newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

బాబు కోసం మ‌ళ్లీ త‌లుపులు తెరుస్తారా..?

13-10-201913-10-2019 09:49:29 IST
2019-10-13T04:19:29.936Z13-10-2019 2019-10-13T04:18:51.866Z - - 09-12-2019

బాబు కోసం మ‌ళ్లీ త‌లుపులు తెరుస్తారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భార‌తీయ జ‌న‌తా పార్టీకి తెలుగుదేశం పార్టీకి అవినాభావ సంబంధం ఉండేది. టీడీపీ ఆవిర్భ‌వించిన నాటి నుంచి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీకి టీడీపీ పెద్ద‌న్న‌లా వ్య‌వ‌హ‌రించేది.

ఇక్క‌డ బ‌లంగా ఉన్న టీడీపీ.. బీజేపీకి ఎన్నిక‌ల్లో ఎన్నో కొన్ని సీట్లు ఇచ్చి పొత్తు కుదుర్చుకునేది. రెండు పార్టీల ఓటు బ్యాంకు క‌లిసి టీడీపీ సులువుగా విజ‌యం సాధించేది.

2014 ఎన్నిక‌ల్లోనూ టీడీపీ గెలుపున‌కు ప్ర‌ధాన కార‌ణం దేశ‌వ్యాప్తంగా న‌రేంద్ర మోడీ హ‌వా. బీజేపీతో పొత్తు కార‌ణంగా ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుపు సులువైంది. మూడున్న‌రేళ్లు రెండు పార్టీలు క‌లిసి రాష్ట్రంలో, కేంద్రంలో అధికారం సైతం పంచుకున్నాయి.

అయితే, రాజ‌కీయ వ్యూహాలు ప‌న్న‌డంలో దిట్ట అయిన చంద్ర‌బాబు బీజేపీతో విభేదాలు పెట్టుకున్నారు. వైసీపీ కేంద్రానికి ద‌గ్గ‌ర‌వుతున్న‌ట్లు క‌నిపించ‌డం, ప్ర‌త్యేక హోదా సాధించ‌లేని పార్టీగా టీడీపీపై ముద్ర‌ప‌డుతుండ‌టంతో చంద్ర‌బాబు కేంద్రంతో తెగ‌దెంపులు చేసుకున్నారు.

దీంతో 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ, బీజేపీ ఘోరంగా న‌ష్ట‌పోయాయి. జ‌గ‌న్‌కు భారీ విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టాయి. ఓట‌మికి కార‌ణాల‌ను విశ్లేషించుకున్న చంద్రబాబు కేంద్రంతో విభేదాలు పెట్టుకోవ‌డం త‌ప్ప‌ని, దీంతో న‌ష్ట‌పోయామ‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు.

ఈ విష‌యాన్ని బాహాటంగానే ప్ర‌క‌టించారు. అయితే, గ‌తంలో 2009 ఎన్నిక‌ల్లో బీజేపీకి దూర‌మైనా త‌ర్వాత 2014లో పొత్తుకు బీజేపీ ఒప్పుకుంది. కానీ, ఇప్పుడు మాత్రం మ‌ళ్లీ బీజేపీ, టీడీపీ దోస్తీకి అవ‌కాశాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయి.

ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు కేంద్రంతో విభేదించిన చంద్ర‌బాబు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షాపై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగారు. ఓ ద‌శ‌లో న‌రేంద్ర మోడీని రాజ‌కీయ తీవ్ర‌వాదిగా పోల్చారు.

న‌రేంద్ర మోడీ ప్ర‌ధాని హోదాలో విజ‌య‌వాడ‌కు వ‌స్తే న‌ల్ల జెండాలు చూపించారు. ఒక ర‌కంగా వారిద్ద‌రితో చంద్ర‌బాబు వ్య‌క్తిగ‌త వైరం పెట్టుకున్నారు. అన్నింటికీ మించి ఎన్నిక‌ల ముందు దేశ‌వ్యాప్తంగా ప‌ర్య‌టించి న‌రేంద్ర మోడీని దించేసేందుకు ప్ర‌య‌త్నించారు. మొద‌టిసారిగా కాంగ్రెస్ పార్టీతోనూ చంద్ర‌బాబు జ‌త క‌లిశారు.

అయితే, ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో టీడీపీ ఓట‌మి, కేంద్రంలో మ‌ళ్లీ న‌రేంద్ర మోడీ గెల‌వ‌డంతో చంద్ర‌బాబు నాయుడుకు ఒక్క‌సారిగా చేసిన త‌ప్పు అర్థ‌మైంది. దీంతో ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ న‌రేంద్ర మోడీతో ఢీ అంటే ఢీ అనేలా మాట్లాడిన ఆయ‌న ఎన్నిక‌ల త‌ర్వాత ఒక్కటంటే ఒక్క మాట కూడా మోడీకి వ్య‌తిరేకంగా మాట్లాడ‌టం లేదు.

తాజాగా, బీజేపీతో విడిపోయి న‌ష్ట‌పోయామ‌ని ఆయ‌న పార్టీ స‌మావేశంలోనే అంగీక‌రించారు. దీనిని బ‌ట్టి చూస్తే బీజేపీతో విభేదాలు దూరం చేసుకోవాల‌ని చంద్ర‌బాబు ఆలోచిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.

అయితే, ఇన్నేళ్లుగా ఒక లెక్క.. ఇప్పుడు మ‌రో లెక్క అన్న‌ట్లుగా బీజేపీ ఆలోచిస్తోంది. ఏపీలో టీడీపీతో సంబంధం లేకుండా ఒంట‌రిగా ఎదిగేందుకు అమిత్ షా క‌స‌ర‌త్తు చేస్తున్నారు. చేరిక‌లు, ప్ర‌భుత్వ వ్య‌తిరేక పోరాటాల‌తో బీజేపీ దూకుడుగా వెళుతోంది.

తాజాగా, బీజేపీ ఏపీ వ్య‌వ‌హారాల ఇంఛార్జి సునీల్ డియోధ‌ర్ కూడా స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చారు. బీజేపీలోకి నేత‌ల‌ను వెళ్ల‌వ‌ద్ద‌ని, బీజేపీతో పొత్తు పెట్టుకుంటామ‌ని చంద్ర‌బాబు టీడీపీ నేత‌ల‌కు చెబుతున్నార‌ని సునీల్ అంటున్నారు.

అయితే, అమిత్ షా ఇప్ప‌టికే టీడీపీకి ఎన్‌డీఏ త‌లుపులు శాశ్వ‌తంగా మూసేసిన‌ట్లు చెప్పార‌ని, మ‌ళ్లీ టీడీపీతో పొత్తు స‌మ‌స్యే లేద‌ని సునీల్ ప్ర‌క‌టించారు.

చంద్ర‌బాబు పీక‌ల్లోతు అవినీతిలో కూరుకుపోయార‌ని, ఇందుకు ఆయ‌న శిక్ష అనుభ‌వించ‌క త‌ప్ప‌ద‌ని చెప్పారు. మొత్తంగా ఈసారి మాత్రం చంద్ర‌బాబుకు మ‌ళ్లీ బీజేపీతో క‌ల‌వ‌డం అంత ఈజీగా అయితే కుదిరే ప‌నిలా క‌నిపించ‌డం లేదు. కానీ, బీజేపీలో చంద్ర‌బాబుకు స‌న్నిహితులైన నేత‌ల‌తో పాత ప‌రిచ‌యాలు చాలానే ఉన్నాయి. కాబ‌ట్టి, ఏం జ‌రుగుతుందో చూడాలి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle