newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

బాబు నోట.. ఓటమి మాట!

04-04-201904-04-2019 07:57:45 IST
Updated On 09-07-2019 12:38:20 ISTUpdated On 09-07-20192019-04-04T02:27:45.762Z04-04-2019 2019-04-04T02:27:41.609Z - 2019-07-09T07:08:20.856Z - 09-07-2019

బాబు నోట.. ఓటమి మాట!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చంద్రబాబు నేరుగా ఒప్పుకోరుగానీ, కేసీఆర్‌ను ఆయన ఫాలో అవుతారనేది మాత్రం బాబుగారి చర్యలను  బట్టి ఇట్టే అర్థమైపోతుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్, మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చిన అతి ప్రచారం కేసీఆర్‌ను కూడా భయపెట్టింది. అందుకే.. ఓడిపోతే నాకేం నష్టం లేదు హాయిగా ఫాంహౌస్‌లో పడుకుంటా అని వ్యాఖ్యానించారు కేసీఆర్. కేసీఆర్ అలా మాట్లాడటాన్ని ఓ వర్గం సెంటిమెంట్ రాజేశారని అర్థం చేసుకుంటే మరో వర్గం మాత్రం కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని పండగ చేసుకున్నారు. 

అయితే ప్రజల తీర్పు కేసీఆర్‌కు అనుకూలంగా వచ్చింది. చంద్రబాబు అక్కడ ప్రచారం చేయడం  కేసీఆర్‌కు అప్పుడు అయాచితంగా కలిసొచ్చింది. అందుకే ఏపీ ఎన్నికలపై కేసీఆర్ మాట్లాడాలని చాలా కోరుకుంటున్నారు చంద్రబాబు. అవసరం లేకపోయినా ‘‘ఏయ్ కేసీఆర్ ఏమనుకుంటున్నావ్... ఖబడ్దార్’’ అని కాలుదువ్వుతున్నారు.

బాబుగారి ఉద్దేశం ఏమిటో  కేసీఆర్‌కు అర్థమైపోయింది కాబట్టే చంద్రబాబుకు సరైన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే తాను ఏపీ ఎన్నికల్లో నోరు పెట్టకూడదని ఫిక్సయ్యారు. అయినా చంద్రబాబు మాత్రం  కేసీఆర్‌ను వదిలిపెట్టడం లేదు. 

సర్వేలన్నీ ఏపీలో ఫ్యానుగాలే వీస్తోందని చెప్తోంటే చంద్రబాబుకు ఉక్కపోత పెరిగిపోతోంది. అందుకే ఓడిపోతే నాకేంటి.. నా భార్య పిల్లలు, మనవడితో ఎంజాయ్ చేస్తా అని మాట్లాడారు. చంద్రబాబు ఈ మాటలు అన్నది ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించే అయినా సీక్వెన్స్ మాత్రం కేసీఆర్ ప్రయోగించిన ప్రయోగం లాంటిదేనని అర్థమవుతోంది.

ఈ వయసులో బాబుగారికి ఏం రాజకీయం ఉంటుందిలే ఆయన వీరప్రజాపక్షపాతి అని జనంలో ఓ సెంటిమెంట్ రాజేసేందుకు చంద్రబాబు ఓటమి మాట మాట్లాడి ఉండొచ్చు. మొత్తానికి టీడీపీలో ఎక్కడో తేడా కొట్టేస్తోంది.. అందుకే తెలుగుదేశానికి ఈ ఎన్నికలు గతుకుల రోడ్డుపై సైకిల్ ప్రయాణంలా తోస్తున్నాయి. బాబు మామూలుగా చెప్పిన మాటలే నిజమైతే మాత్రం దేవాన్ష్‌కి తన తాతగారితో ఆడుకునే అవకాశం దొరికినట్లే.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle