newssting
BITING NEWS :
*ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాప్.. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి-అశ్వత్థామరెడ్డి *తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ *రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి శివసేన ఎంపీ లేఖ.. రాజ్యసభలో మేం కూర్చునే వరస క్రమాన్ని మార్చడంపై అభ్యంతరం *ఢిల్లీ: ప్రధాని మోడీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ... రైతు సమస్యలపై చర్చించేందుకే వెళ్లానన్న శరద్ పవార్ *హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ లోని హీరో నాని, వెంకటేష్, రామానాయుడు స్టూడియోల్లో ఐటీ అధికారుల సోదాలు *కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. సోనియాగాంధీ అధ్యక్షతన లోక్‌సభ ఎంపీల భేటీ.. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ *గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో అక్రమ బ్యానర్లు, పోస్టర్ల తొలగింపు.. 10 వేలకు పైగా ప్లెక్సీలు తొలగించిన జీహెచ్‌ఎంసీ*బేగంపేట్‌-అమీర్‌పేట్ స్టేషన్ల మధ్య సింగిల్‌ లైన్ విధానంలో మెట్రోసేవలు-హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

‘‘బాబు డ్రామాలు ఆపు.. మాకు 150 సీట్లు’’

13-04-201913-04-2019 16:34:44 IST
Updated On 13-04-2019 18:05:57 ISTUpdated On 13-04-20192019-04-13T11:04:44.919Z13-04-2019 2019-04-13T11:04:42.125Z - 2019-04-13T12:35:57.615Z - 13-04-2019

‘‘బాబు డ్రామాలు ఆపు.. మాకు 150 సీట్లు’’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఎన్నికల తీరు, చంద్రబాబు వైఖరిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఎవరు ఎన్ని డ్రామాలు చేసినా ఇక అవి చెల్లవన్నారు ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ.  మే 23వ తేదీన వెలువడే ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 150 అసెంబ్లీ సీట్లు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు బొత్స సత్యనారాయణ. ఎన్నికల సరళి, ఫలితాలపై ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు.  స్ట్రాంగ్‌రూమ్‌లో ఉన్న ఈవీఎంలను మేం ట్యాంపరింగ్ చేస్తామనే అనుమానాలుంటే.. సీఎం చంద్రబాబు అక్కడే పడుకోవాలని సెటైర్లు వేశారు. 

కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరకు వెళ్లి చంద్రబాబు చేస్తోన్న డ్రామాలు హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ నేతలు ఎన్ని ఆటంకాలు సృష్టించినా వైసీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు బొత్స. ఇక స్పీకర్ పై డాడి ఘటనలో అంబటి రాంబాబు అక్కడ లేకపోయినా కేసులు పెట్టడం దారుణమైన విషయం అని మండిపడ్డారు. చంద్రబాబు ఎమ్మెల్యేలను పశువుల్లాగా కొన్నప్పుడు కోడెలపై ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయలేకపోయారు.. అందుకే జనం ఇప్పుడు చితకబాదారని ఎద్దేవా చేశారు. 

మరో వైపు ఈవీఎంలు భద్రపరిచిన సెంటర్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలంటూ వైఎస్సార్‌సీపీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించే పరిస్థితులు లేనందున ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రాల వద్ద సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ వంటి కేంద్ర బలగాలను మొహరించాలని విజ్ఞప్తి చేశారు. ఓట్లు లెక్కించడానికి చాలా సమయం ఉన్నందున స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద గట్టి నిఘా పెట్టాలని కోరారు.

 

ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాఫ్.. కండిషన్స్ అప్లై

ఆర్టీసీ సమ్మెకు జేఏసీ ఫుల్ స్టాఫ్.. కండిషన్స్ అప్లై

   11 hours ago


ఎంపీలపై జగన్ ఆంక్షలు.. అసహనమా? అనుమానమా?

ఎంపీలపై జగన్ ఆంక్షలు.. అసహనమా? అనుమానమా?

   12 hours ago


టీటీడీ వివాదం.. మంత్రి కొడాలిపై బీజేపీ ఫిర్యాదులు

టీటీడీ వివాదం.. మంత్రి కొడాలిపై బీజేపీ ఫిర్యాదులు

   13 hours ago


ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ పట్టించుకోవాలి

ఆర్టీసీ కార్మికులను కేసీఆర్ పట్టించుకోవాలి

   14 hours ago


మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలన్నాను... తప్పేంటి.. నిలదీసిన  వైకాపా ఎంపీ

మాతృభాషకు ప్రాధాన్యమివ్వాలన్నాను... తప్పేంటి.. నిలదీసిన వైకాపా ఎంపీ

   16 hours ago


జ‌గ‌న్ జైలుకు వెళ్తారనే ప్ర‌చారం ఇందుకేనా..?

జ‌గ‌న్ జైలుకు వెళ్తారనే ప్ర‌చారం ఇందుకేనా..?

   16 hours ago


ప్రైవేటీకరణ ఒక ట్రెండ్.. తప్పేంటి.. హైకోర్టు వ్యాఖ్య.. షాక్‌లో జేఏసీ

ప్రైవేటీకరణ ఒక ట్రెండ్.. తప్పేంటి.. హైకోర్టు వ్యాఖ్య.. షాక్‌లో జేఏసీ

   17 hours ago


బీజేపీ వైపు వైసీపీ ఎంపీల చూపు!?  అలర్టైన ఏపీ సీఎం!

బీజేపీ వైపు వైసీపీ ఎంపీల చూపు!? అలర్టైన ఏపీ సీఎం!

   19 hours ago


ఇక నో బీజేపీ, నో ఎన్డీయే: శివసేన

ఇక నో బీజేపీ, నో ఎన్డీయే: శివసేన

   19 hours ago


 ఎమ్మెల్యే శ్రీదేవి పదవి నిలిచేనా... 26న విచారణ..

ఎమ్మెల్యే శ్రీదేవి పదవి నిలిచేనా... 26న విచారణ..

   19 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle