newssting
BITING NEWS :
*విజయవాడలో ప్రజావేదిక కూల్చివేత *అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతాం: సీఎం జగన్ *పార్టీ మారడం ఖాయం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి *పార్టీ అంటే కుల సంఘం కాదని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి: పవన్ కళ్యాణ్ *హోదా బాధ్యత జగన్‌దే: ఎంపీ గల్లా జయదేవ్‌*‘నెహ్రూ-గాంధీ’ కుటుంబంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు *ప్రపంచకప్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా

బాబుని పెవికాల్ బాబా అంటున్న విజయసాయి

20-05-201920-05-2019 12:11:33 IST
Updated On 21-05-2019 15:19:05 ISTUpdated On 21-05-20192019-05-20T06:41:33.264Z20-05-2019 2019-05-20T06:41:31.480Z - 2019-05-21T09:49:05.089Z - 21-05-2019

బాబుని పెవికాల్ బాబా అంటున్న విజయసాయి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎగ్జిట్ పోల్స్ చంద్రబాబుకి షాకిచ్చాయంటున్నారు వైసీపీ నేతలు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో మారు చంద్రబాబుని టార్గెట్ చేశారు. బాబుపై మళ్ళీ ధ్వజమెత్తారు వైసీపీ ఎంజీ విజయసాయిరెడ్డి. రోజుకి రెండుసార్లు ఢిల్లీ వెళుతున్న చంద్రబాబుని ఆయన తూర్పారబట్టారు.

యూపీయే-మాయావతి ఫ్రంటులు చతికిలబడ్డాయి, చంద్రబాబు గ్రాఫ్ ఢమాల్ అన్న విషయం కూడా వాళ్లకి అర్థమైంది. లగడపాటి సర్వేను అందరికీ చూపించబోగా విసుక్కున్నారట. పాపం అటు ఇటు కాకుండా పోయాడు బాబు.

ఢిల్లీలో చంద్రబాబును అందరూ ‘ఫెవికాల్ బాబా’ అని పిలుస్తున్నారు. పిలవని పేరంటంలా అందరి ఇళ్లపై పడి ఫోటోలు దిగుతూ, వాళ్లను కలుపుతా వీళ్లను ఏకం చేస్తా అంటుంటే ఈ నిక్ నేమ్ తగిలించారట. ఎవరి టెన్షన్లలో వాళ్లుంటే సమయం, సందర్భం లేకుండా ఈ ఫెవికాల్ రాయబారాలేమిటని జోకులేసుకుంటున్నారట. 

పొరుగు రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్‌ వినాశనాన్ని కోరుకుంటుందని బోరున విలపించిన బాబు ఇప్పుడు చేస్తున్నదేమిటో? తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీని సోనియా, ఉత్తరాది నేతల పాదాల ముందు పడేశాడు. ఎప్పుడు కలవాలో ఎప్పుడు విడి పోవాలో ఈయనకంటే వాళ్లకు బాగా తెలుసు.. అంటూ విజయసాయి చేసిన ట్వీట్లు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. ఈ ట్వీట్లపై తెలుగు తమ్ముళ్ళు మండిపడుతున్నారు. 

Image may contain: text


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle