newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

బాబుకి బొమ్మ చూపిస్తున్న జగన్.. ఇల్లు ఖాళీచేయమని నోటీస్!

28-06-201928-06-2019 12:34:50 IST
2019-06-28T07:04:50.120Z28-06-2019 2019-06-28T07:04:48.472Z - - 15-12-2019

బాబుకి బొమ్మ చూపిస్తున్న జగన్.. ఇల్లు ఖాళీచేయమని నోటీస్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

చంద్రబాబుని ముప్పుతిప్పులు పెడుతున్నారు ఏపీ సీఎం జగన్. ప్రజావేదిక కూల్చివేత చేదు ఘటనను మరిచిపోకముందే మరో పిడుగు వచ్చిపడింది బాబు మీద. చంద్రబాబు ప్రస్తుతం ఉంటున్న నివాసానికి సీఆర్‌డీఏ నోటీసులు జారీచేయడం ఏపీ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ నోటీసుల్లో వారం రోజుల పాటు గడువు ఇచ్చారు. 

క‌ృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలు వేటినీ ఉంచబోమని, వాటిని కూల్చేస్తామని సీఎం జగన్ కలెక్టర్లు సమావేశంలో ప్రకటించిన తర్వాత ప్రజావేదిక కూల్చివేశారు. సీఆర్‌డీఏ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు వీటిని అక్రమ నిర్మాణాలని తేల్చిన తర్వాతే నోటీసులు జారీ చేశారని అంటున్నారు.

లింగమనేని ఎస్టేట్‌లో చంద్రబాబు నివాసం ఉంటున్న సంగతి తెలిసందే. ఈ ఎస్టేట్ అక్రమనిర్మాణమని  సీఆర్‌డీఏ నోటీసులు జారీ చేసింది. సీఆర్‌డీఏ అడిషనల్ డైరెక్టర్ నరేందర్ రెడ్డి స్వయంగా లింగమనేని ఎస్టేట్‌కు వెళ్లి అక్కడి గోడ మీద నోటీసులు అంటించారు. నదీ గర్భంలో నిర్మించిన లింగమనేని ఎస్టేట్.. నదుల పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి నిర్మించారని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులపై వివరణ ఇచ్చి 7 రోజుల్లోగా స్వచ్చందంగా భవనాలను తొలగించాలని ఆదేశించారు.

కరకట్ట చుట్టూ ఉన్న మిగతా నిర్మాణాలను ఉపేక్షించబోమంటున్నారు అధికారులు. చంద్రబాబు నివాసంతో పాటు మిగతా అక్రమ కట్టడాలకు కూడా నోటీసులు ఇవ్వడం ద్వారా.. తాము ఒక్కరినే టార్గెట్ చేయలేదని జగన్ ప్రభుత్వం సంకేతాలు పంపించినట్టు అయింది. మొత్తం మీద చంద్రబాబుని టార్గెట్ చేసిన జగన్... ఇంకేం చర్యలు తీసుకుంటారోనని జనమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ys jagan,chandrabau naidu,chandrababu naidu residence,krishna karakatta,amaravati,praja vedika,వైఎస్ జగన్,చంద్రబాబు నాయుడు,చంద్రబాబు నివాసం,కృష్ణా నది కరకట్ట,అమరావతి

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle