newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

బాబు కేసీఆర్ జపం... విస్తుపోతున్న జనం

24-03-201924-03-2019 07:57:02 IST
Updated On 24-03-2019 07:57:32 ISTUpdated On 24-03-20192019-03-24T02:27:02.908Z24-03-2019 2019-03-24T02:26:54.996Z - 2019-03-24T02:27:32.164Z - 24-03-2019

బాబు కేసీఆర్ జపం... విస్తుపోతున్న జనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాజకీయాల్లో  నిత్యం ఒకపేరు మార్మోగిపోతున్నది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిరోజూ కేసీఆర్ నామస్మరణే చేస్తున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ కూడా తెలంగాణపై విమర్శలు చేస్తున్నారు. స్థాయి దిగజారి ప్రవర్తిస్తున్నారు. తెలంగాణకు వెళ్తే ఆంధ్రావాళ్లను కొడుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అభాసుపాలయ్యారు.

సీఎం కేసీఆర్ ఏ ముహూర్తాన రిటర్న్‌గిఫ్ట్ ఇస్తా అన్నారో కానీ, టీడీపీ అధినేత చంద్రబాబుకు కంటిమీద కునుకు లేకుండా పోతున్నది. ఇటీవలి కాలం వరకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎదురైనా ఇది కేసీఆర్ రిటర్న్‌గిఫ్టే అని విమర్శించిన చంద్రబాబు.. తాజాగా ఎన్నికల ప్రచారంలోనూ వదిలిపెట్టడం లేదు. ప్రచారం సందర్భంగా ఏ బహిరంగసభ వేదికపై నుంచి మాట్లాడినా.. కేసీఆర్ నామస్మరణ చేస్తున్నారు. 

కేసీఆర్ పెత్తనం చేస్తున్నారని, కేసీఆర్ దాడులు చేస్తున్నారని, కేసీఆర్ ఏపీ అభివృద్ధిని అడ్డుకొంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇలా ప్రతి సభలో చంద్రబాబు కేసీఆర్ జపం చేస్తుండటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో సైతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ పై పెత్తనం చేయడానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని, జగన్ గెలుపు కోసం డబ్బులు పంపుతున్నారని చంద్రబాబు ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు.  

ఏపీ అభివృద్ధి చెందకపోవడానికి కేసీఆర్ కారణమని ప్రచారంలో పేర్కొంటున్నారు. ప్రత్యేకహోదా, విభజన హక్కులను సాధించుకోవటంలో అడ్డుపడుతున్నారని ప్రజలను నమ్మించేందుకు తిప్పలు పడుతున్నారు.  తెలంగాణ సీఎం కేసీఆర్‌పై.. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ విమర్శలు చేయడం పట్ల ఏపీ ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వీరి దిగజారుడు రాజకీయాలపై సోషల్‌మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి. తానుచేసిన అభివృద్ధి గురించి కాకుండా కేసీఆర్‌పై పదేపదే విమర్శలు చేయడం బాబులోని ఓటమి భయాన్ని సూచిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle