newssting
BITING NEWS :
*తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది... లాక్ డౌన్ కొనసాగించాలని మోడీకి చెబుతా*-కేసీయార్ *ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 303 *ఎంపీల వేతనాల్లో 30 శాతం కొోత *న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మొత్తంగా 364కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

22-02-202022-02-2020 14:11:08 IST
2020-02-22T08:41:08.939Z22-02-2020 2020-02-22T08:41:06.607Z - - 07-04-2020

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపీ నేతలపై విపరీతమయిన ఆరోపణలు చేయడం మానుకోవాలని ట్విట్టర్లో హితవు పలికారు  టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. దొంగ పేపర్, దొంగ ఛానల్ ట్రాప్ లో పడి మీ పరువు తీసుకోవద్దన్నారు. ఐటీ దాడులు అంటూ రూ 2 వేల కోట్లు అని అందరినీ తప్పుదోవ పట్టించారని, ఉన్నది 2 లక్షలే అని తెలిశాక నాలిక కరుచుకున్నారన్నారు. బీసీలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు లోకేష్. తుగ్లక్ బీసీ నిధులు పక్కదారి పట్టించారు అని గళమెత్తినందుకు అచ్చెన్నాయుడుపై అవినీతి మరక అంటించాలని ప్రయత్నిస్తున్నారన్నారు లోకేష్. జగన్ గారికి క్విడ్ ప్రోకో అలవాటని, అంతా అలాగే వుంటారని అనుకుంటున్నారన్నారు.

గత ప్రభుత్వంపై పనిగట్టుకుని ఆరోపణలు చేయడం మానుకోవాలని మాజీ  కార్మికశాఖ మంత్రి  పితాని  సత్యనారాయణ అన్నారు. జగన్ ప్రభుత్వం మాపై బురదజల్లడం మానుకోవాలని,తనపై, అచ్చెన్నాయుడిపై వస్తున్న ఆరోపణలకు కలత చెందామని, విజిలెన్స్ రిపోర్ట్ లో ఎక్కడా తన పేరు, అచ్చెన్నాయుడు పేరు ఎక్కడా లేదన్నారు. విజిలెన్స్  రిపోర్ట్ సి.ఎం  కార్యాలయం నుంచి  వస్తుందన్న అవగాహన లేకుండా మంత్రి జయరాం మాట్లాడుతున్నారన్నారు పితాని. 

2017 ఏప్రిల్‌లో కార్మిక మంత్రిగా తాను బాధ్యత తీసుకున్నానని, జగన్ ప్రభుత్వం చెబుతున్న అధికారులు రవికుమార్ , రమేష్‌ల అవినీతిపై తాను మంత్రిగా ఉన్నప్పుడే విచారణకు  ఆదేశించానన్నారు. గతంలో ఆరోగ్యశ్రీ, సంక్షేమ శాఖ  మంత్రిగా ఉన్నప్పుడు  తనపై ఎలాంటి ఆరోపణలు  రాలేదన్నారు. 

చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై జగన్‌ ప్రభుత్వం సిట్ వేయడంపై ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. టీడీపీపై బురదజల్లడమే వైసీపీ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ చర్యలతో భయపడేది లేదని స్పష్టం చేశారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందనడం సరికాదన్నారు. రాజకీయ కారణాలతోనే సిట్ వేశారని ఎంపీ గల్లా జయదేవ్ మండిపడ్డారు. 67వ రోజు దీక్ష సందర్భంగా వెలగపూడిలో రైతులు చేపట్టిన 24 గంటల దీక్షకు ఎంపీ గల్లాజయదేవ్, టీడీపీ నేతలు మద్దతు తెలిపారు. 

వైసీపీ ప్రభుత్వం నియమించిన సిట్ వెనుక రాజకీయ కక్ష కనిపిస్తోందని మరో టీడీపీ నేత శ్రవణ్ ధ్వజమెత్తారు. వెలగపూడిలో రైతులు చేపట్టిన 24గంటల దీక్షకు శ్రవణ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటూ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారని విమర్శించారు. జగన్‌ తన బురదను అందరికీ అంటించాలనుకుంటున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ చర్యలను ప్రజలంతా ఖండించాలన్నారు. పోలీసులతో సిట్‌ వేయడం రాజకీయ కక్ష సాధింపే అని శ్రవణ్‌ వ్యాఖ్యానించారు.

మరో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జగన్ ప్రభుత్వం పిచ్చి పరాకాష్టకు చేరిందని విమర్శించారు. ప్రభుత్వం పనులు మాని, విపక్షంపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. చంద్రబాబుపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని దేవినేని ఉమ పేర్కొన్నారు. గ్రామ వాలంటీర్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారన్నారు. వృద్ధులు, వికలాంగుల పెన్షన్లు తొలగించారని.. రాష్ట్రంలో మంత్రులంతా డమ్మీలు అయ్యారన్నారు. ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆధ్వర్యంలో సీఎం జగన్‌ దుర్మార్గాలు చేస్తున్నారని దేవినేని ఉమ విమర్శించారు.

 

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక ప్రకటన... కొనసాగింపునకే మొగ్గు?

   5 hours ago


కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

కరోనా పాజిటివ్ కేసుల్లో తెలంగాణతో సై అంటున్న ఏపీ

   9 hours ago


తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

తెలుగు రాష్ట్రాలపై పొంచి ఉన్న కరోనా మహమ్మారి

   9 hours ago


కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

కరోనా సాయం కేంద్రానిదా.. రాష్ట్రాలదా.. ఈ రచ్చేంటి?!

   11 hours ago


ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

ఏప్రిల్ 15 నుంచి ఆర్టీసీ సర్వీసులు... అధికారుల కసరత్తు

   15 hours ago


బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

బీజేపీ నినాదం.. ఒకరోజు భోజనం మానేసి ఐదుగురికి ఆహారం

   15 hours ago


‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

‘‘అంజాద్ బాషా క్షమాపణ చెప్పాల్సిందే’’

   15 hours ago


డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

   15 hours ago


గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

గ్రిడ్ సేఫ్.. విద్యుత్ శాఖకు కేసీయార్ ప్రశంసలు

   17 hours ago


లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

లాక్ డౌన్ మంచే చేస్తోందా? కాలుష్యానికి చెక్!

   17 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle