newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

బాబుని మళ్ళీ గెలిపించి పాతికేళ్ళు వెనక్కి వెళతారా...!

25-03-201925-03-2019 12:05:30 IST
Updated On 26-03-2019 17:59:15 ISTUpdated On 26-03-20192019-03-25T06:35:30.226Z25-03-2019 2019-03-25T06:35:28.627Z - 2019-03-26T12:29:15.031Z - 26-03-2019

బాబుని మళ్ళీ గెలిపించి పాతికేళ్ళు వెనక్కి వెళతారా...!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ధ్వజమెత్తారు వైసీపీ నేత, జగన్ సోదరి వైఎస్ షర్మిల. బాబు రావాలి.. జాబు రావాలి అని ఐదేళ్ళ క్రితం ప్రచారం చేశారని, చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదన్నారు. విద్యావంతులకు ఉద్యోగాల మాట పక్కనపెట్టి, తన కొడుకు లోకేష్‌కు అర్హతలు లేకున్నా మూడు కీలకమైన మంత్రిత్వశాఖలను అప్పగించారని ఆమె విమర్శించారు.

హైద్రాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్ కొడుకు కేటీఆర్‌కు ఐటీ శాఖను కట్టబెడితే లోకేష్‌కు కూడ ఐటీ శాఖను కట్టబెట్టారని చెప్పారు. అయితే తెలంగాణలో మాదిరిగా కేటీఆర్ తెచ్చినట్టుగా ఏపీలో ఐటీ పరిశ్రమలు ఎందుకు తీసుకురాలేదో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

చంద్రబాబు తనయుడు లోకేష్‌ వ్యవహారశైలిపై ఆమె వ్యంగ్యాస్త్రాలు విసిరారు. జయంతికి, వర్ధంతికి మధ్య తేడా ఏంటో లోకేష్‌కు తెలియదని ఆమె ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు హయంలో రాష్ట్రంలో అభివృద్ధి 25ఏళ్లు వెనక్కి వెళ్లిందని వైఎస్‌ షర్మిల అన్నారు. మళ్లీ అలాంటి పాలన మీకు కావాలా అని షర్మిల ప్రశ్నించారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాలనలో అన్నివర్గాల ప్రజలకు ఓ భరోసా ఉండేదన్నారు. వైఎస్సార్‌ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర ఉండేదని, అలాగే పేద విద్యార్థులకు కూడా పెద్ద చదువులు చదివేవారని వైఎస్‌ షర్మిల ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు...ఆ తర్వాత ఆ హామీలను గాలికి వదిలేశారన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు... రైతులను మోసం చేశారని విమర్శించారు.  మొదటి అయిదు సంతకాల పేరుతో డ్రామాలు ఆడిన చంద్రబాబు...తొలి సంతకానికి అయినా ప్రాధాన్యత ఇచ్చారా అని సూటిగా ప్రశ్నించారు.

భూత‌ద్దం పెట్టుకుని వెతికినా రాష్ట్రంలో ఎక్క‌డా అభివృద్ధి క‌నిపించ‌డం లేదు. చంద్రబాబు వ్యవ‌స్థలను మేనేజ్ చేసుకుంటూ పాల‌న సాగించారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు పేద కుటుంబం సంతోషంగా ఉండేదని,  రైతు కుటుంబం ధైర్యంగా ఉండేదన్నారు. కానీ ఐదేళ్ళుగా బాబు పాలనలో జనం సంతోషంగా లేరన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle