newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

బాపనమ్మ గతాన్ని మర్చిపోయారట...

14-03-201914-03-2019 07:17:22 IST
2019-03-14T01:47:22.028Z14-03-2019 2019-03-14T01:42:00.500Z - - 20-09-2019

బాపనమ్మ గతాన్ని మర్చిపోయారట...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నికల సమయంలో పార్టీలు మారడం సహజం. టిక్కెట్ రాని వారూ, అనుకున్న పదవి దక్కని వారు అదును చూసి పార్టీ మారేస్తారు. ఈ విషయంలో ఏ పార్టీకి చెందిన నాయకుడూ మినహాయింపు కాదు. కాకపోతే పార్టీ మారే ముందు వారి ఆరోపణలే విచిత్రంగా ఉంటాయి. టీడీపీలో దాదాపు 30 సంవత్సరాలు కొనసాగిన తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన పర్వత బాపనమ్మ కుటుంబం, ఈ ఎన్నికల వేళ వైసీపీలో చేరారు.

ఇందులో ఆక్షేపించదగినది ఏదీ లేదూ. కాకపోతే ఆమె చేసిన ఆరోపణే అన్యాయంగా ఉందనేది విశ్లేషకుల మాట. 30 ఏళ్లుగా టీడీపీలో ఉన్న తమ కుటుంబానికి చంద్రబాబు అన్యాయం చేశారని పర్వతమ్మ ఆరోపించారు. జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని చెప్పుకొచ్చారు. ఈ మాటలు అనే ముందు ఆమె గతాన్ని ఓసారి గుర్తు చేసుకోవాలని టీడీపీ నేతలతో పాటు, విశ్లేషకులు కూడా అభిప్రాయ పడుతున్నారు.

ఎందుకంటే 1994 ఎన్నికల్లో బాపనమ్మ భర్త పర్వత సుబ్బారావు ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎంఎల్ఏగా గెలిచారు. ఆ తర్వాత ఆయన చనిపోవడంతో 1999లో బాపనమ్మ పోటీ చేసి గెలిచారు.

అంటే వరుసగా రెండుసార్లు పర్వత కుటుంబానికే చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు. ఇక 2009 ఎన్నికల సమయంలో వీరి కుటుంబానికే చెందిన పర్వత శ్రీసత్యనారాయణ మూర్తికి టిక్కెట్ ఇచ్చారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో శ్రీసత్యనారాయణ మూర్తి కూడా విజయం సాధించారు. కేవలం మొన్నటి ఎన్నికల్లోనే వరుపుల సుబ్బారావుకు టిక్కెట్ ఇచ్చి గెలిపించుకున్న చంద్రబాబు... ఈసారి కూడా ఆయనకే టిక్కెట్ ఖరారు చేశారట. ఇదంతా అర్థం చేసుకుంటే మూడు దఫాలు పర్వత కుటుంబం టీడీపీ నుంచి టిక్కెట్ దక్కించుకుంది.

వీరి మీద నమ్మకం, అభిమానం లేకుండా చంద్రబాబు టిక్కెట్ ఇచ్చే వారు కాదన్నది సత్యం. ఇక నామినేటెడ్ పదవుల్లో కూడా పర్వత కుటుంబానికి న్యాయం చేశారు చంద్రబాబు. ఈ ఎన్నికలు కీలకం కావడంతోనే అన్ని విధాలుగా ఆలోచించిన చంద్రబాబు, వరుపుల సుబ్బారావుకు మళ్లీ అవకాశం ఇస్తున్నారు. ఇదంతా తెల్సినా, కేవలం ఈ ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వలేదన్న కోపంతో పర్వత కుటుంబం టీడీపీని వీడటం సరైంది కాదనేది ప్రత్తిపాడు జనం ఆరోపిస్తున్నారు. గతాన్ని మర్చిపోయినవారు భవిష్యత్తులో ఇబ్బందులు పడడం ఖాయం అంటున్నారు.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle