newssting
BITING NEWS :
* తూర్పుగోదావరి జిల్లా పెనికేరులో వింత జంతువు సంచారం..రాత్రివేళ పశువులను చంపేస్తున్న వింత జంతువు..తీవ్ర భయాందోళనలో స్థానికులు *నెల్లూరు జిల్లా కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య..ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు*జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హై కోర్టు పనిచేస్తోందని, జడ్జి లను దూషిస్తూ సోషల్ మీడియా లో పలు పోస్టింగ్ లు.సుమోటోగా తీసుకొని విచారించి చర్యలు తీసుకోవాలని హై కోర్టుకు లేఖ రాసిన సీనియర్ న్యాయవాది లక్ష్మినారాయణ. *ఓయూలో ఉద్రిక్తత..ఓయూ భూముల పరిశీలన కు వచ్చిన ఉత్తమ్, భట్టి , విహెచ్, ఓయూ భూములు కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తుందని ఫైర్..కాంగ్రెస్ కు మద్దతుగా ఓయూ విద్యార్థుల ఆందోళన..రంగంలోకి పోలీసులు* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు.. 147 మంది మృతి, దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్పటి వరకు 3,867 మంది మృతి..యాక్టివ్ కేసులు 73,560..కోలుకున్న వారు 54,441*తెలంగాణలో 52 కొత్త కరోనా కేసులు..1,813కు చేరిన కరోనా కేసులు సంఖ్య, ఇప్పటి వరకు 49 మంది మృతి..యాక్టివ్ కేసులు 696

బంగీ జంప్‌తొ హింట్ ఇస్తున్నారా..?

02-08-201902-08-2019 14:35:02 IST
2019-08-02T09:05:02.566Z02-08-2019 2019-08-02T09:04:56.187Z - - 25-05-2020

బంగీ జంప్‌తొ హింట్ ఇస్తున్నారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

గ‌త ఐదేళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో త‌ర‌చూ వినప‌డే పేర్ల‌లో విజ‌య‌వాడ సెంట‌ర్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు ఒక‌రు. తెలుగుదేశం పార్టీ త‌ర‌పున గ‌ట్టి వాణి వినిపించే బోండా ఉమా ఐదేళ్ల పాటు అప్ప‌టి ప్ర‌తిప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విమ‌ర్శించ‌డంలో ముందుండే వారు. స‌మ‌యం చిక్కితే చాలు వైసీపీపై విరుచుకుప‌డేవారు. ఒకానొక స‌మ‌యంలో అసెంబ్లీలో ఆయ‌న వైసీపీ ఎమ్మెల్యేల‌పై నోరు జార‌డం వివాదాస్ప‌ద‌మైంది కూడా.

తెలుగుదేశం పార్టీకి, చంద్ర‌బాబు నాయుడు ప‌ట్ల‌ విశ్వాసంగా ఉన్న బోండా ఉమ ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుంచి పోటీ చేసి కేవ‌లం 25 ఓట్ల తేడాతో మ‌ల్లాది విష్ణుపైన ఓడిపోయారు. మ‌ల్లాది విష్ణు ఎన్నిక చెల్ల‌ద‌ని ఉమ కోర్టును ఆశ్ర‌యించినా ఫ‌లితం లేకుండా పోయింది. దీంతో రాజ‌కీయంగా సైలెంట్ అయ్యారు.

అయితే, ఇప్పుడు ఆయ‌న పార్టీ మార‌నున్నార‌ని బెజ‌వాడ‌లో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడే బోండా ఉమ మంత్రి ప‌ద‌విని ఆశించి భంగ‌ప‌డ్డారు. అప్ప‌టి నుంచే ఆయ‌న‌కు అధిష్ఠానం ప‌ట్ల కొంత అసంతృప్తి ఉంది. ఇక‌, ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీ కాపు నేత‌ల స‌మావేశంలోనూ బోండా ఉమ పాల్గొని అధిష్ఠానం ప‌ట్ల అసంతృప్తిని చూపించారు.

త‌ర్వాత ఎక్క‌డా తెర మీద క‌నిపించని బోండా ఉమ ఉప్పుడు పార్టీ మారుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న ఇప్ప‌టికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని, ఆయ‌న త్వ‌ర‌లోనే వైసీపీ కండువా క‌ప్పుకోవ‌డం ఖాయ‌మ‌నే ప్ర‌చారం మొద‌లైంది. ప్ర‌స్తుతం విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న బోండా ఉమ తిరిగి రాగానే ఈ మేర‌కు నిర్ణ‌యం ప్ర‌కటిస్తార‌ని అంటున్నారు.

ఈ ప్ర‌చారం ఇలా ఉండ‌గానే బోండా ఉమ చేసిన ఓ ట్వీట్ రాజ‌కీయంగా ఆస‌క్తిక‌రంగా మారింది. త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై బెజ‌వాడ‌లో చ‌ర్చ జ‌రుగుతోంద‌ని, తాను మాత్రం బంగీ జంప్ చేస్తున్నాన‌ని ఆయ‌న విదేశాల్లో బంగీ జంప్ చేస్తున్న ఫోటోల‌ను ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను చూసిన కొంద‌రు బోండా ఉమ పొలిటిక‌ల్ జంప్‌కి సిద్ధ‌మ‌య్యార‌ని, అందుకే ఇలా బంగీ జంప్ ఫోటోలో పెట్టి హింట్ ఇస్తున్నార‌ని అంటున్నారు.

అయితే, ఆయ‌న వైసీపీలో చేర‌డం అంతా సులువైన ప‌నిలా క‌నిపించ‌డం లేదు. వైసీపీలో కృష్ణా జిల్లాకు చెందిన నేత‌లతో ఆయ‌న గ‌త ఐదేళ్లు అనేక విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా కొడాలి నాని వంటి వారితో బోండా ఉమాకు విభేదాలు అసెంబ్లీలో బ‌ట్ట‌బ‌య‌ల‌య్యాయి. పైగా ఇప్పుడు విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా మ‌ల్లాది విష్ణు ఉన్నారు. వీరంతా బోండా ఉమ రాక‌ను వ్య‌తిరేకించే అవ‌కాశాలు ఉన్నాయి. ఇక‌, ఉమ బీజేపీ వైపు కూడా చూస్తున్నార‌నే ప్ర‌చారం కూడా ఉంది. ఏమైనా బంగీ జంప్ ద్వారా బోండా ఉమ త్వ‌ర‌లో తాను రాజ‌కీయంగానూ జంప్ చేస్తున్న‌ట్లు సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది.

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   16 hours ago


రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

   18 hours ago


కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

   19 hours ago


లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

లాక్ డౌన్ ఉల్లంఘనులకు జగన్ ఆఫర్

   19 hours ago


డోసు పెంచిన కమలనేతలు.. ప్రభుత్వంపై గవర్నరుకు ఫిర్యాదు!

డోసు పెంచిన కమలనేతలు.. ప్రభుత్వంపై గవర్నరుకు ఫిర్యాదు!

   20 hours ago


ప్రయాణికులకు గుడ్ న్యూస్.... తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్ కౌంటర్లివే

ప్రయాణికులకు గుడ్ న్యూస్.... తెలుగు రాష్ట్రాల్లో రిజర్వేషన్ కౌంటర్లివే

   20 hours ago


శ్రీవారి అస్తులకే ఎసరు.. అమ్మకానికి సిద్ధమైన టీటీడీ!

శ్రీవారి అస్తులకే ఎసరు.. అమ్మకానికి సిద్ధమైన టీటీడీ!

   20 hours ago


చరిత్రలో కలిసిపోయిన మూడులాంతర్ల స్థూపం.. విమర్శల పర్వం

చరిత్రలో కలిసిపోయిన మూడులాంతర్ల స్థూపం.. విమర్శల పర్వం

   23-05-2020


వరద రోజుల్లో వాడుకున్న నీటిని కోటాలో కలిపేస్తారా.. కృష్ణా బోర్డుపై ఏపీ గుస్సా

వరద రోజుల్లో వాడుకున్న నీటిని కోటాలో కలిపేస్తారా.. కృష్ణా బోర్డుపై ఏపీ గుస్సా

   23-05-2020


ఇప్పుడు జూనియ‌ర్‌పైనే ఆశ‌లు పెంచుకుంటున్నారా..?

ఇప్పుడు జూనియ‌ర్‌పైనే ఆశ‌లు పెంచుకుంటున్నారా..?

   23-05-2020


ఇంకా

Sharat Bhamidi


With 5 years of experience in Digital Media, Sharat Bhamdi specialises in creating content for webistes, developing ad campaigns and social media campaigns. At NewsSting, he handles the video division where he brings in content through feature videos and interviews.
 sharat@rightfolio.co.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle