newssting
BITING NEWS :
*దిశ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృదం.. శంషాబాద్ డీసీపీ నేతృత్వంలో విచారణ కమిటీ *హైదరాబాద్ మెట్రోలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి * ఎన్‌ఆర్‌సీ బిల్లుకిమంత్రివర్గం ఆమోదం*కర్ణాటకలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొనసాగుతున్న పోలింగ్*రూ.150కి చేరిన కిలో ఉల్లి ధర.. ఉల్లి కొనలేక గత మూడు నెలలుగా ఇబ్బంది పడుతున్న ప్రజలు*చిత్తూరుజిల్లాలో దారుణం... కాలేజి నుండి వస్తుండగా బాలిక కిడ్నాప్*విజయవాడలో అజిత్ సింగ్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు*నేడు పోలీస్‌ కస్టడీకి దిశ నిందితులు..నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు..వారం రోజుల పాటు విచారణ*నేడు ఆర్బీఐ విధాన సమీక్ష.. వడ్డీరేట్ల పై కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ *శబరిమల సన్నిధిలో సెల్ ఫోన్లు బంద్... స్వామి గర్భగుడి పరిసర ప్రాంతాల్లో సెల్ ఫోన్ల వాడకాన్ని నిషేదించిన ట్రావెన్ కోర్ బోర్డు *తెలంగాణ సెక్యూరిటీ కమిషన్, పోలీస్ కంప్లైట్ అథారిటీని ఈ నెల 27వ తేదీలోగా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశం*వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. రోజుకు నలుగురిని విచారించిన సిట్ బృందం.. రేపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించనున్న సిట్

బాబుపై కోపాన్ని ప్రజలపై చూపితే ఎలా జగన్?

25-11-201925-11-2019 11:15:06 IST
2019-11-25T05:45:06.474Z25-11-2019 2019-11-25T05:44:58.460Z - - 06-12-2019

బాబుపై కోపాన్ని ప్రజలపై చూపితే ఎలా జగన్?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చంద్రబాబుపై ఉన్న కోపాన్ని రాష్ట్ర ప్రజలపై చూపించడాన్ని సీఎం జగన్ మానుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు. రాష్ట్రంలో జగన్ అడుగులు రివర్స్‌లో వెళుతున్నాయన్నారు. 34 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయినా కానీ. నూతన ఇసుక చట్టం రాదా అని ప్రశ్నించారు. నవరత్నాల కోసం ప్రభుత్వ ఆస్తులను అమ్మడం ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయడమేనన్నారు. 

మాతృభాష తల్లిపాల లాంటిదని, ఆంగ్ల భాష పోతపాల లాంటిదని తానే చెబితే.. నారాయణ కొడుకు అమెరికా, మనవడు ఆఫ్రికా అంటూ విమర్శించడం విడ్డూరంగా ఉందని నారాయణ అన్నారు. స్థానిక సీపీఐ నేతలతో కలిసి ఆదివారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించిన నారాయణ దేశ, రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

సినిమా హాల్లో బ్లాక్‌టికెట్లు అమ్మేవాళ్లందరూ చట్ట సభల్లోకి వెళ్లి బహిరంగంగా బూతులు తిట్టుకుంటున్నారని, అయ్యప్పమాల వేసుకున్నవారు కూడా బూతులు తిడుతున్నారని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు బూతు రాజకీయాలు మానుకొని హుందాగా వ్యవహరించాలని హితవుపలికారు. 

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు దారుణమని, కేసీఆర్ చెప్పినట్లుగా కోర్టుల్లో తీర్పులు వస్తున్నాయని  నారాయణ అన్నారు. కేసీఆర్ మొండి వైఖరిని వీడి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు.

బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్థం దుబాయ్‌లో చేస్తూ ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర తీశారంటూ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ, టీడీపీ ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఆ కార్యక్రమానికి వెళ్తున్నారనే సమాచారం ఉందని, అందుకోసమే ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారని నారాయణ ఆరోపించారు. 

నారాయణ వ్యాఖ్యలను అలా ఉంచితే.. ఇవాళ దుబాయ్‌లో బీజేపీ నేత సీఎం రమేష్‌ కుమారుడి నిశ్చితార్థం జరగనుంది. నిశ్చితార్థానికి పెద్ద ఎత్తున ఎంపీలు, టీడీపీ నేతలు దుబాయ్‌ వెళ్లనున్నారు. ప్రముఖల కోసం 15 విమానాలు ఏర్పాటు చేశారు.  పలువురు వైసీపీ ఎంపీలకూ ఆహ్వానాలు అందాయని సమాచారం. 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle