బకాయిలు రూ.80,000 కోట్లు మోదీనే చెల్లించమన్న జగన్
07-10-201907-10-2019 12:03:16 IST
Updated On 08-10-2019 00:01:22 ISTUpdated On 08-10-20192019-10-07T06:33:16.718Z07-10-2019 2019-10-07T06:33:14.711Z - 2019-10-07T18:31:22.036Z - 08-10-2019

మీరు నమ్మండి.. నమ్మకపోండి. ఇది మాత్రం నిజం. బేరాలాడటంలో కేసీఆర్నే వైఎస్ జగన్ మించిపోయారా అనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావలసిన 5 వేల కోట్ల రూపాయిల లోపు బకాయినే చెల్లించకుండా కేంద్ర ప్రభుత్వం మొరాయిస్తున్నప్పడు ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ తోనే భారీ బేరసారాలకు జగన్ దిగినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర ప్రభుత్వానికి గత అయిదేళ్ల కాలానికి గానూ కేంద్రం వివిధ పథకాల కింద ఇవ్వాల్సిన మొత్తం, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద రాష్ట్రానికి రావలసిన వాటా మొత్తం రూ. 80,000లను తక్షణం విడుదల చేయాలని జగన్ ప్రధాని మోదీని అభ్యర్థించారు. మొదట కేంద్రం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఇవ్వాల్సిన రూ. 40,000 కోట్లను విడుదల చేయాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానిని కోరారు. బడ్జెటరీ అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వివిధ పథకాల కింద రూ. 61,071 కోట్లను కేంద్రం చెల్లించాల్సి ఉంది. ఇది గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఏపీకి కేంద్రం చెల్లించాల్సిన బకాయి. కానీ ఇంతవరకు రాష్ట్రానికి కేంద్రం నుంచి అందిన మొత్తం రూ. 6,739 కోట్లు మాత్రమే. గతంలో టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసిన వివిధ పనులకు గాను పెండింగులో ఉన్న రూ. 50,000 కోట్ల విలువైన బిల్లులను మేము చెల్లించాల్సి ఉందని, అందుకే రాష్ట్రాభివృద్ధి కోసం తక్షణం కనీసంగా రూ. 40 వేల కోట్లను విడుదల చేయవలసిందని కేంద్రాన్ని అభ్యర్థించామని వైఎస్ జగన్ తెలిపారు. రెండోది, కాగ్ రిపోర్టు ప్రకారం రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర రెవెన్యూ లోటు రూ. 22,948,76గా అంచనా వేశారు. ఇంతవరకు ఈ మొత్తంలో కేంద్రప్రభుత్వం కేవలం రూ. 3,979 కోట్లను మాత్రమే చెల్లించింది. ఇంకా రూ. 18,969 కోట్ల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. రెవెన్యూ లోటుకింద ఎంత మొత్తం రావలసిందో ప్రధానమంత్రి కార్యాలయానికి చెప్పి ఒప్పించినందున కేంద్రం వీలయినంత త్వరగా ఈ మొత్తాన్ని విడుదల చేయాలని వైఎస్ జగన్ కోరారు. మూడోది, పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం రూ. 55,548 కోట్ల వివరాలను రాష్ట్రం ఇప్పటికే కేంద్రానికి సమర్పించింది. దీన్ని వీలయినంత త్వరగా చెల్లించాల్సి ఉండగా పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఖర్చుచేసిన రూ. 5,103 కోట్లను కేంద్రం తక్షణమే చెల్లించాల్సి ఉంది. పైగా ప్రాజెక్టు పనులను వేగవంతం చేయటానికి రూ. 16,000 కోట్లను కూడా కేంద్రం చెల్లించాల్సి ఉంది. నాలుగోది, రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 1050 కోట్ల బ్యాలెన్స్ మొత్తాన్ని కూడా విడుదల చేయాలని సీఎం జగన్ ప్రధానిని కోరారు. ఈ అన్ని మొత్తాలు కలిసి రూ.80 వేల కోట్లకు పైబడే ఉంటాయి. వీటితో పాటు నవరత్నాలు, తదితర ప్రాజెక్టులకు ఉదారంగా చేయవలసిన ఆర్థిక సహాయాన్ని కూడా కేంద్రం చెల్లించవసిందిగా వైఎస్ జగన్ కోరారు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని అన్నట్లుగా తొలినుంచి విభజనానంతర ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు తీవ్రంగా గండి కొడుతున్న కేంద్రప్రభుత్వం జగన్ అభ్యర్ధనలను ఏమేరకు గౌరవిస్తుందో చూడాలి. చంద్రబాబు అయిదేళ్లపాటు రాష్ట్రానికి రావలసిన నిధుల కోసం కేంద్రం చుట్టూ సవారు తీసి విఫలమయ్యారు. ఇక జగన్ తన వంతుగా ఏం చేయనున్నారో వేచి చూడాల్సిందే మరి.

దిశ నిందితుల పోస్ట్ మార్టం... నివ్వెరపరిచే నిజాలు
8 hours ago

కులాల కుంపటి రాజేస్తున్నారు..!
8 hours ago

వెనక్కు తగ్గిన సీఎం జగన్.. కిటికీల జీవోలు రద్దు!
14 hours ago

డేటా చోరీ కేసు ఏమైంది? జగన్ కు కన్నా లేఖ
17 hours ago

జనానికి షాక్.. సబ్సిడీ ఉల్లిపాయల విక్రయాలకు బ్రేక్
18 hours ago

అధికారంతోనే అత్యాచారాలకు అడ్డుకట్ట: ప్రియాంకా గాంధీ
07-12-2019

ఆపరేషన్ టీడీపీ.. సీఎం జగన్ వ్యూహమిదేనా?
07-12-2019

టీడీపీకి షాక్.. వైసీపీ గూటికి బీద మస్తాన్ రావు
07-12-2019

ఐఏఎస్, ఐపీఎస్ల ఒత్తిడికి లొంగే సజ్జనార్ అలా చేశారా?
07-12-2019

రేపిస్టుల లిస్టులో ఎంపీ గోరంట్ల మాధవ్.. నేషనల్ మీడియా టార్గెట్
07-12-2019
ఇంకా