newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

బాబును నైతికంగా దెబ్బ‌తీసే ప్లాన్‌లో జ‌గ‌న్‌

31-12-201931-12-2019 14:57:19 IST
Updated On 31-12-2019 15:10:19 ISTUpdated On 31-12-20192019-12-31T09:27:19.936Z31-12-2019 2019-12-31T09:27:17.848Z - 2019-12-31T09:40:19.965Z - 31-12-2019

బాబును నైతికంగా దెబ్బ‌తీసే ప్లాన్‌లో జ‌గ‌న్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు గ‌త ప‌దిహేను రోజులుగా రాజ‌ధాని చుట్టూనే తిరుగుతున్నాయి. అమ‌రావ‌తిని కొన‌సాగించాల‌ని ఒక వైపు ఆందోళ‌న‌లు జ‌రుగుతుండ‌గా, మూడు రాజ‌ధానుల ఏర్పాటు ద్వారా అన్ని ప్రాంతాల‌కు స‌మ‌న్యాయం జ‌రుగుతుంద‌నే వాద‌న మ‌రోవైపు వినిపిస్తోంది.

జ‌న‌వ‌రిలో అసెంబ్లీ స‌మావేశం ఏర్పాటు చేసి మ‌రీ రాజ‌ధానిపై చ‌ర్చ జ‌ర‌పాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. త‌ద్వారా త‌మ మూడు రాజ‌ధానుల వాద‌న‌కు మ‌ద్ద‌తు పెంచుకోవాల‌నేది ప్ర‌భుత్వ ఆలోచ‌న‌.

ఈ లోపు అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని ఉండాల‌ని బ‌లంగా డిమాండ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీని నైతికంగా దెబ్బ‌తీయాల‌నేది ప్ర‌భుత్వ వ్యూహంగా క‌నిపిస్తోంది. రాజ‌ధానిపై చంద్ర‌బాబు వాద‌న‌ను ఆ పార్టీ ఎమ్మెల్యేలే వ్య‌తిరేకించేలా చేయ‌డంలో ఈ వ్యూహంలో మొద‌టి భాగం.

ఇప్ప‌టికే విశాఖ‌ప‌ట్నం ఎమ్మెల్యేలు చంద్ర‌బాబు వాద‌న‌ను వ్య‌తిరేకించ‌డంతో పాటు జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించారు. విశాఖ‌లో ఎగ్జిక్యూటీవ్ క్యాపిటెల్‌ను వారు స్వాగ‌తించారు.

రాజ‌ధానిపై చ‌ర్చించేందుకు జ‌న‌వ‌రి చివ‌రి వారంలో ప్ర‌త్యేక అసెంబ్లీ స‌మావేశాల‌ను జ‌ర‌ప‌నుంది ప్ర‌భుత్వం. అప్ప‌టిలోగా మ‌రికొంద‌రు టీడీపీ ఎమ్మెల్యేల‌ను త‌మ‌వైపు తిప్పుకోవాల‌ని వైసీపీ భావిస్తోంది.

ఇందులో భాగంగానే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను క‌లిశారు. అమరావ‌తిపై జ‌గ‌న్ స‌ర్కార్ నిర్ణ‌యంతో కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వ్య‌తిరేక‌త ఉంద‌నే వాద‌న త‌ప్ప‌ని నిరూపించ‌డానికే వైసీపీ గుంటూరుకే చెందిన‌ మ‌ద్దాలి గిరిని ఉప‌యోగించుకున్న‌ట్లు క‌నిపిస్తోంది.

విశాఖ‌ప‌ట్నం, ప్ర‌కాశం జిల్లాకు చెందిన మ‌రికొంద‌రు టీడీపీ ఎమ్మెల్యేల‌ను సైతం త‌మవైపున‌కు తిప్పుకోవాల‌ని వైసీపీ స్కెచ్ వేస్తోంది. ఇప్ప‌టికే వైసీపీకి చెందిన ప‌లువురు మంత్రులు కొంద‌రు టీడీపీ నేత‌ల‌తో ట‌చ్‌లో ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

అసెంబ్లీలో టీడీపీ వాద‌న‌కు టీడీపీ ఎమ్మెల్యేలే వ్య‌తిరేకంగా గ‌ళం విప్పేలా చేసి నైతికంగా టీడీపీని దెబ్బ‌తీయాల‌నేది వైసీపీ ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది.ఇక‌, ఇదే స‌మ‌యంలో అమ‌రావ‌తిలో టీడీపీ హ‌యాంలో ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌ని ఆధారాలు బ‌య‌ట‌పెట్ట‌డం ద్వారా ఆ పార్టీని డిఫెన్స్‌లో ప‌డేయడం మ‌రో వ్యూహంగా క‌నిపిస్తోంది.

ఓ వైపు టీడీపీ ఎమ్మెల్యేల్లోనే పార్టీ వాద‌న‌తో విభేదించేలా చేయ‌డం, మ‌రోవైపు ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ ఆరోప‌ణ‌లు ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డం ద్వారా రాజ‌ధానిపై చ‌ర్చ స‌మ‌యానికి టీడీపీని నైతికంగా ఇరుకున పెట్ట‌బోతోంది వైసీపీ. మ‌రి, వైసీపీ వ్యూహాల‌ను చంద్ర‌బాబు ఎలా ఎదుర్కుంటారో చూడాలి.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle