newssting
BITING NEWS :
*కలకత్తా జాదవ్ పూర్ యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్తత*రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత*కాంగ్రెస్‌ అగ్నికి ఆజ్యం పోస్తోంది.. ‘పౌరసత్వ’ ఆందోళనలకు పరోక్ష సహకారం: మోడీ *కేంద్ర మాజీ మంత్రి ఐడీ స్వామి కన్నుమూత *ఏపీ అసెంబ్లీలో 11 కీలక బిల్లులు...ప్రభుత్వ ప్రజా రవాణా శాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

బాబుకి కేవీపీ లేఖ: పోలవరంపై రగడ

07-05-201907-05-2019 13:32:32 IST
Updated On 01-07-2019 13:11:48 ISTUpdated On 01-07-20192019-05-07T08:02:32.667Z07-05-2019 2019-05-07T08:02:29.628Z - 2019-07-01T07:41:48.036Z - 01-07-2019

బాబుకి కేవీపీ లేఖ: పోలవరంపై రగడ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పోలవరం ప్రాజెక్ట్‌పై మరోమారు చంద్రబాబుకి లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం ఇవ్వాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని ఏపీ ప్రభుత్వం పెంచిందని దాన్ని తాము భరించబోమని కేంద్రం స్పష్టం చేసిందని , ఈ విషయం దాచిపెట్టి రాష్ట్రప్రభుత్వం ఆ భారాన్ని మోసేందుకు సిద్ధం అయ్యిందని కేవీపీ ఆరోపిస్తూ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. రూ.28,467 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని , ఇది చంద్రబాబుకు తెలిసినా ఆయన ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని ఆరోపించారు . 

ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని పోలవరం పూర్తి ఖర్చును కేంద్రమే భరించాలని హైకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేవీపీ డిమాండ్ చేశారు. తాను పోలవరంపై మాట్లాడుతుంటే చంద్రబాబు వ్యక్తిగత దూషణలు చేస్తున్నారన్నారు. పోలవరం కేసులో రాష్ట్ర ప్రభుత్వం 18నెలలుగా కౌంటర్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. తాను మీ స్థాయికి దిగజారి వ్యక్తిగత విషయాలకు వెళ్తే తట్టుకోలేరన్నారు. పోలవరంపై బహిరంగ చర్చకు చంద్రబాబు, దేవినేని సిద్దమా అని కేవీపీ ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే కేవీపీ ముఖ్యమంత్రికి రాసిన బహిరంగ లేఖపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘాటుగా స్పందించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కేవీపీ వ్యాఖ్యలను తప్పుబట్టారు.  బీజేపీ , వైసీపీ కోవర్టుగా పని చేస్తున్న కేవీపీ పోలవరం నిర్మాణ రికార్డులు చూసి సిగ్గుపడాలన్నారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞoగా మార్చి డబ్బులు దండుకున్న కేవీపీ పోలవరంపై ఉత్తరాలు రాయడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. పోలవరానికి ఖర్చు పెట్టిన నిధులు రాకుండా ప్రధాని కార్యాలయం అడ్డుపడుతున్నా నోరెందుకు మెదపడం లేదని దేవినేని ఉమా  ప్రశ్నించారు.

తన లేఖపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేవీపీ. పోలవరం ప్రాజెక్టుపై ఓనమాలు కూడా తెలియని వారు తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు వల్లే తీరని అన్యాయం జరుగుతోందన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని , పోలవరం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు రావాలని సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమాలకు కేవీపీ సవాల్ విసిరారు. తాను రాసిన లేఖను చదవకుండానే విమర్శలు చెయ్యడం దురదృష్టకరమన్నారు. పోలవరం ప్రాజెక్టుపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడే ఉన్నానన్నారు. మొత్తం మీద పోలవరం రగడ ఇప్పట్లో చల్లారేలా లేదు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle