newssting
BITING NEWS :
*జపాన్ టీంని ఓడించిన ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం *ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం... దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్*బీహార్ లో మెదడువాపు వ్యాధికి బలమయిన 152 మంది చిన్నారులు *ప్రజావేదికను కూల్చేయండి.. సీఎం జగన్ ఆదేశం*కొనసాగుతున్న ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్*అఫ్గాన్‌పై బంగ్లా ఘనవిజయం

బాబు ఢిల్లీ టూర్.. ఏం సాధించినట్టు?

22-05-201922-05-2019 08:22:21 IST
Updated On 22-05-2019 08:23:01 ISTUpdated On 22-05-20192019-05-22T02:52:21.500Z22-05-2019 2019-05-22T02:52:17.016Z - 2019-05-22T02:53:01.245Z - 22-05-2019

బాబు ఢిల్లీ టూర్.. ఏం సాధించినట్టు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చంద్రబాబు మాట్లాడితే ఢిల్లీకి పరిగెడుతున్నారు. అక్కడ నలుగురైదుగురు విపక్ష పార్టీల నేతలతో మంతనాలు జరుపుతున్నారు. మంగళవారం జరిగింది కూడా అదే. అయితే ఫలితం మాత్రం ఏం  లేదు. విపక్ష పార్టీల సమావేశానికి చాలామంది నేతలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. 

ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల తర్వాత విపక్షపార్టీలు డీలా పడినట్టు కనిపిస్తోంది. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల లెక్కింపుపై పట్టువీడమని చెప్పిన విపక్షాలు ఒక్కొక్కరు కీలక భేటీలకు డుమ్మాకొట్టడం కనిపించింది. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి గెలుస్తుందని ఎగ్జిట్స్‌ పోల్స్‌ ఫలితాలు ప్రకటించడంతో హస్తినలో రాజకీయా సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. 

అయితే విపక్షపార్టీల మధ్య దూరం పెరిగిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తాజాగా మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విపక్షాల సమావేశానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన ఎందుకు డుమ్మా కొట్టారనేది పక్కన పెడితే ఇంకొందరు నేతలు కూడా రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. 

సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రవర్తించిన తీరు, 50 శాతం వీవీప్యాట్‌ల లెక్కింపుపై చర్చించేందుకు మంగళవారం స్థానిక కాన్స్టిట్యూషన్‌ క్లబ్‌లో విపక్షాల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అనంతరం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని నేతలు అభిప్రాయపడ్డారు. అయితే రాహుల్‌, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక సీఎంలు మమతా బెనర్జీ, కుమారస్వామి, యూపీ ఆగ్రనాయకులు అఖిలేష్‌ యాదవ్‌, మాయావతి‌ ఎన్సీపీ అధ్యక్షుడు శరదపవార్‌లు సమావేశానికి హాజరుకాకపోవడం గమనార్హం. 

‘‘ప్రజాస్వామ్య వ్యవస్థలో విశ్వసనీయత నెలకొల్పేందుకే విపక్షపార్టీలుగా ఏకమై పోరాడుతున్నాం. స్ట్రాంగ్‌రూమ్‌లలోని ఈవీఎంలను మార్చేస్తున్నారని, బయటి నుంచి ఫ్రీక్వెన్సీతో ఈవీఎంలలో ఓట్లు మార్చారని ఇలాంటి ఎన్నో అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉంది’’-చంద్రబాబునాయుడు 

కాగా, ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల అధినేతలు తమ పార్టీల ప్రతినిధులను పంపించారు. ఈ సమావేశానికి అజాద్‌, అహ్మద్‌ పటేల్‌(కాంగ్రెస్‌), సీతారం ఏచూరి(సీపీఎం), కనిమొళి(డీఎంకే), సుధాకర్‌ రెడ్డి, డి. రాజా(సీపీఐ), రాంగోపాల్‌ యాదవ్‌(ఎస్పీ), కేజ్రీవాల్‌(ఆప్‌)లు హాజరయ్యారు.  కనీసం 50 శాతం కూడా లెక్కించడానికి ఈసీ సుముఖంగా లేకపోవడంతో.. ఓట్ల లెక్కింపునకు ముందు వీవీ ప్యాట్లను లెక్కించాలని చంద్రబాబు అండ్ కో డిమాండ్ చేసింది. ఇదిలా ఉంటే బాబు టూర్లలో భాగంగా బుధవారం కర్నాటక వెళ్ళనున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle