newssting
BITING NEWS :
*ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా. మండలి ఉండాలా వద్దా అనే దానిపై సోమవారం చర్చ. సోమవారం మళ్ళీ సభ పెట్టి మండలిపై చర్చించాలన్న సీఎం వైఎస్ జగన్ *చైర్మన్ నిర్ణయంపై ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. క్రిమినల్ కేసులున్న వాళ్ళు అసెంబ్లీలో ఉన్నారు. అందరి సలహాలు తీసుకున్నాకే బిల్లులు సెలక్ట్ కమిటీకి పంపారు - యనమల *ఏపీ అసెంబ్లీ సోమవారానికి వాయిదా. మండలి ఉండాలా వద్దా అనే దానిపై సోమవారం చర్చ. సోమవారం మళ్ళీ సభ పెట్టి మండలిపై చర్చించాలన్న సీఎం వైఎస్ జగన్ *సంగారెడ్డి జిల్లాలో మరో దిశ ఘటన. అమీర్ పూర్ లో షాప్ కు వెళ్లిన బాలికను కారులో ఎత్తుకెళ్లిన ముగ్గురు దుండగులు. మద్యం తాగి బాలికపై గ్యాంగ్ రేప్. 100 కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చిన బాలిక తల్లిదండ్రులు*శాసనమండలి రద్దుపై చట్టపరంగా ఆలోచన చేస్తాం.. ఎన్ని అడ్డంకులు వచ్చినా మేం ముందుకు వెళ్తాం-మంత్రి బొత్స*అమరావతి: ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం*వికేంద్రీకరణ విషయంలో కేంద్రానికి సంబంధంలేదు.. అమరావతి రైతులకు అండగా ఉంటాం-పవన్ కల్యాణ్*అమరావతి: ఏపీ రాజధాని పిటిషన్ల విచారణకు హైకోర్ట్ ప్రత్యేక బెంచ్.. సీజే ఆధ్వర్యంలో ఏర్పాటైన త్రిసభ్య ధర్మాసనం

బాబు దీక్షతో జగన్ అప్రమత్తం.. ఇక దీక్షలూ గీక్షలూ నై

09-11-201909-11-2019 09:50:57 IST
2019-11-09T04:20:57.417Z09-11-2019 2019-11-09T04:20:37.851Z - - 24-01-2020

బాబు దీక్షతో జగన్ అప్రమత్తం.. ఇక దీక్షలూ గీక్షలూ నై
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక సరఫరాలో కొరత ఉన్న మాట వాస్తవం. చివరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సైతం అంగీకరించక తప్పని వాస్తవం ఇది. అందుకే తలకుమించిన పని భారంతో ఉంటున్నప్పటికీ రాష్ట్రంలో ఇసుక పరిస్థితిపై క్రమంతప్పకుండా సమీక్ష చేస్తూ నవంబర్ నెల చివర్లోగా ఇసుక సంక్షోభం తొలగిపోతుందని హామీ ఇస్తున్నారు.

రాష్ట్రంలోని ఇసుక కొరత గురించి ప్రతిపక్షాలు ఇప్పటికే నానా గొడవా చేసేశాయి. ఇటీవలే జనసేన అధినేత పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ పేరుతో విశాఖపట్నంలో భారీ ర్యాలీ తీశారు. దానికి ఇతర ప్రతిపక్షాలేవీ హాజరు కాకున్నా తెలుగుదేశం పార్టీ నేతలు హాజరై సందడి చేశారు.

మరోవైపున భారతీయ జనతా పార్టీ  కూడా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో విజయవాడలో తన సొంత కార్యక్రమం చేపట్టింది.

ఇసుక నుంచి ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ ప్రయోజనం సాధించడానికి ఇంకేమీ మిగలలేదన్నంతగా ప్రతిపక్షాలు గత వారంరోజులుగా రభస సృష్టించాయి. కానీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం మరోలా ఆలోచిస్తున్నారు.  పవన్ కల్యాణ్, కన్నా లక్ష్మీనారాయణతో పోలిస్తే ఇసుకపై పోరాటంలో తాను వెనకబడిపోయినట్లు సందేహం వచ్చిందాయనకు. 

అందుకే ఆలస్యంగా అయినా సరే విజయవాడ మునిసిపల్ స్టేడియంలో నవంబర్ 14న ఇసుక సమస్యపై ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ దీక్షకు అనుమతి ఇవ్వాల్సిందిగా అరడజను మంది టీడీపీ బడానేతలు ఇప్పటికే విజయవాడ పోలీసు కమిషనర్‌ని కలిసి అభ్యర్థించారు కూడా.

ఎన్నికలు ముగిసిన ఆరునెలల తర్వాత అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని తెలుగుదేశం శ్రేణులను భారీగా తరలించి దీక్షను సక్సెస్ చేయాలని చంద్రబాబు తలిచారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇసుక కొరతపై ప్రతిపక్షాలు చేస్తున్న రభస ఇక చాలని నిర్ణయించుకుంది. నవంబర్ చివరినాటికి రాష్ట్రంలో ఇసుక కొరత అనేదే లేకుండా పోతుందని తాను హామీ ఇస్తుంటే పదే పదే ఈ అంశంపై డ్రామాను పునరావృతం చేయాల్సిన అవసరం లేదని వైఎస్ జగన్ భావించినట్లుంది.

అందుకే చంద్రబాబు విజయవాడలో తలపెట్టిన నిరసన దీక్షకు ప్రభుత్వం నో చెప్పింది. ఇసుక కొరతపై ప్రతిరోజూ మీడియాతో సదస్సుల్లో, సోషల్ మీడియాలో బాబు చెప్పిందే చెబుతూ వస్తున్నారు కదా ఇక దీక్షలో సాధించేదేముందనే ఆలోచన ప్రభుత్వానిది. పైగా మునిసిపల్ స్టేడియం ఉన్నది ప్రభుత్వ కార్యక్రమాలను జరపడానికే కానీ ప్రైవేట్ కార్యక్రమాలను చేయడానికి అనుమతి లేదని ప్రభుత్వం కారణం చూపింది.

అయితే పోలీసులు దీక్షకు అనుమతించనప్పటికీ చంద్రబాబు నిరాహార దీక్ష కొనసాగిస్తారని మరోక వేదికకోసం చూస్తున్నామని టీడీపీ వర్గాలు చెప్పాయి. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తూ వస్తున్నప్పటికీ ఇసుక సమస్య లక్షలాదిమంది జీవితాలపై ప్రభావం వేస్తుండటంతో ఎవరు మద్దతుగా ర్యాలీలకు పిలిచినా భారీగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని గ్రహించిన ప్రభుత్వం ఇక ర్యాలీలకు అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లుంది.

 

దావోస్‌లో బిజీబిజీ.. కేటీఆర్‌కి అరుదైన అవకాశం

దావోస్‌లో బిజీబిజీ.. కేటీఆర్‌కి అరుదైన అవకాశం

   12 minutes ago


మండ‌లి ర‌ద్దు దిశ‌గా జ‌గ‌న్‌..! ఇద్ద‌రు మంత్రులు ఔట్‌..?

మండ‌లి ర‌ద్దు దిశ‌గా జ‌గ‌న్‌..! ఇద్ద‌రు మంత్రులు ఔట్‌..?

   an hour ago


ఆ అవ‌కాశం ఉన్నందునే కౌన్సిల్ ర‌ద్దు చేస్తున్నారా..?

ఆ అవ‌కాశం ఉన్నందునే కౌన్సిల్ ర‌ద్దు చేస్తున్నారా..?

   an hour ago


మునిసిపోల్స్‌లో  గెలుపుపై టీఆర్ఎస్ ధీమా

మునిసిపోల్స్‌లో గెలుపుపై టీఆర్ఎస్ ధీమా

   14 hours ago


‘‘అది వైసీపీ కాదు.. యువజన శ్రామిక రౌడీ పార్టీ’’

‘‘అది వైసీపీ కాదు.. యువజన శ్రామిక రౌడీ పార్టీ’’

   16 hours ago


‘‘మీ పోరాటం, తెగువ చిరస్మరణీయం’’.. ఎమ్మెల్సీలకు బాబు ప్రశంసలు

‘‘మీ పోరాటం, తెగువ చిరస్మరణీయం’’.. ఎమ్మెల్సీలకు బాబు ప్రశంసలు

   18 hours ago


ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ ఫోకస్. తెల్ల రేషన్ కార్డుదారులపై కేసులు

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ ఫోకస్. తెల్ల రేషన్ కార్డుదారులపై కేసులు

   19 hours ago


పీసీసీపై అధిష్టానానికి సీనియర్ల లేఖ.. టార్గెట్ రేవంత్ రెడ్డే?

పీసీసీపై అధిష్టానానికి సీనియర్ల లేఖ.. టార్గెట్ రేవంత్ రెడ్డే?

   19 hours ago


మండలి పరిణామాలపై ఛైర్మన్ షరీఫ్ మనస్తాపం?

మండలి పరిణామాలపై ఛైర్మన్ షరీఫ్ మనస్తాపం?

   19 hours ago


కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా 93 మంది ఢీ... అసలేం జరుగుతోంది?

కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా 93 మంది ఢీ... అసలేం జరుగుతోంది?

   20 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle