newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

బాబుకి వరద కష్టాలు.. ఇంటిముందుకొచ్చిన కృష్ణమ్మ

16-08-201916-08-2019 12:11:19 IST
Updated On 16-08-2019 12:10:01 ISTUpdated On 16-08-20192019-08-16T06:41:19.086Z16-08-2019 2019-08-16T06:37:47.448Z - 2019-08-16T06:40:01.411Z - 16-08-2019

బాబుకి వరద కష్టాలు.. ఇంటిముందుకొచ్చిన కృష్ణమ్మ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగునాట వరద రాజకీయం రసకందాయంగా సాగుతోంది. చంద్రబాబు నివాసానికి వరద ముంపు వ్యవహారంపై అధికార వైసీపీ-ప్రతిపక్షం టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వైసీపీ అధికారంలో రాగానే కృష్ణా కరకట్టపై అక్రమ కట్టడాల పనిపడుతోంది. నదీ తీరంలో రివర్ కన్జర్వేషన్ యాక్ట్‌కు వ్యతిరేకంగా చాలా కట్టడాలు వెలిశాయి.

అనుమతులు లేకుండా భారీ భవనాలను ఇష్టమొచ్చినట్టు నిర్మించారు. వీటిలో చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కూడా ఉంది. కొత్తగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కరకట్టపై అక్రమ కట్టడాలపై ఫోకస్ పెట్టింది. తొలి అడుగుగా అక్రమ కట్టడం అంటూ ప్రజా వేదికను కూల్చేశారు. ఆ వెంటనే అన్ని కట్టడాలకు నోటీసులు పంపారు.

ఈ క్రమంలో బాబు నివాసముంటున్న లింగమనేని గెస్ట్ హౌస్‌కు నోటీసులు అందాయి. తర్వాత కొందరు అక్రమకట్టడాల యజమానులు హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం కట్టడాల నోటీసులపై స్టే ఇచ్చింది. 

తాజాగా కృష్ణా నదీ పరివాహక ప్రదేశంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇల్లు ప్రమాదం అంచున నిలిచింది. పులిచింతల ప్రాజెక్టు నుంచి దాదాపు 7.52 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో వరద చంద్రబాబు ఇంటి మెట్లను తాకింది. వరద ఉధృతి పెరిగితే చంద్రబాబు నివసించే లింగమనేని ఎస్టేట్ మునగడం ఖాయమని అధికారులు అంటున్నారు. విజయవాడ వద్ద కృష్ణా నది 15 అడుగుల ఎత్తులో ప్రవహిస్తుండటంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్దవరద నీటి ఉధృతి పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరిక జారీచేశారు అధికారులు. కృ‌ష్ణా జిల్లాలో ముంపు ప్రాంత అధికారులను అప్రమత్తం చేసింది విపత్తు నిర్వహణ శాఖ. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గురువారం అర్థరాత్రికి ప్రకాశం బ్యారేజీకి ఇన్‌ఫ్లో తీవ్రంగా పెరిగింది. ఎగువ నుంచి 5,66,860 క్యూసెక్కుల నీరు వస్తుండగా, బ్యారేజీ నుంచి 5,65,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

అధికారులు ఇప్పటి వరకు మొత్తం 50 టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలారు. విజయవాడలోని బాలాజీ నగర్, భూపేష్‌గుప్తా నగర్, రామలింగేశ్వరనగర్ ప్రాంతాలు నీట మునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పరిశీలించారు.వరద ఉధృతి కారణంగా అమరావతి, క్రోసూరు, అచ్చంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle