newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

బాబుకి పసుపు కుంకుమ రూపంలో రిటర్న్ గిఫ్ట్-2

23-04-201923-04-2019 16:20:24 IST
Updated On 24-04-2019 13:13:15 ISTUpdated On 24-04-20192019-04-23T10:50:24.146Z23-04-2019 2019-04-23T10:50:14.501Z - 2019-04-24T07:43:15.517Z - 24-04-2019

బాబుకి పసుపు కుంకుమ రూపంలో రిటర్న్ గిఫ్ట్-2
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి టీడీపీ నేతలలో ఇప్పుడు ఓటమి వణుకు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘనమైన ఫలితాలను అందించిన పశ్చిమగోదావరి వాసులు ఈసారి టీడీపీకి షాకివ్వబోతున్నారని రిటైర్డ్ ప్రిన్సిపల్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ఆంధ్రాయూనివర్శిటీ మాజీ పాలకమండలి సభ్యులు డా.గుబ్బల తమ్మయ్య అభిప్రాయపడ్డారు.

రాబోయే ఎన్నికల ఫలితాలపై ఆయన ‘న్యూస్ స్టింగ్’ ప్రతినిధితో మాట్లాడారు. ఈసారి ఈవీఎంలలో ఉన్న తీర్పు తెలుగుదేశం పార్టీకి షాకిస్తుందన్నారు. జనం మార్పుకోరుకుంటున్నారని, ఎన్నికల్లో వైసీపీ బాగా పుంజుకుంటుందన్నారు. 

ఉభయ గోదావరి జిల్లాల ఓటర్లు వినూత్నమయిన తీర్పును ఇవ్వబోతున్నారని తమ్మయ్య చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో తాను పర్యటించానని, టీడీపీ నేతలు భావిస్తున్నట్టు పసుపు కుంకుమ రూపంలో చంద్రబాబు ఇచ్చిన చెక్కుల కంటే తాము మోసపోయామనే భావన మహిళల్లో ఎక్కువగా ఉందన్నారు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో చంద్రబాబు అంచనాలు తలక్రిందులు అవుతాయన్న అభిప్రాయం వ్యక్తంచేశారు తమ్మయ్య.

మరో వైపు తాము కచ్చితంగా గెలుస్తామని చెప్పే సాహసం చేయడం లేదు అభ్యర్ధులు. పలువురు మంత్రులు సైతం గెలుపుపై స్పష్టత లేకుండా మాట్లాడినట్లు తెలిసింది. ఈసారి వైఎస్సార్‌సీపీ నుంచి ఊహించని స్థాయిలో పోటీ వచ్చిందని గోదావరి జిల్లాలకు చెందిన ఒకరిద్దరు మంత్రులు అంతర్మథనం చెందుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఈసారి ఓటమి అంచున ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆచంటలో మూడోసారి పోటీలో ఉన్న టీడీపీ నేత పితాని సత్యనారాయణకు వైసీపీ అభ్యర్ధి చెరుకువాడ శ్రీరంగనాథరాజు గట్టిపోటీ ఇచ్చారు. పితాని గెలుపు అంత ఆషామాషీ కాదని, ఓటర్లు షాకిచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదన్నారు రాజకీయ విశ్లేషకులు డా. గుబ్బల తమ్మయ్య

పశ్చిమగోదావరి జిల్లాలో కొవ్వూరులో పోటీ చేయకుండా పక్క జిల్లాకు వెళ్ళిన మరో మంత్రి జవహర్‌కు కూడా కృష్ణా నదిలో ఎదురీత తప్పదంటున్నారు. సమీకరణలన్నీ తమకు వ్యతిరేకంగా ఉన్నాయని, తమ వెంట ఉంటారనుకునే బీసీల్లోనూ ఈసారి మార్పు వచ్చిందని, ఓటింగ్‌ సరళి కూడా అంచనాకు అందడంలేదని కాకలు తీరిన నేతలే తలలు పట్టుకుంటున్నారు. మొత్తం మీద టీడీపీ నేతలకు ఈ ఎన్నికలు షాకివ్వబోతున్నాయని అంటున్నారు. అయితే చంద్రబాబుకి సన్నిహితులైన నేతలు మాత్రం గెలుపుపై ధీమాతో వున్నారు. 

మహిళల ఓట్లు తమకే పడతాయని, ఈసారి టీడీపీ అనూహ్య విజయం సాధిస్తుందని టీడీపీ ఎమ్మెల్సీ వై.వీ.బాబు రాజేంద్రప్రసాద్ ఆత్మవిశ్వాసంతో పేర్కొన్నారు. పసుపు-కుంకుమ పేరుతో చంద్రన్న చేసిన సాయం మహిళలకు కొండంత భరోసా కల్పించిందని రాజేంద్రప్రసాద్ ‘న్యూస్ స్టింగ్’ ప్రతినిధితో చెప్పారు. మహిళా ఓట్లతో తాము 115-120 సీట్లు సాధించబోతున్నామని, మహిళలది నిశ్శబ్ధ విప్లవం అన్నారాయన. మే23న వెల్లడయ్యే ఫలితాలు తమకు అనుకూలం అంటున్నారు. ఎవరెన్ని చెప్పినా చంద్రబాబు మళ్ళీ సీఎం కుర్చీపై కూర్చోవడం ఖాయం అంటున్నారు. మరి ఎవరి ధీమా ఉంటుందో తెలియాలంటే మరో నెలరోజులు ఆగాల్సిందే. 

బాబుకి పసుపు కుంకుమ రూపంలో రిటర్న్ గిఫ్ట్-1  కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి  https://www.newssting.in/p/5cbeecf6ed50b81d17dcde6e


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle