newssting
BITING NEWS :
*జపాన్ టీంని ఓడించిన ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం *ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం... దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్*బీహార్ లో మెదడువాపు వ్యాధికి బలమయిన 152 మంది చిన్నారులు *ప్రజావేదికను కూల్చేయండి.. సీఎం జగన్ ఆదేశం*కొనసాగుతున్న ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్*అఫ్గాన్‌పై బంగ్లా ఘనవిజయం

ఫోన్ రికార్డుల సాక్షిగా... టీడీపీ మహాకుట్ర గుట్టురట్టు

28-03-201928-03-2019 17:00:59 IST
Updated On 28-03-2019 18:50:01 ISTUpdated On 28-03-20192019-03-28T11:30:59.939Z28-03-2019 2019-03-28T11:30:57.811Z - 2019-03-28T13:20:01.621Z - 28-03-2019

ఫోన్ రికార్డుల సాక్షిగా... టీడీపీ మహాకుట్ర గుట్టురట్టు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ ఎలాంటి అడ్డదారి తొక్కడానికైనా వెనకడుగు వేయడంలేదని వైసీపీ ఆరోపిస్తూనే వుంది. ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందు పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించేందుకు కుట్ర చేసి.. ఐడీ గ్రిడ్ స్కాంలో అడ్డంగా దొరికిపోయిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అంతకు మించిన నామినేషన్లతో మహాకుట్ర పన్ని దొరికిపోయింది. ఉరవకొండ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్.. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. 

దీంతో ఈ సారి గెలవకపోతే పయ్యావుల రాజకీయ జీవితం ముగిసినట్లే. అందుకే విశ్వేశ్వర్ రెడ్డి అనే వ్యక్తిని వెదికి పట్టుకొని ప్రజాశాంతి పార్టీ తరఫున నామినేషన్ వేస్తే భారీగా ముట్టజెప్తాం అంటూ ఆఫర్ పెట్టారు. అయితే.. పయ్యావుల సంప్రదించిన సదరు విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ కార్యకర్త. దీంతో ప్రజాశాంతి పార్టీ తరఫున నామినేషన్ వేసేందుకు ఒప్పుకోలేదు. పనిలో పనిగా పయ్యావుల వర్గీయులు తనను సంప్రదించి బేరసారాలాడిన ఆడియోను నేరుగా ఒక మీడియా చేతికి ఇచ్చాడు విశ్వేశ్వర్ రెడ్డి.  ఇప్పుడు ఈ ఆడియో సంచలనం సృష్టిస్తోంది.

వైఎస్సార్సీపీకి పడే ఓట్లు చీల్చేందుకే నామినేషన్ వెయ్యాలంటూ టీడీపీ తరఫు వ్యక్తి పరమేశ్వర్ రెడ్డి ఫోన్లో సంప్రదించారు. తాను పయ్యావుల కేశవ్ అనుచరుడిననీ.. ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాప్టర్, వైసీపీ గుర్తు సీలింగ్ ఫ్యాన్ పక్కపక్కనే కనిపిస్తే ఓటర్లు కన్ఫ్యూజ్ అవ్వాలనేది టీడీపీ ప్లాన్ అని చెప్పారు. కనీసం 2 వేల ఓట్లు చీల్చినా పయ్యావులకు మేలు జరుగుతుందని ఒప్పించే ప్రయత్నం చేశారు. 

వేసిన నామినేషన్ ఎట్టిపరిస్థితుల్లోనూ విత్ డ్రా చేసుకోకూడదనీ.. పయ్యావులకు ఈ మేలు చేస్తే ఇప్పుడు డబ్బు ఇవ్వడంతో పాటు.. ఫ్యూచర్‌లో ఏం కావాలన్నా అండగా ఉంటారనీ విశ్వేశ్వర్ రెడ్డికి చెప్పారు. అదే.. ద్రోహం చెయ్యాలని చూస్తే ఎలా తొక్కాలో కూడా పయ్యావుల ఫ్యామిలీకి బాగా తెలుసని సదరు పరమేశ్వర్ రెడ్డి ఈ విశ్వేశ్వర్ రెడ్డితో చెప్పాడు. చివరికి తన బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా ప్రజాశాంతి పార్టీ నామినేషన్ వేసేందుకు విశ్వేశ్వర్ రెడ్డి ఒప్పుకోకపోవడంతో.. గత్యంతరం లేక కె. విశ్వనాథరెడ్డి అనే వ్యక్తితో ప్రజాశాంతి పార్టీ తరఫున నామినేషన్ వేయించారు పయ్యావుల కేశవ్.

ఉరవకొండలో చేసిన విధంగానే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 35 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒకే రకమైన పేర్లున్న వ్యక్తులతో ప్రజాశాంతి పార్టీ తరఫున నామినేషన్లు వేశారు. పాల్ నుంచి ఒక్కో భీ-ఫారం లక్షల రూపాయలకు కొనుగోలు చేసి ముక్కూ ముఖం తెలియని అభ్యర్థుల్ని టీడీపీనే బరిలోకి దించిందని ఫోన్ కాల్ సంభాషణలు బయటపెడుతున్నాయి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle