newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

ఫెలోషిప్‌‌పై పేలుతున్న జోక్‌లు

26-12-201826-12-2018 12:21:24 IST
2018-12-26T06:51:24.013Z26-12-2018 2018-12-26T06:51:21.988Z - - 18-07-2019

ఫెలోషిప్‌‌పై పేలుతున్న జోక్‌లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పంచాయితీ సర్పంచ్‌గా కూడా ఎన్నిక కాలేని వ్యక్తి.. పంచాయితీరాజ్ మంత్రి అంటూ విపక్షాలు ఎప్పటినుంచో లోకేష్‌పై విమర్శల బాణాలు ఎక్కుపెడుతూనే ఉన్నాయి. అయినా మంత్రి లోకేష్ మైండ్ సెట్‌లో మాత్రం మార్పులు కనిపించడం లేదంటున్నారు. అదంతా ఒక ఎత్తయితే... మంత్రి లోకేష్‌కి ఈమధ్య అవార్డులు కూడా వచ్చిపడుతున్నాయి. సింగపూర్ అధ్యక్షుడు ఎస్ఆర్ నాథన్ స్మారకార్థం ఆ దేశ ప్రభుత్వం నాథన్ ఫెలోషిప్‌ని ఈ ఏడాది ఏపీ మంత్రి లోకేష్‌కి ఇవ్వాలని నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి బాలకృష్ణన్ ఫెలోషిప్ అందుకోవాలని చినబాబుకి ఆహ్వానం పంపారు. దీనికోసం నేరుగా అమరావతినుంచే సింగపూర్ వెళ్ళారు లోకేష్. మూడురోజుల పాటు అక్కడే ఉండనున్నారు. ట్విట్టర్‌లో ఈ ఫెలోషిప్ విషయం తెలియజేయగానే ఆయనపై ఎడాపెడా కామెంట్లు వచ్చిపడుతున్నాయి. అది ఫెలోషిప్ కాదని, 'వేస్ట్ ఫెలో' షిప్ అని.. ఆటాడుకుంటున్నారు నెటిజన్లు. గతంలో కూడా ఇలాంటి అవార్డులు, రివార్డులు లోకేష్‌కి చాలానే వచ్చిపడ్డాయి. టెక్నాలజీ వినియోగంలో లోకేష్ ముందున్నారని ఈమధ్యే  'డిజిటల్ లీడర్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్‌ వచ్చింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల్లో.. అధునాతన సాంకేతికత, సాధించిన ఫలితాల ఆధారంగా లోకేష్‌కు అవార్డు ఇచ్చామని సదరు సంస్థవారు ప్రకటించారు. 

అలాగే ‘డాక్టర్ కలామ్ ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్’ అవార్డ్ 2018, ‘స్కోచ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అంటూ బోలెడన్ని పురస్కారాలు పుచ్చుకున్నారు లోకేష్. ఈమధ్య ‘వరల్డ్ మోస్ట్ ఇన్ ఫ్లూయెన్షియల్ యంగ్ పీపుల్ ఇన్ గవర్నమెంట్’ అంటూ లోకేష్‌కి ఎపొలిటికల్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఓ అవార్డ్ ఇచ్చింది. అయితే అంత ప్రభావం కలిగించే నాయకుల జాబితాలో లోకేష్ ఉన్నాడా అని జనం తెలుగుదేశం నేతల్ని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే వందమంది జాబితాలో తొలి 20 మందిలో లోకేష్ అంటే ఇదో ఇంటర్నేషనల్ జోక్ కాక మరేంటంటున్నారు. వీటికి తోడు ఇప్పుడు ఫెలోషిప్ ఒకటి. దీంతో ఆన్ లైన్‌లో మళ్లీ సెటైర్లు కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్నాయి. సింగపూర్‌లో 'కొందరి' కోసం చంద్రబాబు ఎంతో చేస్తున్నారు. అమరావతికి సింగపూర్‌కు లింకుపెట్టి బాబు చేస్తున్న అతి నాలుగున్నరేళ్లుగా చూస్తూనే ఉన్నాం. ఆ దేశంలో బాబుకు స్టార్ హోటళ్లు కూడా ఉన్నాయనే ప్రచారం కూడా ఉంది. తమ దేశంతో విడదీయరాని అనుబంధం ఉన్న చంద్రబాబుపై ప్రేమను కొంతమంది ఫెలోషిప్ రూపంలో ప్రకటించారని కామెంట్ చేస్తున్నారు. పైగా రూ.20 వేల కోట్లు ఖర్చు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచినందుకు పంచాయతీరాజ్‌ శాఖను ఏపీ సీఎం చంద్రబాబు మెచ్చుకోవడం కొసమెరుపు. సింగపూర్ పర్యటనలో లోకేష్ రాజకీయాలు, ప్రభుత్వ పాలన, ఆర్ధిక వ్యవస్థ వంటి అంశాలపై సింగపూర్‌ మంత్రులు, నాయకులు, అధికారులతో చర్చించనున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle