ముఖ్యమంత్రిగా మీ ఛాయిస్ ఫలితాలు.

{"1":1289,"2":2222,"3":1407}

nara chandrababu naidu
1665
ys jagan mohan reddy
2290
Pawan Kalyan
1423
newssting

Your PM Choice Vote Results.

{"1":1400,"2":1716,"3":352,"4":72}

Narendra Modi
1414
Rahul Gandhi
1727
Mayawati
362
Mamata Banerjee
77
BITING NEWS :
*దీదీతో ముగిసిన భేటీ. ఢిల్లీకి చంద్రబాబు*ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో ప్రధాని మోడీ భేటీ *మరోసారి ఢిల్లీకి సీఎం చంద్రబాబునాయుడు *సోనియాతో మాయావతి భేటీ రద్దు * ఎగ్జిట్ పోల్స్ తో సందడి * ఎన్డీయే వైపు సర్వేల మొగ్గు.. యూపీయేకి పెరగనున్న సీట్లు * ఏపీ ఎన్నికలలో టీడీపీకే మళ్ళీ పట్టం.. లగడపాటి సర్వే * వైసీపీదే ఏపీ.. జాతీయ మీడియాలో మెజారిటీ సర్వేల వెల్లడి *21న ఎన్డీయే మిత్రపక్షాల సమావేశం

బాబు అంత సాహసం చేయగలరా?

24-12-201824-12-2018 17:20:53 IST
2018-12-24T11:50:53.889Z24-12-2018 2018-12-24T11:50:51.288Z - - 21-05-2019

బాబు అంత సాహసం చేయగలరా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ వైపు అడుగులు వేస్తుంటే.. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం పనిలో పనిగా మోడీ, కేసీఆర్‌లపై నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. తాను తెలుగురాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటుంటే కేసీఆర్ మాత్రం ఆంధ్రప్రదేశ్ నష్టపోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఇదిలా ఉంటే తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్‌ని గెలుపుబాట పట్టించిన పథకాల్లో రైతు బంధు ప్రధానమయినది. ఇలాంటి పథకాన్ని ఏపీలో ప్రవేశపెడితే ఎలా ఉంటుందన్న దానిపై తెలుగుదేశంనేతలు ప్రజాభిప్రాయం చేపడుతున్నారు. దీనికి తగ్గట్టుగా చంద్రబాబునాయుడు మీద ఇప్పుడు తమ్ముళ్ల ఒత్తిడి చేస్తున్నారు. రైతుబంధు ప్రవేశపెడితే ఏపీలోనూ తెలుగుదేశం విజయబావుటా ఎగరేయడం ఖాయం అంటున్నారు. ప్రజల్లో నిలచిపోవాలనుకుంటున్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేసీఆర్ పథకాలను యథాతథంగా కాపీకొట్టేస్తున్న నేపథ్యంలో మనం కూడా కాపీకొడితే తప్పులేదని తెలుగు తమ్ముళ్లు చంద్రబాబునాయుడుకు హితవు చెబుతున్నారు.

గత ఎన్నికలలో రుణమాఫీ ఓట్లు వేయించినట్లుగానే.. ఇప్పుడు రైతుబంధు పథకాన్ని ప్రకటిస్తే గనుక.. సునాయాసంగా మళ్లీ గద్దెమీదకు వస్తాం అని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే చంద్రబాబునాయుడు మాత్రం ఇందుకు ఒక పట్టాన అంగీకరించడం లేదని సమాచారం. కేసీఆర్ విధానాలను విమర్శిస్తూ తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించి, ఇప్పుడు అచ్చంగా.. కేసీఆర్ బాటలోనే సంక్షేమ పథకాలను ప్రవేశ పెడితే ఉన్న పరువు కూడా పోతుందని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. రైతుబంధు పేరు మార్చి కనీసం ఐదారువేలు ఎకరానికి ఇస్తే గంపగుత్తగా ఓట్లు సైకిల్ వైపు పడతాయంటున్నారు తెలుగుదేశం నేతలు. ఇలాంటి పథకం వల్ల 2019 ఎన్నికల్లో ఇతర పార్టీలకు చెక్ పెట్టవచ్చంటున్నారు. మరి చంద్రబాబు అంత సాహసం చేస్తారా? తన మదిలో వేరే హామీ ఏమైనా ఉన్నదా అనేది ఇంకా తెలీడం లేదు. ఏది ఏమైనా 2019 ఎన్నికల కోసం చంద్రబాబు స్కెచ్ వేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. 

పోలవరం చరిత్రలో కీలక ఘట్టం

మరోవైపు రాష్ట్ర సాగునీటి చరిత్రలో కీలక ఘట్టం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. వందేళ్ల పోలవరం ప్రాజెక్ట్ కల త్వరలో సాకారం కానుందన్నారు. రిటర్న్ గిఫ్ట్ గురించి తరచూ మాట్లాడే కేసీఆర్‌కు పోలవరం ప్రాజెక్ట్ సాక్షిగా గట్టి కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్టుకు కేసీఆర్ తరచూ అడ్డంకులు సృష్టించారని విమర్శించారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేసీఆర్ ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్‌తో భేటీ అయిన సందర్భంలోనూ పోలవరం ప్రాజెక్టుపై వ్యతిరేకంగా మాట్లాడారన్నారు. రాష్ట్రానికి వరంగా భావించే పోలవరం ప్రాజెక్టు విషయంపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని ప్రాజెక్టు పూర్తైతే... 5 టీఎంసీల నీరు ఇస్తామని ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్‌కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత ప్రాంతాలకు నష్టపరిహారం ఇస్తామని వారిని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ప్రాజెక్టు పూర్తయితే ఏపీతో పాటు ఒడిస్సాకు ప్రయోజనం ఉంటుందన్నారు.  పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలకమైన గేట్ల ఏర్పాటుకి ఇవాళ శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు యెుక్క 41వ పిల్లర్ వద్ద రేడియల్ గేట్ స్థాపనకు ప్రారంభం చేశారు చంద్రబాబు. కేంద్రప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో సహాయ నిరాకరణ చేసిందని.. సహకరించి ఉంటే ప్రాజెక్టు మరింత పురోగతి సాధించేదని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి 63 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేశామని 2019లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle