త కొన్ని రోజులుగా అనారోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వంగ‌పండుమరణం పట్ల , ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్, మాజీ సీఎం చంద్రబాబు సంతాపం *గుంటూరు : కరోన నేపథ్యంలో నేటి నుండి సత్తెనపల్లిలో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారాలకు అనుమతి*సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు స‌వాల్‌.. జ‌గ‌న్‌కు 48 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాం... మేం రాజీనామాకు సిద్ధం..? మీరు సిద్ధ‌మా?, రాజీనామాలు చేసే ప్ర‌జ‌ల ముందుకు వెళ్దాం-చ‌ంద్ర‌బాబు*హైద‌రాబాద్‌: డెక్కన్ ఆస్పత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వ నిర్ణయం.. అధిక బిల్లులు వసూలు చేసినందుకు డెక్కన్ ఆస్పత్రి పై చర్యలు

బాబు బోర్లాపడితే జగన్ గోతిలో పడుతున్నారా?

06-12-201906-12-2019 12:45:53 IST
Updated On 06-12-2019 17:30:40 ISTUpdated On 06-12-20192019-12-06T07:15:53.646Z06-12-2019 2019-12-06T07:15:49.049Z - 2019-12-06T12:00:40.674Z - 06-12-2019

బాబు బోర్లాపడితే జగన్ గోతిలో పడుతున్నారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రం కానీ కేంద్రం కానీ ప్రజలు తమ పరిపాలనపై స్పందన ఎలా ఉందో తెలుసుకొని మసలుకోవాలి. ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు కొన్ని రాజకీయ కారణాలతో తీసుకొంటే మరికొన్ని ప్రజాశ్రేయస్సు కోసం తీసుకుంటాయి. అయితే రాజకీయ పరమైన కారణాలతో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఒక్కోసారి ప్రజలలో కొందరికి నష్టం చేకూర్చడంతో పాటు వ్యతిరేకతను తెచ్చిపెడుతుంది. ఇది ప్రభుత్వం తెలుసుకోవాల్సి ఉంటుంది.

ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి పథకంలో లబ్ది దారులు ఉన్నట్లే అందులో ఉన్న పరిమితుల వలన పథకం చేరని వాళ్ళు ఉంటారు. అలానే సామజిక, ఆర్ధిక అంశాలలో ప్రభుత్వాలు లెక్కలు ప్రజలకు మరోలా చేరే అవకాశాలు ఉంటాయి. ఈమధ్య కాలంలో కుల, మత కారణాలు కూడా అటు ప్రభుత్వాలు, ప్రజలలో సమీకరణాలను మార్చేస్తున్నాయి.

ప్రతి ప్రభుత్వం ఈ పరిస్థితులను అన్నిటిని లెక్కలో వేసుకొని లోటు పాట్లను సరిచేసుకుంటూ ముందుకెళ్లాలి. ఇదే ప్రజా వ్యతిరేకతను తగ్గించే మెడిసిన్. సరిగా ఇక్కడే ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం బోల్తా పడింది. అధిష్టానం చుట్టూ చేరిన భజన బృందాలు తమ ప్రభుత్వం ఏది చేసినా ప్రజలు ఆహా ఓహో అనేస్తున్నారని ఫీడ్ బ్యాక్స్ ఇచ్చాయి. ప్రజా అభిప్రాయానికి నియమించుకున్న వాటిని కూడా తప్పుదోవ పట్టించాయి.

ఇక మరోవర్గం అధిష్టానంను ప్రతిరోజు ఆకాశానికి ఎత్తేయడం కోసం ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలకు దిగి దుమ్మెత్తి పోస్తాయి. వీళ్ళ టార్గెట్ ఒక్కటే అధిష్టానం వద్ద తమకి మంచి మార్కులతో పాటు సీఎంకు సన్నిహితులుగా మారిపోవాలి. అందుకోసం వ్యతిరేక వర్గాలపై దూషణలు కూడా వీళ్ళకి అలవోకగా వచ్చేస్తాయి. సరిగా ఇక్కడే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బోల్తా పడ్డారు. అప్పటి ప్రతిపక్షనేత జగన్ ను టీడీపీ నేతలు కొందరు తీవ్రంగా విరుచుకుపడేవారు.

ఇక ఇప్పుడు సీఎం జగన్ కూడా అదే విషయంలో గోతిలో పడుతున్నారనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో విమర్శలు వ్యక్తిగత దూషణలుగా మారిపోయాయి. బాధ్యతాయుతమైన మంత్రులే భజన బృందంగా మారి ఈ పనిచేయడం విస్తుగొలుపుతుంది. విమర్శలన్నవి రాజకీయాలకో ఆరోపణలకో ఉండాల్సి ఉండగా ఇప్పుడు బూతులతో నింపేయడం ప్రజలను ఈసడించుకుంటున్నారు.

దీనికి తోడు మాజీ సీఎం, ఇప్పటి మంత్రులను సైతం సామాన్య ప్రజలు కూడా నోటికొచ్చిన బూతులు తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు మిగతా ప్రజలకు చీదరపుట్టిస్తుంది. ఇదంతా మంత్రుల వాక్ స్వతంత్రం నుండే మొదలవడం సామాన్య ప్రజలలో ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత తెస్తుంది. తమ అధినేత మెప్పు కోసం ఎదుటివాళ్ళని నీచులని చేయడం సహించాల్సిన విషయం కానేకాదు.

ఈ విషయాన్ని సీఎం వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారా? లేక తెలిసినా అయన కూడా మాయలో పడిపోతున్నారా? అన్నది కూడా విశ్లేషకులకు సైతం అంతుబట్టడం లేదు. ఒకపక్క మంత్రులు తామే అధిష్టానంగా ఫీలైపోయి స్టేట్మెంటు ఇచ్చేయడం, మరోపక్క అవసరంలేని చోట కూడా అతిగా మీదపడిపోవడం పరిపాటిగా మారిపోయింది. ఏది ఏమైనా ఇది సాధ్యమైనంత త్వరగా వైసీపీ అధిష్టానం తెలుసుకోకపోతే నష్ట నివారణ కూడా కష్టమే!.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle