newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

బాబుకి పసుపు కుంకుమ రూపంలో రిటర్న్ గిఫ్ట్-1

23-04-201923-04-2019 16:20:22 IST
Updated On 24-04-2019 13:12:16 ISTUpdated On 24-04-20192019-04-23T10:50:22.235Z23-04-2019 2019-04-23T10:46:14.981Z - 2019-04-24T07:42:16.061Z - 24-04-2019

బాబుకి పసుపు కుంకుమ రూపంలో రిటర్న్ గిఫ్ట్-1
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ‘రిటర్న్ గిఫ్ట్’ కి మించిన బర్నింగ్ టాపిక్ లేదనే చెప్పాలి. అసెంబ్లీ ముందస్తు ఎన్నికల తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ మాట తొలుత ఉపయోగించారు. చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో వేలు పెట్టారని, చంద్రబాబుకి తాను కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ అన్నమాటలు రెండు రాష్ట్రాల నేతల్లోనూ, ప్రజల్లోనూ ఆసక్తిని రేకెత్తించింది. ఆ తరవాత తెలంగాణ నేతలు. వైసీపీ నేతలు కూడా చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ రెడీ అయిందని ప్రకటించారు. దీనికి చంద్రబాబు గట్టి కౌంటరే ఇచ్చారు. కానీ ఏపీ ఎన్నికలు ముగిసిన వేళ టీడీపీ నేతల్లో  ‘రిటర్న్ గిఫ్ట్’ గుబులు రేపుతోంది.

నాలుగేళ్ళు నిశ్శబ్దంగా ఊరుకుని డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ పేరుతో చెక్కులు ఇచ్చారు చంద్రబాబు. తాను పెద్ద కొడుకుగా, అన్నగా చేదోడువాదోడుగా ఉంటానని చెప్పుకొచ్చారు. టీడీపీ ఎన్నికల ప్రకటనలు కూడా అదే విధంగా సాగాయి. ఈ ఎన్నికల్లో పసుపు కుంకుమ తమకు ప్లస్ పాయింట్ అవుతుందని అక్కాచెల్లెళ్ళు తనకు ఓట్లను బహుమానంగా ఇస్తారని చంద్రబాబు పదేపదే చెప్పారు.

అంతే ఉత్సాహంగా ఎన్నికల్లో తిరిగారు. వృద్ధాప్య పింఛన్లు, పసుపుకుంకుమ, అన్నదాద సుఖీభవ, బడుగు, బలహీనవర్గాలకు సంక్షేమ పథకాలు టీడీపీని మళ్ళీ అధికారంలోకి తెస్తుందని భావించారు. దీనికి తగ్గట్టుగా ఎన్నికల్లో మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. మహిళల ఓట్లు తమకు సానుకూల ఫలితాలు వస్తాయని టీడీపీ నేతలు కొండంత నమ్మకంతో ఉన్నారు. 

అయితే అందుతున్న సమాచారం, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం ప్రకారం ఎన్నికల ముందు పసుపు కుంకుమ చెక్కులు ఇచ్చిన చంద్రబాబు.. నాలుగేళ్ళ నుంచి తమను పట్టించుకోలేదని, అందుకే తాము చంద్రబాబుకి ఊహించని నజరానా ఇస్తారంటున్నారు. అది రిటర్న్ గిఫ్ట్ రూపంలో ఉంటుందని వారు చెబుతున్నారు. తమకు 2 లక్షల వరకూ అప్పు ఉందని, ఎన్నికలకు ముందు అదంతా మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇప్పుడు సగం కూడా మాఫీ కాలేదంటున్నారు తెలుగింటి ఆడపడుచులు. అందుకే తాము చంద్రబాబుకి సర్ ప్రైజ్ ఇస్తామంటున్నారు. 

ఈ ఎన్నికల్లో తెలుగు దేశానికి  గెలుపు అన్నది ఒక చారిత్రకమైన అవసరం. ఈసారి చంద్రబాబు ఓడిపోతే తెలుగుదేశానికి భవిష్యత్తు ఉండదు. మరో ఐదేళ్ళు పార్టీని కాపాడుకోవడం కష్టం. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఎన్నికలు చంద్రబాబు-జగన్మోహన్ రెడ్డికి జీవన్మరణ సమస్యలాంటివి. సర్వేలు, అంచనాలు జగన్‌కి అనుకూలంగా ఉన్నాయి. అందుకే చంద్రబాబు రివ్యూ సమావేశాలు పేలవంగా ఉంటున్నాయి. పోటీచేసిన అభ్యర్థులు, సీనియర్‌ నేతల్లో మాత్రం ఎక్కడా గెలుపుపై భరోసా కనిపించడంలేదు. 

బలమైన నేతలుగా చెప్పుకునే వారు సైతం తమ నియోజకవర్గాల్లో గెలుస్తామో? లేదో? అనే రీతిలో మాట్లాడడం ఇతర నేతలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కచ్చితంగా గెలుస్తారని టీడీపీ భావిస్తున్న పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌.. తనకు చాలా గట్టి పోటీ ఉందని, మైనస్‌లో ఉన్నానని పలువురు మీడియా ప్రతినిధుల ఎదుటే చెప్పడం టీడీపీలో నెలకొన్న తాజా పరిస్థితికి అద్దం పట్టింది. 

(ఇంకా ఉంది) 

బాబుకి పసుపు కుంకుమ రూపంలో రిటర్న్ గిఫ్ట్-2 కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి   

https://www.newssting.in/p/5cbeede6ed50b81d17dcde70


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle