newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

బాబుకి షాక్.. సీఎస్ పునేఠా బదిలీ

06-04-201906-04-2019 08:40:06 IST
Updated On 08-07-2019 15:40:45 ISTUpdated On 08-07-20192019-04-06T03:10:06.770Z06-04-2019 2019-04-06T03:09:59.590Z - 2019-07-08T10:10:45.632Z - 08-07-2019

బాబుకి షాక్.. సీఎస్ పునేఠా బదిలీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం చంద్రబాబుకి షాక్ ఇచ్చింది. సీఎస్‌ని బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ చంద్ర పునేఠాపై బదిలీ వేటు వేసింది. కొత్త సీఎస్‌గా 1983 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పునేఠాను ఎన్నికలతో సంబంధంలేని పోస్టులో నియమించాలని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది.

ఇటీవల రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్‌ల బదిలీల విషయంలో సీఎస్‌ పునేఠాను కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీకి పిలిపించింది. ఐపీఎస్‌ల బదిలీ అంశం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెంటవెంటనే జారీచేసిన మూడు జీవోల విషయమై ఈసీఐ సుదీర్ఘ వివరణ కోరింది. అనంతరం ఐపీఎస్‌ అధికారుల బదిలీపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.

ఎన్నికల విధులకు దూరంగా ఉంటున్న ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ వ్యవహారంలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి వర్తించవని, ఆయన ఎన్నికల విధుల్లో లేరని జీవోలో పేర్కొంది. ఈ వ్యవహారంలో ప్రతి అంశంపైనా పునేఠా నుంచి వివరణ కోరింది ఈసీ. మొత్తం మీద వరుస వ్యవహారాలు చంద్రబాబుకి కాసింత అసహనాన్ని కలిగిస్తున్నాయి. ఎన్నికల వేళ ఇలాంటివి మామూలే అంటున్నారు సీనియర్ అధికారులు. 

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle