newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

బాబుకు మొహం చాటేస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు!

16-11-201916-11-2019 12:02:00 IST
Updated On 16-11-2019 12:23:45 ISTUpdated On 16-11-20192019-11-16T06:32:00.613Z16-11-2019 2019-11-16T06:31:58.728Z - 2019-11-16T06:53:45.764Z - 16-11-2019

బాబుకు మొహం చాటేస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నాయి. ఇసుక విధానం దగ్గర నుండి మీడియా చేతులు కట్టేసే జీవో వరకు.. ఇంగ్లీష్ మీడియం విధానం నుండి అమరావతి వరకు ప్రతి అంశం మీద విపక్షాలన్నీ దూకుడుగానే ఉంటున్నాయి. ఇందులో జనసేన పార్టీ నుండి పవన్ కళ్యాణ్ వన్ అండ్ ఆర్మీ పద్దతిలో పోరాడుతుంటే బీజేపీ కేంద్రాన్ని చూసుకొని రెచ్చిపోతుంది.

ఇక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా అధినేత చంద్రబాబు ఒక్కరే పోరాటం చేయాల్సి వస్తుంది. సూటిగా చెప్పాలంటే అసలు టీడీపీ ఎమ్మెల్యేలలో సగం మంది అధినేత చంద్రబాబుకు మొహం చాటేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇందుకు ఆ పార్టీలో జరుగుతున్న తాజాగా పరిణామాలే ఉదాహరణగా కనిపిస్తున్నాయి.

ఈమధ్యనే చంద్రబాబు రాష్ట్రంలో ఇసుక కొరత, కార్మికుల ఆత్మహత్యలపై విజయవాడలో దీక్షకు పూనుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సొంత పార్టీ ఎమ్మెల్యేలకే ఒకటికి రెండు సార్లు ఫోన్లు చేసి హాజరవమని ఆదేశించారు. ఐదారుగురు ఎమ్మెల్యేలు మినహా మిగతా వారంతా ఇసుక దీక్షకు హాజరయ్యారు. అయితే ఆ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేలే ఆ కార్యక్రమంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా పార్టీలో వినిపించింది.

ఎమ్మెల్యేల అసంతృప్తిపై ఆలస్యం చేయకూడదనుకున్న చంద్రబాబు శుక్రవారమే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి ఇసుక దీక్షకు హాజరైన ఎమ్మెల్యేలలో మరికొందరు గైర్హాజరయ్యారు. ఈ సమావేశానికి సైతం ఒకటికి రెండు మూడుసార్లు ఫోన్ కాల్స్ చేసి పిలిచారు. కానీ పదిమంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి డుమ్మాకొట్టారు.

ఇసుక దీక్షకు బలవంతంగా వచ్చిన నేతలు ముఖ్యమైన సమావేశమని చెప్పినా డుమ్మా కొట్టడంపై పార్టీ పెద్దలకు షాక్ తగిలినట్లైంది. మరోపక్క వల్లభనేని వంశీ వ్యవహారం పార్టీకి మింగుడుపడకపోగా.. దేవినేని అవినాష్ దీక్ష రోజే షాక్ ఇవ్వడం తదితర అంశాలపై ప్రస్తుతం పార్టీలో ఏం జరుగుతుంది? అని చర్చ మొదలైంది. ముఖ్యమైన సమావేశానికి కూడా ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంపై పలు వాదనలు వినిపిస్తున్నాయి.

బీజేపీ అసెంబ్లీలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో శాసన సభా పక్షాన్ని ఏర్పాటు చేయనుందని కథనాలొస్తున్న నేపథ్యంలో సమావేశానికి గైర్హాజరైన ఎమ్మెల్యేలే బీజేపీ తీర్ధం పుచ్చుకొనే అవకాశాలున్నాయని ప్రచారం మొదలైంది. గైర్హాజరైన ఎమ్మెల్యేలలో కొందరు వైసీపీ నేతలతో కూడా టచ్ లో ఉన్నట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.

టీడీపీ సమావేశానికి డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలలో గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్, వాసుపల్లి గణేష్, పీజీవీఆర్‌ నాయుడు (గణబాబు), బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, వల్లభనేని వంశీ, గద్దె రామ్మోహన్, బాలకృష్ణ, బెందాళం అశోక్ తదితరులుండగా వంశీ ఇప్పటికే వైసీపీలో చేరబోతున్నారని ప్రకటించగా సప్సెన్డ్ కూడా అయ్యారు. ఇక పయ్యావుల అనారోగ్యంతో, బాలకృష్ణ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. మరి మిగతా ఎమ్మెల్యేలలో బుచ్చయ్య చౌదరి తప్ప మిగతా వాళ్లంతా జంపింగ్ బ్యాచ్ యేనా? అనే అనుమానాలొస్తున్నాయి.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle