newssting
BITING NEWS :
*కాశ్మీర్ సమస్యకు త్వరలో పరిష్కారం: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ * అసోం, బిహార్‌ వరదల్లో 159కి చేరిన మరణాలు*ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి పలువురి సంతాపం *చంద్రయాన్-2 ప్రయోగానికి కౌంట్ డౌన్ ...22న నింగిలోకి.. చంద్రయాన్‌–2*ఇవాళ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు*తెలంగాణ సీఎం కేసీఆర్ కు జేపీ అభినందనలు.. కొత్త పురపాలక చట్టం వికేంద్రీకరణ దిశగా ముందడుగు అంటూ కితాబులు *ఆర్ టీ ఐ సవరణ బిల్లు స.హ చట్టానికి చావు దెబ్బ: మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధరాచార్యులు

ఫ్యాక్ష‌న్ గ‌డ్డ‌లో డాక్ట‌ర్ ఫైట్‌..!

03-04-201903-04-2019 07:41:11 IST
2019-04-03T02:11:11.307Z03-04-2019 2019-04-03T02:10:59.922Z - - 22-07-2019

ఫ్యాక్ష‌న్ గ‌డ్డ‌లో డాక్ట‌ర్ ఫైట్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇద్ద‌రు సీనియర్ నేత‌లు ఒకవైపు.. ఓ యువ డాక్ట‌ర్ మరోవైపు. దీంతో ఫ్యాక్ష‌న్ గ‌డ్డ జ‌మ్మ‌ల‌మ‌డుగులో ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. నాలుగు ద‌శాబ్దాలుగా నియోజ‌క‌వ‌ర్గంలో ఫ్యాక్ష‌న్ న‌డిపిన రెండు వ‌ర్గాలు క‌లిసి తెలుగుదేశం పార్టీలో ప‌నిచేస్తుండ‌టంతో ఈసారి త‌మ‌కు తిరుగులేద‌ని ఆ పార్టీ నేత‌లు భావిస్తున్నారు.

మ‌రోవైపు త‌మ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాల‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌య‌త్నిస్తోంది. క‌డ‌ప జిల్లాలో వైసీపీ నేతలు పులివెందుల త‌ర్వాత జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గాన్ని ప్ర‌తిష్ఠాత్మకంగా తీసుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఆదినారాయ‌ణ‌రెడ్డి విజయం సాధించారు. తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరి మంత్రి పదవి చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కడప జిల్లాలో ఆయన సవాల్ విసురుతున్నారు.

ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డికి అనేక ఏళ్లుగా ఫ్యాక్షన్ కక్షలు ఉన్నాయి. ఈ గొడవల్లో రెండు వర్గాలకు చెందిన అనేక మంది హతమయ్యారు. ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి వెళ్లడం ద్వారా బద్ధ శత్రువులుగా ఉన్న ఇద్దరు నేతలు ఒకే గొడుగు కిందకు చేరారు. ఒకే ఒరలో రెండు కత్తులు పట్టవు కానీ ఒకే పార్టీలో మాత్రం ఇద్దరు శత్రువులు సెటిల్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక చర్చల తర్వాత వీరిద్దరికీ సయోధ్య కుదిర్చారు.

ఇప్పుడు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు నుంచి బరిలో ఉండగా ఆదినారాయణరెడ్డి కడప లోక్ సభకు పోటీ చేస్తున్నారు. గత ఆరు ఎన్నికలుగా ఈ రెండు కుటుంబాల మధ్యే జమ్మలమడుగులో పోటీ నెలకొంది. ఇప్పుడు ఇద్దరూ ఒకే పార్టీలోకి చేరడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రత్యామ్నాయ నేతను తయారు చేసుకుంది. ఇద్దరు ఫ్యాక్షన్ నేతలు, సీనియర్ రాజకీయ నేతలకు ధీటుగా ఒక యువ డాక్టర్‌ను జమ్మలమడుగులో దింపారు.

‌సీనియర్ నేత మైసూరారెడ్డి సోదరుడి కుమారుడు డా.సుధీర్ రెడ్డికి రెండేళ్ల క్రితమే నియోజకవర్గ పార్టీ బాధ్యతలు అప్పగించిన జగన్ టిక్కెట్ కూడా ఖరారు చేశారు. దీంతో ఆయన చాలా రోజులుగా జమ్మలమడుగులో పట్టు సంపాదించే ప్రయత్నం చేశారు. ఇక, జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి కూడా జమ్మలమడుగు బాధ్యతలు స్వీకరించి పని చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి కూడా జమ్మలమడుగుపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేశారు.

మొత్తానికి ఎన్నికల నాటికి జమ్మలమడుగులో వైసీపీ మళ్లీ పుంజుకొని తెలుగుదేశం పార్టీకి బలమైన పోటీ ఇచ్చే స్థాయికి చేరుకుంది. యువకుడు కావడం, రెండు కుటుంబాలకు ప్రత్యామ్నాయ నేతగా రావడం, వైసీపీకి సహజంగా ఉన్న ఓటు బ్యాంకు సుధీర్ రెడ్డికి కలిసిరానుంది. ఆదినారాయణరెడ్డి మంత్రి అయ్యాక నియోజకవర్గాన్ని బాగానే అభివృద్ధి చేశారు. ఇది టీడీపీకి ప్లస్ కానుంది. 

అయితే, నేతలు కలిసినా కిందిస్థాయిలో కార్యకర్తలు కలిసి పూర్తిగా పని చేయలేకపోతున్నారు. మొత్తానికి ఆదినారాయణరెడ్డి వెళ్లిపోవడంతో వైసీపీ జమ్మలమడుగులో మళ్లీ పుంజుకోవడం కష్టమే అనుకున్నా మళ్లీ బలోపేతమై తెలుగుదేశం పార్టీకి గట్టి పోటీ ఇస్తోంది. టీడీపీ సీనియర్ నేతలకు ధీటుగా యువ డాక్టర్ సుధీర్ రెడ్డి సవాల్ విసురుతున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle