బాబుని వదలని వరద బొమ్మాళి.. రెవిన్యూశాఖ నోటీసులు
17-08-201917-08-2019 12:46:37 IST
Updated On 20-08-2019 11:58:14 ISTUpdated On 20-08-20192019-08-17T07:16:37.632Z17-08-2019 2019-08-17T07:16:31.614Z - 2019-08-20T06:28:14.246Z - 20-08-2019

ఏపీలో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోంది. వరద ముంపు ప్రాంతాలను ముంచెత్తుతోంది. వరద ముంపు నేపథ్యంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లి వీఆర్వో ప్రసాద్ శనివారం నోటీసులిచ్చారు. వరద ముప్పు కారణంగా ఇప్పటికే కరకట్టను ఆనుకొని ఉన్న 32 ఇళ్లకు నోటీసులు ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. అదే విధంగా చంద్రబాబు నివాసానికి నోటీసులివ్వడానికి వెళ్లిన వీఆర్వోను ఇంట్లో ఎవరు లేరంటూ సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించకుండా బయటనే నిలిపివేశారు. సెక్యూరిటీ సిబ్బందితో మాట్లాడిన వీఆర్వో వెంటనే ఇళ్లు ఖాళీ చేయాలని సూచించినట్లు తెలిపారు.
శనివారం నాడు చంద్రబాబునాయుడు నివాసం పక్కనే ఉన్న అరటితోటలోకి నీరు చేరుకుందని అధికారులు చెప్పారు. దీంతో ఇంటిని ఖాళీ చేయాలని కోరుతూ చంద్రబాబునాయుడుకు నోటీసులు జారీ చేశారు.
కరకట్టపై ఉన్న నిర్మాణాల్లో కొన్నింటికి ఇప్పటికే నీరు వచ్చింది. వరద ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున ఇంటిని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలు సూచిస్తున్నారు. చంద్రబాబు నివాసంతో పాటు మరో 32 ఇళ్లకు కూడ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఎగువ ప్రాంతం నుండి వరద వస్తున్న నేపథ్యంలో ఇళ్లను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు.
బాబు నివాసం వద్ద నోటీసులు తీసుకొనేందుకు ఎవరూ లేకపోవడంతో వారు వెనుదిరిగారు.నాలుగు రోజుల క్రితం చంద్రబాబునాయుడు హైద్రాబాద్ కు వచ్చారు. అనారోగ్యం కారణంగా చంద్రబాబు హైద్రాబాద్ కు వచ్చారు.

హైద్రాబాద్ లోనే ఆయన ఉన్న సంగతి తెలిసిందే. పదేళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా మహోగ్రంగా విరుచుకుపడుతోంది. పులిచింతల నుంచి భారీగా వరద నీరు విడుదల చేస్తుండటంతో బిరబిరా దిగువకు పరుగులు పెడుతోంది. జనావాసాలను కూడా తన రాజమార్గంలో కలిపేసుకుంటూ ప్రజలను బెంబేలెత్తిస్తోంది.
అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువున జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో పరివాహక గ్రామాలు.. ప్రకాశం బ్యారేజ్ దిగువున లంక గ్రామాలు ఇప్పటికే ముంపు బారిన పడ్డాయి. పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్న అధికారులు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
చంద్రబాబు నివాసం విషయంలో అటు టీడీపీ-ఇటు అధికార వైసీపీ పట్టుదలతో ఉన్నాయి. అద్దె ఇంటి విషయంలో చంద్రబాబు పట్టుదల ఏంటో అర్థంకావడంలేదని వైసీపీ నేతలు ఘాటుగా విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారం ఎంతవరకూ వెళుతుందో చూడాలి.

మూడ్రోజులు మీ సేవ కేంద్రాలు బంద్
3 hours ago

నిధుల సంగతేంటి? కేంద్రంపై టీఆర్ఎస్ వత్తిడి
3 hours ago

పౌరసత్వ బిల్లుకి రాష్ట్రపతి ఓకె.. అసోం, మేఘాలయ, త్రిపురలో ఉద్రిక్తత
4 hours ago

తెలుగుదేశంలో రాయలసీమ కరువు..!
4 hours ago

అన్నయ్య అలా.. తమ్ముడు ఇలా..!
4 hours ago

మద్యంపై ఉన్న మమకారం రైతులపై ఎక్కడ?
17 hours ago

రివ్యూ పిటిషన్ల డిస్మిస్.. అయోధ్యపై సుప్రీం కీలక నిర్ణయం
17 hours ago

కామారెడ్డి జెడ్పీ ఛైర్ పర్సన్ వ్యాఖ్యలపై రభస
18 hours ago

దిశ హత్యాచారం కేసులో మరో బిగ్ ట్విస్ట్..!
18 hours ago

వైఎస్ వివేకా కేసు: సిట్ ముందు హాజరైన ఆది
21 hours ago
ఇంకా