newssting
BITING NEWS :
*హైదరాబాద్‌: ఓయూ ప్రొఫెసర్ కాశింను హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసంలో హాజరుపర్చిన గజ్వేల్ పోలీసులు*షిర్డీలో కొనసాగుతోన్న బంద్.. షిర్డీతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోనూ బంద్.. షిర్డీలో తెరుచుకోని షాపులు, బంద్ కొనసాగించాలని షిర్డీ గ్రామ సభ నిర్ణయం*తిరుమల: రేపటి నుంచి శ్రీవారి భక్తులకు ఉచితంగా లడ్డూ... సబ్సిడీపై ఇస్తున్న లడ్డూలను నిలిపివేయనున్న టీటీడీ.. అదనపు లడ్డూ కోసం రూ.50*నేడు షిరిడీ బంద్... బాబా ఆలయం తెరిచి ఉంటుంది, దర్శనాలకు ఎలాంటి ఇబ్బందిలేదు, భక్తులు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు, భక్తులకు ఇబ్బంది లేకుండా షిరిడీ బంద్-సాయి ట్రస్ట్*హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... 32 కేసులు నమోదు, 16 కార్లు, 16 బైక్‌లు సీజ్... నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు*విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా ప్రకటించాలని నేడు మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తగరపు వలసలో భారీ ర్యాలీ*నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే.. బెంగళూరు వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం

బాబు ఆశ‌ల‌కు గండి కొడుతున్న బీజేపీ

12-11-201912-11-2019 07:56:04 IST
2019-11-12T02:26:04.914Z12-11-2019 2019-11-12T02:16:47.150Z - - 19-01-2020

బాబు ఆశ‌ల‌కు గండి కొడుతున్న బీజేపీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చి ఆరు నెల‌లు కూడా కాక‌ముందే తీవ్ర స్థాయిలో ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కుంటున్నారు. అన్ని పార్టీలూ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన నెల రోజుల నుంచే యుద్ధాన్ని ప్ర‌క‌టించాయి.

వివిధ స‌మ‌స్య‌ల‌పై ఏ పార్టీకి ఆ పార్టీ పోరాడుతోంది. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో రెండు స్థానం కోసం పోటీ తీవ్రంగా ఉండ‌టంతో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త కార్య‌క్ర‌మాల ద్వారా ఈ ప్లేస్‌ను సొంతం చేసుకోవాల‌ని అన్ని పార్టీలూ ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.

దీంతో ప్ర‌భుత్వంపై పోరాడుతూనే ఆ క్రెడిట్ త‌మ ఖాతాలో వేసుకునేందుకు భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌య‌త్నిస్తోంది. కానీ, చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యూహాలు ర‌చిస్తున్నారు.

రాష్ట్రంలో వైసీపీ బ‌లంగా ఉండ‌టంతో ఆ పార్టీని ఎదుర్కునేందుకు ఒంట‌రి పోరు చేస్తే స‌రిపోద‌ని ఈ ఇద్ద‌రు నేత‌లు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు.

ఇద్ద‌రి అభిప్రాయాలు క‌ల‌వ‌డం, ఇద్ద‌రూ పాత స్నేహితులే కావ‌డంతో క‌లిసి ప్ర‌భుత్వంపై పోరాడేందుకు టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య ఒక ఏకాభిప్రాయం కుదిరింది.

ఇటీవ‌ల ఇసుక స‌మ‌స్య‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ విశాఖ‌ప‌ట్నంలో చేసిన లాంగ్ మార్చ్‌కు చంద్ర‌బాబు నాయుడు త‌న పార్టీ త‌ర‌పున ప్ర‌తినిధుల‌ను పంపించి మ‌ద్ద‌తు తెలిపారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌ట్ల చంద్రబాబు మొద‌టి నుంచీ సానుకూలంగా ఉన్నారు.

ఇక‌, ఇదే ఇసుక స‌మ‌స్య‌పై 14న చంద్ర‌బాబు జ‌ర‌ప‌నున్న దీక్ష‌కు జ‌న‌సేన పార్టీ మ‌ద్ద‌తు తీసుకుంది తెలుగుదేశం. కానీ, ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత బీజేపీకి మ‌ళ్లీ ద‌గ్గ‌ర కావాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న చంద్ర‌బాబు ఆ పార్టీ మ‌ద్ద‌తు కూడా అర్జించారు. వాస్త‌వానికి, ఆ పార్టీ మ‌ద్ద‌తు ఇచ్చినా, ఇవ్వ‌క‌పోయినా ఆయ‌న దీక్ష‌పై పెద్ద‌గా ప్ర‌భావం ఉండ‌దు.

కానీ, తెలంగాణ ఆర్టీసీ కార్మికుల స‌మ్మెకు మ‌ద్ద‌తుగా అన్ని పార్టీలూ క‌లిసి కొట్లాడి ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెడుతున్న‌ట్లే ఏపీలో కూడా అన్ని పార్టీలూ క‌లిసి వైసీపీ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టాల‌నేది చంద్ర‌బాబు నాయుడు వ్యూహం.

కానీ, బీజేపీ మాత్రం బాబు వ్యూహాల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. బీజేపీ మ‌ద్ద‌తు కోసం టీడీపీ నేత ఆల‌పాటి రాజాను బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వ‌ద్ద‌కు పంపారు చంద్ర‌బాబు.

కానీ, ఆయ‌న నుంచి చంద్ర‌బాబు దీక్ష‌కు మ‌ద్ద‌తు ల‌భించ‌లేదు. ఇంత‌కాలం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పొత్తుల వ‌ల్ల న‌ష్ట‌పోయిన తాము ఇక ఎవ‌రితో క‌ల‌వ‌కుండా ఒంట‌రిగా ఎద‌గాల‌ని బీజేపీ భావిస్తోంది.

ఇప్పుడు మ‌ళ్లీ చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిస్తే త‌మ‌కేమీ లాభం లేక‌పోగా న‌ష్ట‌మేన‌ని బీజేపీ అంచ‌నా వేస్తోంది. దీంతో స్వంతంగా ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఆందోళ‌న‌ల‌కు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది.

మొత్తానికి ఏపీలో తెలంగాణ సీన్ రిపీట్ చేసి ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో అసంతృప్తిని తీసుకురావాల‌ని చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు బీజేపీ గండి కొడుతోంది. స‌మీప భ‌విష్య‌త్‌లో ఈ రెండు పార్టీలు మ‌ళ్లీ క‌లిసి ప‌నిచేయ‌డం అనుమానంగానే ఉంది. ఇప్ప‌టికైతే టీడీపీ, జ‌న‌సేన మాత్రం క‌లిసి ప్ర‌భుత్వ‌పై పోరాడాతాయ‌న్న‌మాట‌.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle