newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

బాబుగారి మైనస్ పాయింట్లు ఇవే...

13-03-201913-03-2019 07:04:12 IST
Updated On 13-03-2019 19:24:40 ISTUpdated On 13-03-20192019-03-13T01:34:12.283Z13-03-2019 2019-03-13T01:34:08.613Z - 2019-03-13T13:54:40.329Z - 13-03-2019

బాబుగారి మైనస్ పాయింట్లు ఇవే...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆయన రాజకీయ దురంధరుడు. అపర చాణక్యుడు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న ఆయన... ఒక్కోసారి సరైన ప్రత్యర్థి ఎదురైతే మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఆయనలో తత్తరబాటు కనిపిస్తుంది. ఇదంతా చెబుతోంది ఎవరి గురించో కాదు. ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి గురించే. ప్రతి ఒక్కరిలో ఉన్నట్లే ఆయనలో ప్లస్, మైనస్ పాయింట్లు ఉన్నాయి.

ముఖ్యంగా మాట నిలకడలేనితనం చంద్రబాబుకు అతిపెద్ద మైనస్ పాయింట్. ఎందుకంటే ఈ ఐదేళ్ల పాలనలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, యూటర్న్ పాలిటిక్స్ చూస్తుంటే జనానికి ఇదే అర్థం అవుతోంది. మాటలకూ, చేతలకు ఏమాత్రం పొంతన లేకపోవడం కూడా జనానికి స్పష్టమైంది. ఇక ఈ ఎన్నికల వేళ ఏపీలోని ప్రధాన పార్టీలు ఆలపిస్తున్న ప్రత్యేక హోదా అంశం మీద చంద్రబాబు, పలుమార్లు మాట మార్చారు. మొదట హోదా వద్దన్న ఆయన కేంద్రం ప్రత్యేక ప్యాకేజ్ అనగానే... భేష్ అన్నారు. ఆ తర్వాత ఎన్టీయేకి గుడ్ బై కొట్టి ఇప్పుడు ప్రత్యేక హోదా డిమాండ్ ఎత్తుకున్నారు. అంటే ప్రత్యేక హోదా విషయంలో ఓసారి రాజీ పడ్డారనీ, మరోసారి ఎదురు తిరుగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు చంద్రబాబు. ఇది కూడా ఆయనకు మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఇక అమరావతి, పోలవరం పేరుతో 2014 ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు... ఇప్పుడు వీటి మీద నోరు మెదిపే పరిస్థితిలో లేరు. ఎందుకంటే... అమరావతిలో ఒక్కటి కూడా శాశ్వత కట్టడం లేదు. పోలవరం మీద ఎన్నో ఆరోపణలు మూటగట్టుకున్నారు. కేంద్రం చేయాల్సిన పనిని తాను చేస్తానంటూ పోలవరం ప్రాజెక్టు తీసుకుని అభాసు పాలయ్యారు. ఇదంతా చంద్రబాబును ఇప్పుడు ఇరకాటంలో పెట్టడం ఖాయం. అలాగే రైతులు, మహిళలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై ఈ ఐదేళ్లలో కొంచెం కూడా చంద్రబాబు క్లారిటీ ఇవ్వలేదు. ఎన్నికల వేళ పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ, వృద్ధాప్య పింఛన్ పేరుతో హడావుడి కార్యక్రమాలు మొదలు పెట్టారు.

ఈ పథకాలు చంద్రబాబుకు ప్లస్ పాయింట్ కాలేదు సరికదా... టీడీపీ కార్యకర్తల్లోనే గందరగోళం రేపాయి. మహిళల నుంచి వ్యతిరేకత వచ్చింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే... హడావుడిగా నారా లోకేష్ ను మంత్రిని చేసిన చంద్రబాబు... ఇప్పుడు లోకేష్ తీరు, ఆలోచన, మాటలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. పలు అంశాల మీద లోకేష్ మాట్లాడిన కామెడీ డైలాగులు టీడీపీ పరువు తీశాయి.

ఇక డేటా చోరీ కేసులో ఏపీ ఐటీ మంత్రిగా లోకేష్ ఇప్పటి దాకా నోరు మెదపలేదు. ఇదంతా చూస్తుంటే... ఎన్నికల వేళ చంద్రబాబుకు ఈ అంశాలన్నీ మైనస్ పాయింట్లుగా మారి ఇరకాటంలో పెడతాయన్నది అర్థం అవుతోంది. ఇప్పుడు వీటిని ఆయన ఎలా ఎదుర్కొంటారన్నదే చూడాలి.

 

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   12 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   14 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   17 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   18 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   19 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   20 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   20 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   20 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   21 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   21 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle