newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

బాబు దీక్ష కోసం.. రెండు రైళ్లు.. రూ.కోటి ఖర్చు .. !

09-02-201909-02-2019 11:59:30 IST
Updated On 09-02-2019 12:27:12 ISTUpdated On 09-02-20192019-02-09T06:29:30.756Z09-02-2019 2019-02-09T06:26:33.259Z - 2019-02-09T06:57:12.819Z - 09-02-2019

బాబు దీక్ష కోసం.. రెండు రైళ్లు.. రూ.కోటి ఖర్చు .. !
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్ర మోదీ మీద యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ యుద్ధం ఆయన వ్యక్తిగతంగానో పార్టీపరంగానో చేయడంలేదు. ఏకంగా ప్రభుత్వపరంగా చేస్తున్నారు. ప్రభుత్వ ధనంతో ధర్మపోరాటదీక్షకు తరలి రమ్మని హోర్డింగులు, పేపర్ యాడ్లు ఇచ్చి ప్రజల్ని పిలుస్తున్నారు. ప్రభుత్వ ఖర్చుతో జనాల్ని తరలిస్తున్నారు. వచ్చినవాళ్ళకి పులిహోర పొట్లాలూ, మంచినీళ్ళూ ప్రభుత్వ ఖర్చుతోనే. డయాసూ, మైకూ కూడా ప్రభుత్వానివే. సభ ఏర్పాట్లు చూసేది కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది. ఇదంతా మోదీని, బీజేపీనీ తిట్టిపొయ్యడానికే. 

సరే రాష్ట్రంలోనేకదా ఇవన్నీ అని సరిపుచ్చుకుందామనుకునేవారికి తాజాగా ఈనెల 11న తలపెట్టిన ధర్మపోరాటదీక్ష పెద్ద షాకే ఇచ్చింది. ఈనెల పదకొండవ తారీకుని బాబుగారు 'రాజు వెడలె రవితేజములలరగ' అంటూ వారి మంత్రివర్గ సహచరులందరినీ వెంటబెట్టుకుని ఏకంగా ఢిలీలో దీక్షకి కూర్చొబోతున్నారు. ఇక వారితోబాటు దీక్షలో పాల్గొనడానికి జనాల్ని రైళ్ళలో అమరావతి నుంచి ఢిల్లీకి తరలిస్తున్నారు. 

తాజాగా విడులైన జీవో ప్రకారం..ఏపీ సీఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్ష కోసం ..అద్దెకు రెండు రైళ్లు ..కోటి రూపాయల పైనే ఖర్చు ... ! ఇదీ సంగతి ! కేంద్రంపై ధర్మపోరాటాలకు ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన చంద్రబాబు తన 'బలగం'తో ధర్మపోరాట యుద్ధానికి సమాయత్తమవుతున్నారు. ఇందుకోసం ఏపీ సర్కారు మొత్తాన్ని ఫణంగా పెడుతున్నారు.

ఈ ధర్మపోరాట దీక్షకు జనాన్ని తరలించడానికి ఏకంగా రెండు రైళ్లను రాష్ట్ర ప్రభుత్వం అద్దెకు తీసుకుంది. ఒక్కో రైల్లో 20 బోగీలుంటాయి. ఈ నెల 10 వ తేదీన ఒక రైలు శ్రీకాకుళం నుంచి మొదలైతే..రెండోది అనంతపురం నుంచి మొదలవుతుంది. ఇందులో ఆసక్తి కలిగిన రాజకీయ పార్టీలు, స్వచ్చంద సంస్థలు, వ్యక్తులు పాల్గొనడానికి ఈ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

ప్రభుత్వం విడుదల చేసిన ఆర్దరు ప్రకారం రూ. 1,12, 16, 465 (కోటి పన్నెండు లక్షల పదహారు వేల నాలుగు వందల అరవై అయిదు రూపాయలు) ఖర్చు చేయవచ్చు. అధికారంలో ఉన్న ప్రభుత్వం  తాను  చేపట్టిన ఒకానొక రాజకీయ కార్యక్రమం కోసం ఇటువంటి ఖర్చును ఖజానా నుంచి ఖర్చు చేసుకోవచ్చంటూ ఏకంగా జీవో విడుదల చేయడం ఆశ్చర్యం.

మరోవైపు దీక్షపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్షపై టీడీపీ నేత పంచుమర్తి అనూరాధ ‘న్యూస్ స్టింగ్’తో తన అభిప్రాయాలు పంచుకున్నారు. ‘‘పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసమే చంద్రబాబు దీక్ష చేస్తున్నారు. ప్రజల మద్ధతు కావాలని కోరుకుంటున్నాం. ఏపీ విషయంలో కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చినట్టు ఇచ్చి వాటిని వెనుకకు తీసుకుంది కేంద్రం. తెలుగుప్రజలంటే అంటరానివారిగా చూస్తున్నారు. ఒక నియంతలా, హిట్లర్‌లా మోదీ వ్యవహరిస్తున్నారు. ధర్మపోరాట దీక్ష ప్రభుత్వ కార్యక్రమం కాబట్టే నిధులు విడుదల చేసింది అది తప్పుకాదు, నెగిటివ్ సెన్స్ అసలు లేదు. దీనికి ప్రజల మద్ధతు ఉంది’’ అన్నారు. 

‘‘కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిన విషయం కాదనలేని సత్యం. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని పక్కనపెట్టింది. 100 శాతం హామీలలో ఏమీ అమలుకాలేదు. నిధుల విడుదలలో కేంద్రం ఏపీకి విదిల్చింది కేవలం రెండుశాతమే. మనకు జరిగిన అన్యాయంపై నిరసనలు, దీక్షలు చేయడం తప్పుకాదు. ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి ఖర్చులు తప్పవు. చంద్రబాబు దీక్ష వల్ల ఏదో జరిగిపోతుందని మేం ఆశించడం లేదు. కానీ మన వాదన ఢిల్లీ స్థాయిలో వినిపించాలని భావించడం సమంజసమే’’ అని ‘న్యూస్ స్టింగ్’తో ఏపీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్. తులసిరెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు. 

సీపీఐ నేత నారాయణ ‘న్యూస్ స్టింగ్’తో మాట్లాడుతూ ‘‘చంద్రబాబు దీక్షకు మేం పూర్తిమద్దతు ప్రకటిస్తున్నాం. ఏపీకి జరిగిన అన్యాయం మరోసారి దేశవ్యాప్తంగా తెలియచేసే అవకాశం కలిగింది. మా పార్టీ తరఫున ఎ.రాజా చంద్రబాబు దీక్షకు హాజరై సంఘీభావం ప్రకటిస్తారు. ఏపీకి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన మోడీపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది’’ అన్నారు.  

వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ‘న్యూస్ స్టింగ్’తో మాట్లాడుతూ...‘‘చంద్రబాబు ధర్మపోరాట దీక్ష కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమే. ఇప్పటికే ధర్మపోరాట దీక్షల పేరుతో కోట్లాదిరూపాయల ప్రజాధనం వృధా అయింది. ఇప్పుడు మరికొన్ని కోట్లు ఖర్చుపెట్టి ఎన్నికల ముందు ఏదో చేస్తున్నాం అని భ్రమ కల్పించడమే. నాలుగు సంవత్సరాలు మోడీతో కలిసి ఉన్న చంద్రబాబు ఎన్డీయేనుంచి బయటకు వచ్చాక ధర్మపోరాటం పేరుతో చేస్తున్న హంగామా ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని, ఓట్లు దండుకోవడానికి తెలుగుదేశం పార్టీకి ఇది ఉపయోగపడుతుంది తప్ప జనాలకు ప్రయోజనం లేదు’’  పేర్కొన్నారు. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle