newssting
BITING NEWS :
* ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన.. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ గరం గరం *సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన శివసేన.. ఇవాళ విచారణ *సమ్మెపై హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాం: అశ్వథ్థామరెడ్డి.*ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో కోహ్లీ, బుమ్రా *గురుగ్రామ్ లో తైక్వాండో క్రీడాకారిణి సరిత దారుణ హత్య *మిషన్ భగీరథ అవినీతిపై సీబీఐతో విచారణ జరపాలి : భట్టి విక్రమార్క*నా పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకెళ్లారా ? : పవన్*ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టులో విచారణ *ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ

ఫోటో తెచ్చిన తంటా - నాని అటా..? ఇటా..?

20-10-201920-10-2019 12:43:26 IST
2019-10-20T07:13:26.606Z20-10-2019 2019-10-20T07:13:23.174Z - - 14-11-2019

ఫోటో తెచ్చిన తంటా - నాని అటా..? ఇటా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విజ‌య‌వాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మ‌రోమారు వార్త‌ల్లో నిలిచారు. వైసీపీ అధికారం చేప‌ట్టాక వ‌రుస ట్వీట్ల‌తో కాకరేపిన నాని ఇప్పుడు ఓ ఫోటోతో మ‌ళ్లీ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. విజ‌య‌వాడ విమానాశ్ర‌యంలో వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డితో క‌లిసి దిగిన ఫోటో ఇప్పుడు నానిని వార్త‌ల్లోకి తీసుకొచ్చింది.

విజ‌య‌సాయిరెడ్డితో కేశినేని నాని క‌లిసి దిగిన ఈ ఫోటోనే ఇప్పుడు మ‌ళ్లీ విజ‌య‌వాడ రాజ‌కీయాల్లో పెను దుమారం రేపుతోంది. వీరిద్ద‌రూ విమానాశ్ర‌యంలో ప‌క్క ప‌క్క‌నే కూర్చోవ‌డ‌మే కాదు.. ఫ్లైట్‌లో కూడా ప‌క్క ప‌క్క‌నే కూర్చొని ప్ర‌యాణించార‌న్న‌ది సోష‌ల్ మీడియా టాక్. దీంతో వీరిద్ద‌రూ ఏం మాట్లాడుకున్నారు..? ఏం చ‌ర్చించారు..? అని ఆరా తీయ‌డం పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ జ‌నం వంతైంది.

కాగా, గ‌త కొంత కాలంగా టీడీపీ అధిష్టానంపై కేశినేని నాని గ‌త కొంత‌కాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఆ క్ర‌మంలోనే ప‌లుమార్లు బ‌హిరంగంగా, సోష‌ల్ మీడియా వేదిక‌గా అధిష్టానం, పార్టీ నేత‌ల తీరుపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. నాని వ్య‌వ‌హారంపై పెద్ద చ‌ర్చే న‌డిచింది బీజేపీ పెద్ద‌ల‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని, బీజేపీలోకి వెళ‌తార‌న్న ప్ర‌చార‌మూ  జోరుగా జ‌రిగింది. అంతేకాకుండా పార్టీ బ‌లంకంటే త‌న సొంత ఇమేజ్‌తోనే ఎంపీగా గెలిచిన‌ట్టు కేశినేని నాని చెప్పుకుంటూ ఉంటారు.

కానీ, ఇప్పుడు కేశినేని నాని మ‌న‌సు మార్చుకున్నారా..?  బీజేపీలో డోర్లు మూసుకుపోయాయా..?  వైసీపీ వైపు నాని చూస్తున్నారా..? అన్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి, కేశినేని నాని ఇద్ద‌రూ ఒకే ఫ్లైట్‌లో క‌లిసి ప‌క్క ప‌క్క‌నే కూర్చొని ప్ర‌యాణం చేయడంతో ఈ ప్ర‌చారం మ‌రింత ఊపందుకుంది.

https://www.photojoiner.net/image/Vxs63MER

అనుకోకుండా విజ‌య‌సాయిరెడ్డి, కేశినేని నాని క‌లిసిన ప్ర‌చారం మాత్రం నాని వైసీపీలో చేర‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తుంది. మొన్న‌టి దాకా జ‌గ‌న్ స‌ర్కార్‌పై ట్వీట్ల విమ‌ర్శ‌లు కురిపించిన నాని ఈ మ‌ధ్య సైలెంట్ అయ్యారు. వైసీపీ వైపు వెళ్లేందుకే నాని దూకుడు త‌గ్గించార‌న్న కామెంట్స్ సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి.

మ‌రోవైపు వైసీపీ అధిష్టానం కూడా చేరిక‌ల‌పై త‌న వ్యూహాన్ని మార్చుకున్న‌ట్టు క‌నిపిస్తుంది. జ‌న‌సేన‌, బీజేపీ ద్వితీయ శ్రేణి నేత‌ల‌ను చేర్చుకుంటున్న వైసీపీ టీడీపీ నేత‌ల‌పై కూడా ఫోక‌స్ పెట్టిన‌ట్టు తెలుస్తుంది. టీడీపీ నుంచి కూడా చేరిక‌ల‌ను ప్రోత్స‌హించాల‌ని భావిస్తోంది. మ‌రింత‌మంది నేత‌ల‌ను చేర్చుకుని బీజేపీకి అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని త‌న ప్ర‌య‌త్నాల‌ను వేగ‌వంతం చేసింది. కేశినేని నానిని కూడా వైసీపీలోకి లాగేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో టాక్ వినిపిస్తుంది.

 

 

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

కోర్టు ప్రతిపాదనకు కేసీఆర్ ససేమిరా.. సమ్మెపై కొనసాగుతున్న విచారణ

   11 hours ago


చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

చంద్రబాబు ఇసుక దీక్షకు అంతా రెడీ... పవన్ సపోర్ట్

   12 hours ago


ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ .. ఇంగ్లీషు మీడియానికి ఓకె

   13 hours ago


ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

ప్ర‌శ్నార్ధ‌కంలో టీఆర్ఎస్‌ రాజ‌కీయ ఉద్దండుల భ‌విత‌వ్యం..!

   13 hours ago


మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

మీరూ చేసుకోండి స్వామీ మూడు పెళ్ళిళ్లు... జగన్‌పై పవన్ సెటైర్

   14 hours ago


పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

పట్నం వర్సెస్ పటోళ్ళ ...అత్తా.. అల్లుడి మధ్య కోల్డ్ వార్‌..!

   14 hours ago


జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

జీవోలను దాచిపెట్టడం దేనికి కేసీఆర్.. బీజేపీ ధ్వజం

   14 hours ago


న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

న‌న్న‌ప‌నేని ఈజ్ బ్యాక్‌.. రోజా లేని లోటును తీరుస్తుందా..?

   15 hours ago


జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

జ‌గ‌న్ 'రెడ్డి' అని పిల‌వ‌డం వెనుక‌ ప‌వ‌న్ ప్లాన్.!

   15 hours ago


అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

అమరావతిపై జగన్ సర్కార్ నిర్ణయం.. సింగపూర్‌కు వరమేనా?

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle