newssting
BITING NEWS :
*నేడు సిద్ధిపేట జిల్లాలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ క్షేత్ర పర్యటన*నేడు ఢిల్లీకి దేవేందర్‌గౌడ్‌*గుంటూరు ప్రాంతంలో చంద్రబాబు పర్యటన*నేడు సనత్‌నగర్‌లో కేంద్ర మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ పర్యటన *కర్ణాటక బీజేపీ నూతన అధ్యక్షుడిగా నళినీకుమార్ కటీల్*హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో చిదంబరం పిటిషన్

బాబు బంపర్ ఆఫర్..!

11-01-201911-01-2019 19:01:33 IST
2019-01-11T13:31:33.552Z11-01-2019 2019-01-11T13:31:27.087Z - - 21-08-2019

బాబు బంపర్ ఆఫర్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంక్రాంతికి పింఛను లబ్ధిదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించేశారు. జగన్ ప్రకటించిన హామీలపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. అధికారంలోకి వచ్చాక తాను ఎన్నో అమలుచేస్తానని జగన్ ప్రకటించారు. అయితే తాము అధికారంలో ఉన్నాం కాబట్టి వాటిని మనమే అమలు చేస్తే పోతుంది కదా అని చంద్రబాబు ఆలోచించారని కొందరు అధికార పార్టీ నేతలు అంటున్నారు. నెలనెలా వృద్ధులు, వితంతువులకు ఇస్తున్న పింఛను సొమ్ము రెట్టింపు చేశారు చంద్రబాబు. రాష్ట్రంలోని ప్రజలకు ఇదే తన సంక్రాంతి కానుక అంటూ చిరునవ్వులు ఒలికిస్తూ జగన్‌కి రివర్స్ పంచ్ ఇచ్చారు నారావారు.  

జన్మభూమి సభలలో దరఖాస్తు చేసుకునే కొత్తవారికి కూడా ఫిబ్రవరి నెలలో జనవరి బకాయిలతో కలిపి రూ.3వేలు అందుతాయి, మార్చి నుంచి అంతా రూ.2వేలు పింఛను తీసుకుంటారని బాబు చెప్పారు. నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా బోగూరులో ఈ హామీల వరాలు ప్రకటించారు చంద్రబాబు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రూ.200గా ఉన్న పింఛనును రూ.1000కి పెంచామన్నారు. ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని భరోసా ఇచ్చానని.. దానిని జీవితాంతం గుర్తుంచుకుంటానన్నారు.  నెలనెలా ఉద్యోగులకు ఎలాగైతే జీతాలు వస్తాయో.. అదే తరహాలో పింఛన్లు అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు చంద్రబాబు.

వృద్ధులు, వితంతువులు వయోభారంతో, మందులు కొనుక్కొనేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, అందుకే వారి పింఛన్లు పెంచామన్నారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఏడాదికి రాష్ట్ర ఖజానాపై అదనంగా రూ.7 వేల కోట్ల వరకు భారం పడనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పింఛన్ల కోసం నెలకు రూ. 560 కోట్లు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 6720 కోట్లకు పైగా పింఛన్లకు కేటాయిస్తోంది. ఏపీలో ప్రస్తుతం వివిధ రకాల పింఛన్లు అందుకునే వారి సంఖ్య 50 లక్షల 61 వేలు ఉంది. వీరితో పాటు కొత్తగా మరో నాలుగున్నర లక్షల మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీరిలో అర్హులను గుర్తించి... వారికి కూడా పింఛన్ మంజూరు చేయనున్నారు. 

ఒకవేళ కొత్త లబ్దిదారులకు కూడా పింఛన్లు మంజూరైతే... వీటి కోసం ఏపీ ప్రభుత్వం నెలకు రూ. 1200 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆర్ధికశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా ఎవరో హామీ ఇచ్చారని, ఆ హామీని తానే ముందుగా అమలుచేసి జబ్బలు చరుచుకోవడం ఎంతవరకూ సమంజసం అంటున్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని పదేపదే చెప్పే చంద్రబాబు... ఎన్నికల ముందు ఓటర్లకు ఈ తాయిలాలు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. లేడికి లేచిందే పరుగు అన్నట్టు సంక్రాంతికే ఈ కానుకలు అందించడం అప్పుల భారం మరింత పెంచడమే అంటున్నారు ఆర్ధిక నిపుణులు. ఇదిలా ఉంటే ఈ పెన్షన్ల పెంపు క్రెడిట్ చంద్రబాబుదా? ముందే హామీ ఇచ్చిన జగన్‌దా? 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle