newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

బాబు కొత్త పల్లవి....ఈవీఎంల హ్యాకింగ్ రష్యా పనే!

24-04-201924-04-2019 08:15:51 IST
Updated On 24-04-2019 18:13:51 ISTUpdated On 24-04-20192019-04-24T02:45:51.727Z24-04-2019 2019-04-24T02:44:33.340Z - 2019-04-24T12:43:51.763Z - 24-04-2019

బాబు కొత్త పల్లవి....ఈవీఎంల హ్యాకింగ్ రష్యా పనే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం చంద్రబాబు మళ్ళీ పాతపాటే పాడారు. ఈవీఎంల విషయంలో ఆయన పట్టువీడడం లేదు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎం) ఇప్పటికీ లోపభూయిష్టంగానే ఉన్నాయని, వాటిని ఎవరైనా హ్యాక్‌ చేసేందుకు అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు వేమూరు హరికృష్ణ ప్రసాద్‌ సందేహాలు లేవనెత్తారు.  వీవీప్యాట్‌లో స్లిప్‌ 7 సెకన్లు కనిపించేలా కోడ్‌ రాసినప్పుడు, స్లిప్‌ 3 సెకన్లే కనిపిస్తుంటే  కోడ్‌ మారినట్టా కాదా? అన్నారు.

అంతేకాదు ఏడుసెకన్లపాటు వీవీ ప్యాట్ స్లిప్ కనిపించాలని. కానీ 3 సెకన్లే కనిపిస్తే.. ఏదో జరిగిందని అర్థం అన్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు సైతం ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం చంద్రబాబు మరో పల్లవి ఎత్తుకున్నారు. ఈవీఎంల హ్యాకింగ్ రష్యా వారి పనే అంటున్నారు.

రష్యానుంచి వచ్చిన కొంతమంది వ్యక్తులు ఈ పనికి పాల్పడ్డారని బాబు ఆరోపించారు. వీరికి ఎంత చెల్లించారనేది తెలియదు. కానీ వారు మాత్రం హ్యాక్ చేశారన్నారు. ఎన్నికలు జరిగిన తర్వాత అన్ని వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాల్సిందే అని ఆయన పునరుద్ధాటించారు. దీనిపై అవసరమయితే మళ్లీ సుప్రీంకోర్టు తలుపులు తడతామన్నారు. పైగా ఈ ఎన్నికల్లో వందకు వెయ్యి శాతం గెలుస్తున్నాం అని చంద్రబాబు ప్రకటించడం ఆల్జీబ్రా గురించి బాగా తెలిసినవాళ్ళకు కూడా అర్థంకాని బ్రహ్మపదార్థం. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle