newssting
BITING NEWS :
*ప్రధాని నరేంద్రమోడీతో హోంమంత్రి అమిత్ షా భేటీ.. లాక్ డౌన్ పై చర్చ *మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తొలగింపు వ్యవహరంలో తుది తీర్పు .. వెంటనే విధులోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశం *కొండపోచమ్మ జలాశయం ప్రారంభం. సీఎం కేసీఆర్ దంపతుల చేతుల మీదుగా ప్రారంభం.. ఇదో ఉజ్వల ఘట్టం అన్నకేసీయార్ *కరోన ఇప్పుడే పోయేది కాదు..సౌదీ అరేబియా నుండి వందలాది మంది వస్తున్నారు..కరోన అపగలిగే శక్తి ప్రభుత్వాలకు లేదు..ప్రజలు దీన్ని తేలికగా తీసుకోవద్దు..ఎవరికివారే జాగ్రత్తగా ఉండాలి : ఈటల *ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే 50కి పైగా కేసులలో చుక్కెదురైనా పద్ధతి మార్చుకోవడం లేదు..రమేష్ ని మళ్ళీ ఎన్నికల కమిషనర్ గా నియమిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నాం : సీఎం రమేష్ - ఎంపీ *ఏపీలో కొత్తగా 85 మందికి కరోనా పాజిటివ్‌, ఒకరు మృతి.3330 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య.కరోనాతో 60 మంది మృతి * చోటా కె.నాయుడు సోదరుడు అరెస్ట్..ఎస్.ఆర్.నగర్‌లో శ్యామ్ కె. నాయుడిని అరెస్టు చేసిన పోలీసులు..ఆర్టిస్ట్ సుధను పెళ్లిపేరుతో మోసం చేశాడని ఆరోపణ..సుధ ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు*భారత్ లో విజృంభిస్తున్న కరోనా. గడిచిన 24 గంటల్లో 7466 కొత్త కరోనా కేసులు. 175 మంది మృతి. దేశవ్యాప్తంగా 1,65,799 కి చేరిన కరోనా కేసులు. 89,987 యాక్టివ్ కేసులుండగా, 71,106 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. భారత్ లో మొత్తం 4,706 కరోనా మరణాలు

బాబుకు షర్మిల పొలిటికల్ పంచ్ ?

14-01-201914-01-2019 19:10:55 IST
Updated On 14-01-2019 20:42:00 ISTUpdated On 14-01-20192019-01-14T13:40:55.695Z14-01-2019 2019-01-14T13:40:34.080Z - 2019-01-14T15:12:00.245Z - 14-01-2019

బాబుకు షర్మిల పొలిటికల్ పంచ్ ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైఎస్ తనయ, జగన్ సోదరి షర్మిల హైదరాబాద్ పోలీస్ కమీషనరుకు ఒక ఫిర్యాదు ఇచ్చారు. వ్యక్తిగతంగా  తనపై సోషల్ మీడియాలో కొంతకాలంగా జరుగుతున్న విషప్రచారం గురించి  ఆమె చేసిన ఫిర్యాదులో నేరుగా చంద్రబాబును అందుకు బాధ్యుల్ని చేశారు.''ఈ ప్రచారాల వెనుక టీడీపీ ఉందని భావిస్తున్నా. టీడీపీకి పుకార్లు పుట్టించడం కొత్త ఏమీ కాదు. మా నాన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫ్యాక్షనిస్టు అంటూ పుకార్లు పుట్టించింది టీడీపీ పార్టీ... ఒక వేళ టీడీపీకి ఈ పుకార్లతో సంబంధంలేకపోతే. ఆ పార్టీ వాళ్లు మాట్లాడతున్నప్పుడు ఆ మాటలను చంద్రబాబు ఎందుకు ఖండించలేదు.''అంటూ షర్మిల ఈ ప్రచారం వెనుక తెలుగుదేశం పార్టీని, చంద్రబాబుని టార్గెట్ చేశారు  దాంతో వ్యవహారం రాజకీయంగా మలుపు తిరిగింది. 

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి  ఒక రాజకీయ పార్టీ నాయకుణ్ణి  బాధ్యుణ్ణి చేయవచ్చా ? అందుకు తగిన ఆధారాలు ఆమె ఇవ్వగలిగారా ? ఇది ప్రధాన ప్రశ్నగా మారుతుంది. సోషల్ మీడియా పరిధి రోజురోజుకీ విస్తృతమయి వెర్రితలలు వేస్తున్న ఇప్పటి రోజుల్లో నియంత్రణలు అవసరమని ప్రపంచవ్యాప్తంగా అందరూ డిమాండ్ చేస్తున్న విషయమే ! కాకపోతే అటువంటి నియంత్రణ ఎంతవరకు సాధ్యమన్న దానిపైన  స్పష్టత ఇంతవరకూ లేదు. ప్రస్తుతమున్న చట్టాలు, వాటిని ఉపయోగించుకునే విధానాలు, ముఖ్యంగా దోషుల్ని పట్టుకుని శిక్షించే సాంకేతికతల చుట్టూనే చర్చలు జరుగుతున్నాయి తప్ప ఇదమిద్దంగా నిర్దిష్టమైన పద్దతిలో విచారణ జరగడంలేదన్నది వాస్తవం. 

కొంతకాలం క్రితం 'పొలిటికల్ పంచ్'అనే ఫేస్బుక్ నిర్వాహకుడిగా ఉన్న రవి కిరణ్ అనే వ్యక్తిని ఆంధ్రా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ పేరుతో హైదరాబాదు నుంచి విజయవాడ తీసుకెళ్లి అరెస్ట్ చేశారు.అతను పెట్టింగ్ పోస్టింగ్స్ లో ఎమ్మెల్యే అయిన తనపైన అసభ్యకరమైన అభ్యంతరకరమైన విషయాలున్నాయంటూ చేసిన ఫిర్యాదు  అనిత  ఫిర్యాదు మేరకే ఈ అరెస్ట్ చేశామని పోలీసులు ఆనాడు చెప్పారు.  ఏం జరిగిందో తెలియదు కానీ అతన్ని వదిలేశారు.  దీనిపైన ఆనాడు వైఎస్సాఆర్ పార్టీ తరఫున ఆ పార్టీ ఐటీ విభాగం ఇంచార్జ్ చల్లా మధుసూదన్ రెడ్డి ఖండించారు. విమర్శలు-ప్రతి విమర్శలూ మీడియాలో ప్రముఖంగా వచ్చాయి.

ఇప్పుడు షర్మిల చేసిన ఆరోపణలు తీవ్రమైనవి. ఆమెను ఇబ్బందిపెట్టి మానసికక్షోభకు గురిచేసిన వ్యక్తులెవరైనా నిర్దాక్షిణ్యంగా శిక్షించాల్సిందే. అందులో రెండో అభిప్రాయానికి తావే లేదు.  పార్టీల తరఫున ఏర్పాటు చేసుకుంటున్న ఐటీ విభాగాలు, ముఖ్యంగా సోషల్ మీడియా సెల్స్ తమ రాజకీయ  ప్రత్యర్థులపైన  విషప్రచారాలకు దిగితున్నాయన్న విమర్శలు చాలాకాలం నుంచి వినిపిస్తున్నాయి. తనపై చేసిన విమర్శలు కూడా ఆ కోవకు చెందినవని షర్మిల భావిస్తున్నారా అన్నది తెలియదు కానీ ఆమె మీడియాతో మాట్లాడుతూ నేరుగా చంద్రబాబును బాధ్యుల్ని చేయడం ఇక్కడ గమనించాల్సిన విషయం. 

ఇప్పటికే ఈ కేసులో ఇద్దర్ని హైదరాబాద్  నగర పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని వార్తలు  వచ్చాయి. ఐటీ యాక్ట్ లోని సెక్షన్ 67 ప్రకారం వారిని అరెస్ట్ చేసినట్లు కూడా సమాచారం. తనకు ఏపీ పోలీసులమీద నమ్మకం లేదు కాబట్టి హైదరాబాదులో ఫిర్యాదు చేస్తున్నట్లు షర్మిల పేర్కొనడం...దానిని హైదరాబాద్ పోలీసులు స్వీకరించడం కూడా గమనించదగిన పరిణామం. ఇప్పటికే జగన్ పై దాడి కేసును కేంద్ర ప్రభుత్వ విభాగమైన ఎన్ ఐ ఏ కు బదిలీ చేయడంపై  చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. దీని గురించి  ప్రధాని మోడీకి తన అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తూ లేఖ కూడా రాశారు. ఇప్పుడు ఈ కేసు కూడా తమ నాయకుడి నెత్తికి ఎక్కడ చుట్టుకుంటుందేమోనని తెలుగుదేశం నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. 

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం

   7 hours ago


 కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్

కడప జిల్లాలో జూలై 7,8న సీఎం జగన్‌ టూర్

   7 hours ago


కేసీయార్ అంటే అర్థం అదా? కేటీయార్ ట్వీట్‌పై చర్చ

కేసీయార్ అంటే అర్థం అదా? కేటీయార్ ట్వీట్‌పై చర్చ

   11 hours ago


నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి..  జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోండి.. జగన్ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

   12 hours ago


శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు

శ్రామిక్ రైళ్ల ద్వారా ఏపీనుంచి లక్షమంది తరలింపు

   13 hours ago


జూన్‌ 1 నాటికే కేరళలోకి రుతుపవనాల ప్రవేశం

జూన్‌ 1 నాటికే కేరళలోకి రుతుపవనాల ప్రవేశం

   14 hours ago


కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ

కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ

   14 hours ago


కన్నా కుటుంబంలో విషాదం... కోడలు సుహారిక అనుమానాస్పద మృతి

కన్నా కుటుంబంలో విషాదం... కోడలు సుహారిక అనుమానాస్పద మృతి

   15 hours ago


కొండ పోచమ్మ రిజర్వాయర్... కేసీయార్ కలల ప్రాజెక్ట్

కొండ పోచమ్మ రిజర్వాయర్... కేసీయార్ కలల ప్రాజెక్ట్

   15 hours ago


ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్  2.0 ప్రారంభానికి సిద్ధంగా వైసీపీ

ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ 2.0 ప్రారంభానికి సిద్ధంగా వైసీపీ

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle