newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

బాబుని ఓటమి భయం వేధిస్తోందా?

10-05-201910-05-2019 17:48:12 IST
Updated On 29-06-2019 12:05:42 ISTUpdated On 29-06-20192019-05-10T12:18:12.671Z10-05-2019 2019-05-10T12:17:58.327Z - 2019-06-29T06:35:42.826Z - 29-06-2019

బాబుని ఓటమి భయం వేధిస్తోందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గతంలో ఎన్నడూ లేనవిధంగా ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి ఓటమి భయం పట్టుకుందా? ఆయన అందుకే టెన్షన్ పడుతున్నారా? అంటే అవుననే అంటున్నారు ఆయనతో గతంలో పనిచేసిన నేతలు. అయితే టీడీపీ నేతలు మాత్రం వైసీపీ నేతల ఆరోపణలపై మండిపడుతున్నారు. ఈఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పదని తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల ప్రతి దానికీ పెద్ద ఎత్తున రగడ చేస్తున్నారని, వైసీపీ సీనియర్‌ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడతలోనే ఎన్నికలు జరిగేలా షెడ్యూల్‌ ప్రకటించిన ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు తొలుత తప్పుపట్టారని, ఇప్పుడు తొలి విడతలో ఎన్నికలు జరగడం వల్ల తమకు మేలు జరిగిందంటూ యూటర్న్‌ తీసుకున్నారని ఎద్దేవా చేశారు.  వీవీప్యాట్లు, ఈవీఎంలపై ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు పోలింగ్‌ రోజు చక్కగా ఓటేసి ఫొటోలకు పోజులిచ్చారు. రెండు గంటల తరువాత మాటమార్చి, తన ఓటు ఎవరికి పడిందో తనకే అర్థం కావడం లేదని నిట్టూర్పు విడిచారు. ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు వచ్చిందో ఇదే ఉదాహరణ అన్నారు ఉమ్మారెడ్డి. 

ఇలాంటి యూటర్స్ సీఎంని తాను ఎక్కడా చూడలేదన్నారు. టీడీపీ ఓడిపోయి, వైసీపీ అధికారంలోకి వస్తోందని చంద్రబాబుకు తెలిసిపోయిందని, అందుకే ప్రతి దానికీ పెద్ద రగడ చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అరాచక పాలన త్వరలో అంతం అవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి అన్నారు.

చంద్రబాబు నాయుడువి మొదట్నుంచి అడ్డదారి రాజకీయాలే అన్నారు. ఇలాంటి పాపాల భైరవుని పాపం పండే రోజులు దగ్గరపడ్డాయని...దోపిడీ పరిపాలన నుంచి రాష్ట్ర ప్రజలకు త్వరలో విముక్తి రానుందని లక్ష్మీపార్వతి అంటున్నారు. ఈ నెల 23న రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాత్మక మార్పు రానుందని, తమ పార్టీ గెలిచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ‍్యమంత్రి కావడం తథ్యమన్నారు. మొత్తం మీద చంద్రబాబుమీద వైసీపీ నేతలు మాటల దాడి పెంచారు. 

120 సీట్లు మావే: ముళ్ళపూడి రేణుక

Image result for ముళ్ళపూడి రేణుక

ఇదిలా ఉంటే వైసీపీ ఆరోపణలను తీవ్రంగా తప్పుబట్టారు టీడీపీ అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక. తమకు తెలుగుదేశం విజయంపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. చంద్రబాబులో ఓటమి భయం ఉందనడం వారి అవగాహన లేమికి నిదర్శనం అన్నారు. చంద్రబాబు మళ్ళీ సీఎం కావాలనే మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఓట్లు వేశారని రేణుక ‘న్యూస్ స్టింగ్’ ప్రతినిధితో పేర్కొన్నారు.

ఏపీలో ఈసారి టీడీపీకి అనూహ్య విజయం దక్కబోతోందని, 120 సీట్లు గ్యారంటీ అన్నారు. అటు పార్లమెంటు సీట్లు కూడా ఎక్కువగానే వస్తాయని, అందుకే యాంటీ మోడీ అలయెన్స్ కోసం చంద్రబాబు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారని ఆమె విశ్లేషించారు. గతంలో కంటే ఎక్కువ ఎంపీ సీట్లు వస్తున్నాయన్నారు. మే 23న వచ్చే ఫలితాలు ఏపీ గతిని మార్చడం ఖాయం అన్నారు. 18-20 ఎంపీ సీట్లు వస్తాయన్నారు రేణుక. దేశంలో ప్రాంతీయపార్టీల హవా పెరిగిందని, చంద్రబాబుకి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందన్నారు. కేంద్రంలో రాబోయే ప్రభుత్వం నిర్ణయించడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తారని ‘న్యూస్ స్టింగ్’ ప్రతినిధితో మాట్లాడుతూ రేణుక ఆశాభావం వ్యక్తంచేశారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle