newssting
BITING NEWS :
*కాకినాడలో ముగిసిన జనసేన రైతు సౌభాగ్యదీక్ష*మహిళలకు అండగా చరిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం *ఆఖరి టీ 20లో ఉతికి ఆరేసిన టీమిండియా...సిరీస్ కైవసం *తెలంగాణ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు..దమ్ముగూడంలో గోదావరిపై బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయం*Ap రాజధాని భూ సమీకరణ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్..అసైన్డ్ భూములని నిబంధనలకు విరుద్దంగా కొనుగోలు చేసి ల్యాండ్ పూలింగుకు ఇచ్చిన వ్యక్తుల రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేస్తూ నిర్ణయం *125 మంది సభ్యుల మద్దతుతో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన పెద్దల సభ*వర్మ సినిమాకు గ్రీన్ సిగ్నల్..అమ్మరాజ్యంలో కడప బిడ్డలు మూవీ ఇవాళ విడుదల *పీఎస్ఎల్వీ సి48 రీశాట్, 2 బీఆర్-1 ప్రయోగం విజయవంతం *గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తిస్తున్నట్టు అసెంబ్లీలో తెలిపిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం

బాబుకి షాక్.... ప్రజావేదిక స్వాధీనం

21-06-201921-06-2019 18:11:18 IST
2019-06-21T12:41:18.574Z21-06-2019 2019-06-21T12:41:16.761Z - - 13-12-2019

బాబుకి షాక్.... ప్రజావేదిక స్వాధీనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు ఎంపీల జంపింగ్.. కాపునేతల సమావేశాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చంద్రబాబుకు మరో పంచ్ విసిరారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం సమీపంలో ఉండే ప్రజావేదిక క్యాంప్ కార్యాలయాన్ని ఏపీ ప్రభుత్వం తాజాగా స్వాధీనం చేసుకుంది. ఈ నెల 24న జరగబోయే కలెక్టర్ల సదస్సును ప్రజావేదికలో నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం... ఇందుకోసం ప్రజావేదికను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. 

ఈ మేరకు చంద్రబాబు పీఎస్‌కి సమాచారం అందించిన గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్... ప్రజావేదికలో ఉన్న టీడీపీ సామాగ్రిని తరలించాలని ఆదేశించారు. నిజానికి ఉండవల్లిలోని తన నివాసం సమీపంలో ఉండే ప్రజావేదిక ప్రాంగణాన్ని తనకు కేటాయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు గతంలోనే ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. ఎంపీ విజయసాయిరెడ్డి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ఏపీ ప్రభుత్వం అమరావతి తరలివెళ్లిన తరువాత ప్రభుత్వ సమావేశాలు, సదస్సుల కోసం రూ. 10 కోట్ల ఖర్చుతో సీఆర్డీఏ ప్రజావేదికను నిర్మించింది. పార్టీ అధినేతగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని... ఇందుకోసం ప్రజావేదిక ప్రాంగణాన్ని కేటాయిచాలని చంద్రబాబు కోరిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు లేఖకు ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈలోపు ఏపీ ప్రభుత్వం ప్రజావేదిక ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించడం టీడీపీ వర్గాలకు షాక్ ఇచ్చింది. ఈ నిర్ణయం టీడీపీ వర్గాలను విస్మయపరిచింది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle