newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

బాబు అఖిలపక్షానికి అందరూ డుమ్మా

30-01-201930-01-2019 08:21:35 IST
2019-01-30T02:51:35.029Z30-01-2019 2019-01-30T02:51:27.828Z - - 17-07-2019

బాబు అఖిలపక్షానికి అందరూ డుమ్మా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చంద్రబాబు రాష్ట్రం హక్కుల కోసం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం అట్టర్ ఫ్లాప్ అవుతున్నట్లే ! విపక్షాలన్నీ ఒక్కటొక్కటిగా మొఖం చాటేస్తున్నాయి. ఈ సమావేశానికి రాబోమని కొంతమంది అంటే మొక్కుబడి సమావేశాలకు మేము రామంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏకంగా బహిరంగలేఖ రాయడం విశేషం. 

సాధారణంగా అఖిలపక్ష సమావేశాలకు ముందుండే వామపక్షాలు కూడా ఈ సమావేశాలకు రావడం లేదు. అంతకుముందు ఉండవల్లి అరుణ్ కుమార్ నిర్వహించిన ఇదే అఖిలపక్షానికి వచ్చిన సిపిఐ ఇక్కడకు మాత్రం రావడం లేదు. వైఎస్సార్ పార్టీ రెండు చోట్ల ముఖం చాటేసింది. 

నాలుగేళ్లపాటు నరేంద్ర మోడీ జపం చేసి ఎన్నికల ముందు బయటకొచ్చి ఇప్పుడాయన చెప్పే సొల్లు వినడానికి మాకు ఓపికల్లేవంటూ ఒక విపక్ష నాయకుడు చంద్రబాబు తీరుపై విమర్శలు చేశారు. బుధవారం మీటింగుకు మంగళవారం ఆహ్వానం పంపడం ఏమిటంటూ పవన్ బహిరంగంగానే మండిపడ్డారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. రెండ్రోజులక్రితమే ‘‘మనం విడివిడిగా పోటీచేసినా రాష్ట్రం హక్కుల కోసం ఒక్కటై పోరాడదాం’’ అంటూ పిలుపు ఇచ్చిన పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు అఖిలపక్షానికి డుమ్మా కొట్టడం ! మొత్తం మీద రాష్ట్రం కోసం ఆలోచన మానేశాయి పార్టీలు. అఖిలపక్షం విషయంలో  పైకి ఏం చెప్పినా...లోపల్లోపల మాత్రం ఏ పార్టీ ఎజెండా ఆ పార్టీదే అని ఈ ఉదంతాలతో తేలిపోయింది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle