newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

బాబు, జగన్.. ముందు జైలు మెట్లెక్కేదెవరు?

21-11-201921-11-2019 16:17:22 IST
Updated On 21-11-2019 16:58:31 ISTUpdated On 21-11-20192019-11-21T10:47:22.218Z21-11-2019 2019-11-21T10:46:21.611Z - 2019-11-21T11:28:31.667Z - 21-11-2019

బాబు, జగన్.. ముందు జైలు మెట్లెక్కేదెవరు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకరు ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి.. మరొకరి మూడుసార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి దేశ రాజకీయాలకు కూడా సుపరిచుడైన నేత.. వాళ్లే జగన్మోహన్ రెడ్డి.. నారా చంద్రబాబు నాయుడు. మరి వీళ్లిద్దరిలో ముందుగా జైలుకెళ్లేదెవరు? అంటూ రాష్ట్రంలో ఓ సంచలమైన ప్రచారం ఒకటి చక్కర్లు కొడుతోంది. నిన్న మొన్నటి వరకు సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దయితే జైలుకు తప్పేదేమో అని ప్రచారం జరిగింది.

గత రెండు రోజుల నుండి ఏమో మాజీ సీఎం చంద్రబాబు కూడా జైలుకు వెళ్లివచ్చేమో.. అంటూ మరో ప్రచారం మొదలైంది. దీనికి కారణం 14 ఏళ్ల క్రితం చంద్రబాబుపై నమోదైన కేసు ఇప్పుడు దుమ్ముదులిపి బయటకు తీశారు. అప్పుడు ఇప్పుడూ చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేసే ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మిపార్వతి 14  ఏళ్ల క్రితం చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నారని ఫిర్యాదు చేశారు.

అప్పుడు ఏసీబీ కోర్టులో లక్ష్మీపార్వతి దాఖలు చేసిన ఫిర్యాదుపై తదుపరి విచారణ చేపట్టేందుకు ఏసీబీ కోర్టు ఇప్పుడు అంగీ కరించింది. లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేయగా, దానిపై పూర్తిస్థాయి విచారణ ప్రారంభించకముందే చంద్రబాబు ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అప్పుడు కథ అక్కడ ఆగిపోయింది. అయితే ఇప్పుడున్న టెక్నీకల్ కారణాల వలన మరోసారి ఆ కేసును బయటకు తీశారు.

అందుకు సివిల్, క్రిమినల్‌ కేసుల్లో స్టే ఆరు నెలలకు మించకూడదని సుప్రీంకోర్టు గతఏడాది ఇచ్చిన తీర్పు కలిసిరాగా ఇప్పుడు ఏసీబీ కోర్టు విచారణ ప్రారంభించింది. ఈకేసు విచారణ ప్రారంభమైతే తిప్పలు తప్పవని అసలే హైదరాబాద్ ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేయనుండడం, రెండు రాష్ట్రాలలో అయన శత్రువులే ప్రభుత్వాలలో ఉండడం వంటివి ఏమో జైలుకి వెళ్లినా ఆశ్చర్యం లేదంటున్నారు.

మరోపక్క సీఎం జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులలో కోర్టుకు హాజరుకాకపోవడం, కేసును సిబిఐ ముమ్మరం చేయడం వంటి వాటితో జగన్ మరోసారి జైలుకి వెళ్లడం ఖాయమని ప్రచారం ముందు నుండే జరుగుతుంది. చంద్రబాబుపై కూడా ఆస్తుల కేసులో ఎంతోకొంత అక్రమం అని తేలినా వైసీపీ శ్రేణులకు ఎదురుదాడికి అస్త్రాలు దొరికినట్లేనని కాచుకుకూర్చున్నారు.

సిబిఐ కేసులలో జగన్ జైలుకెళ్తే ఆ పార్టీలో సీఎం అయ్యే అవకాశం ఎవరికి ఉంటుందని?, జగన్ భార్య భారతి సీఎం కావచ్చని.. కాదు కాదు విజయమ్మ అయితే గౌరవంగా ఉంటుందని, మంత్రి పెద్దిరెడ్డికి అవకాశం లేకపోలేదని చర్చలు సాగుతుంటే.. చంద్రబాబు జైలుకెళ్తే టీడీపీ మూడు ముక్కలై నామరూపాల్లేకుండాపోతుందని ఇక తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోయినా ఆశ్చర్యం లేదని రచ్చబండ వ్యాఖ్యలు సాగుతున్నాయి. మరి ఇద్దరి నాయకులలో ముందు జైలుకెళ్లేది ఎవరో? లేక నిర్దోషులు అని తేలకపోయినా మరికొన్నాళ్లు సాగదీసుడే అవుతుందేమో చూడాలి.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle