newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

బస్సు యాత్ర తుస్సేనా?

27-02-201927-02-2019 14:13:40 IST
Updated On 27-02-2019 14:33:27 ISTUpdated On 27-02-20192019-02-27T08:43:40.231Z27-02-2019 2019-02-27T07:50:50.232Z - 2019-02-27T09:03:27.419Z - 27-02-2019

బస్సు యాత్ర తుస్సేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ విభజనతో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఈసారైనా పరువు నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఏపీసీసీ నేతలు తమ మధ్య వున్న వైరుధ్యాలను, విభేదాలను పక్కన పెట్టి ప్రత్యేక హోదా భరోసా బస్సు యాత్ర చేపట్టారు. ఈ బస్సు యాత్ర తలపెట్టుకున్న కొంతమంది కాంగ్రెసు పెద్దలు బలవంతంగా చేసుకుంటున్న ప్రయాణంలో పాసెంజర్లు కరువయ్యారు.

ఏపీ సీఎం చంద్రబాబును ఏమీ అనలేరు. తమ తెలంగాణా పాత్రను సమర్ధించుకోలేరు. పోనీ మొన్నటి టీడీపీతో పొత్తు తమకు తీరని చేటు చేసిందనీ బహిరంగంగా చెప్పుకోలేరు. అలా అని మేమందరం కలిసి తెలుగు రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టామనీ చెంపలేసుకోలేరు. పేరుకు జాతీయపార్టీ కాబట్టి మొత్తం 175 సీట్లలో పోటీ చేయాల్సిందే. పోనీ ఎవరితోనైనా పొత్తు పెట్టుకుని వాళ్లకు కొన్ని సీట్లు ఇద్దామన్నా కనుచూపుమేరలో వాళ్ళకెవరూ కనిపించడంలేదు.

ఈ ఏపీలో పేరున్న నాయకుడు ఒకరైనా లేరు. గతంలో చక్రాలు తిప్పినోళ్లంతా ముఖాలు చాటేశారు. చిరంజీవి వంటి నాయకులు కాంగ్రెసు ప్లాటుఫారాల మీద కనిపించడం మానేసి చాలా కాలమైంది. జేసీ, రాయపాటి, కావూరి, పురందేశ్వరిలాంటివాళ్లంతా కండువాలు మార్చేసుకుని చాలా కాలమైంది. పేరుకు తాము కాంగ్రెసులోనే ఉన్నామని చెప్తున్న వాళ్ళెవరూ ఆ దరిదాపుల్లో లేకపోవడం ఆ పార్టీ దయనీయ స్థితిని తెలియచేస్తోంది. మొహమాటానికి నాలుగు ముక్కలు రాసే మీడియా నాలుగు కెమెరాలు చంకన తగిలించుకుని తిరిగాయి తప్ప అక్కడసలు విషయమే లేదు.

కాంగ్రెస్ నేతలకు వాడివేడి విమర్శలు చేసే అవకాశమే లేదు. టీడీపీని విమర్శించటం ఎలా అన్న ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సరిగా పరిపాలించట్లేదనీ, అవినీతిలో కూరుకుపోయిందనీ అనలేరు. టీడీపీ పాలన బాలేనప్పుడు... అదే పార్టీతో రాహుల్ ఎందుకు జట్టు కడుతున్నారని ప్రజలు నిలదీస్తారు. వీటికి కాంగ్రెస్ నేతలు ఏం సమాధానం చెబుతారు. జాతీయ రాజకీయాలు వేరు, రాష్ట్ర రాజకీయాలు వేరు అని అంటే కుదరదు. ఇలాంటి విషయాల్లో ఓటర్లు దిమ్మతిరిగే నిర్ణయం తీసుకుంటారు. అడ్డగోలుగా మాట్లాడే పార్టీలను తిప్పికొడతారు. అందుకే కాంగ్రెస్ నేతల్లో ఈ సంశయం వీడట్లేదు.

Image may contain: 3 people

ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట ఇపుడు బీటలు వారిపోయి శిథిలమయిపోయిన వైనాల్ని చూసి బాధపడుతున్న మాజీలు మాత్రం అక్కడక్కడా కనిపిస్తారు. ఒక నాయకుడు ఉన్నంతవరకే ఏదైనా జరుగుబాటు. రాహుల్ వచ్చాడు...ప్రియాంక వచ్చిందన్న సంతోషాలైతే ఇక్కడి కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపించడంలేదు. మొత్తం మీద కాంగ్రెస్ బస్సు యాత్ర ఎవరు ఎవరికోసం చేస్తున్నారన్న ఒక పెద్ద క్వశ్చెన్ మార్కును మిగిల్చింది. 

Image may contain: 5 people

తమ పార్టీ బస్సుయాత్రకు అనూహ్య స్పందన లభిస్తోందని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ, డా.ఎన్.తులసిరెడ్డి ‘న్యూస్ స్టింగ్’ ప్రతినిధికి వివరించారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టం హామీలు, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, డ్వాక్రా సంఘాలకు 2 లక్షల రుణమాఫీ, తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని హామీలు ఇస్తున్నామన్నారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోసం ఇప్పటివరకూ 1300 దరఖాస్తులు వచ్చాయని తులసిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీచేయడానికి అభ్యర్ధులే లేరన్న వార్తలను ఆయన ఖండించారు. కాంగ్రెస్ పార్టీపై ఇలాంటి ఆరోపణలు చేయడం మామూలేనన్నారు. రాష్ట్రంలో పొత్తుల సంగతి ప్రస్తావనకు రాలేదన్నారు.  


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle