newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

ఫెడరల్ ఫ్రంట్ సిత్రంలో సెన్సేషన్

16-01-201916-01-2019 11:07:31 IST
2019-01-16T05:37:31.892Z16-01-2019 2019-01-16T05:37:30.031Z - - 21-08-2019

ఫెడరల్ ఫ్రంట్ సిత్రంలో సెన్సేషన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నేడే విడుదల.. జగన్-కేటీయార్ ప్రొడక్షన్స్ సమర్పిస్తున్న 'ఫెడరల్ ఫ్రంట్' చిత్రం.  సంక్రాంతి సందర్భంగా కనుమ రోజున విడుదల చేస్తున్న ఈ సంచలన చిత్రంలో విశేషాల గురించి జనం ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. పేరుకు ఫెడరల్ ఫ్రంట్ అంటూ టైటిల్ పెట్టినా అసలు సినిమాలో ఇంకా చాలా చాలా ట్విస్టులున్నాయంటూ టాక్. 

హైదరాబాద్‌లో నేడు కలుస్తున్న కెసిఆర్-జగన్‌ల మధ్య జరగబోతున్న సమావేశంలో ఫెడరల్ ఫ్రంట్ అంశం మాత్రమే చోటు చేసుకుంటుందా లేక రాబోయే ఎన్నికల్లో ఏపీ పాలిటిక్స్‌కు సంబంధించిన వ్యవహారాల గురించి మాటలేమైనా ఉంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఫెడరల్ ఫ్రంట్‌లో జగన్ పార్టీని చేరేలా ఒప్పించాలని కెసిఆర్ తన కుమారుణ్ణి ఆదేశించినట్లు వార్తలు వచ్చినా అదొక్క విషయమే కాకుండా ఆంధ్రాలో చంద్రబాబును ఓడించే విషయంపైనా కూడా కేటీయార్ జగన్ తో మాట్లాడే అవకాశాలున్నాయంటున్నారు. కొంతకాలంగా తెరాస ఆంధ్ర రాజకీయాల్లో పరోక్షంగా తన పాత్రను పోషిస్తుందంటూ వస్తున్న వార్తలకు వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ సమావేశం మరింత ప్రాముఖ్యత సంతరించుకుంటోంది. 

ఇప్పటికే కెసిఆర్-జగన్-మోడీ‌ల మధ్య రహస్య ఒప్పందం ఉందంటూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు ఈ సమావేశం మరింత బలం చేకూర్చుతుంది. అక్కడ ఏమీ జరగకపోయినా రేపటి రోజున బాబు వర్గీయులు నిప్పు రాజేయడం ఖాయం. ప్రాంతీయ పార్టీలను ఏకం చేయాలనే కెసిఆర్ ఆలోచన ఇక్కడ జగన్ పార్టీతోనే మొదలు పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ కార్యకలాపాలకు ఇప్పటికిప్పుడు హడావుడి ఏమీ లేదని చెప్తూన్న కెసిఆర్ వైఎస్సార్ పార్టీని దువ్వాల్సిన అవసరం ఏమిటంటూ ఒక సీనియర్ తెలుగుదేశం నాయకుడు ప్రశ్నించారు. అంతేకాదు ఒక వేళ జగన్‌తో తెరాస జతకడితే అది తమకు రాజకీయంగా లాభం చేకూర్చుతుందన్నది తమ పార్టీ అంచనా అంటూ ఆయన చెప్పారు. 

ఈ రోజు జరగబోయే సమావేశంలో కేటీయార్-జగన్ ఇద్దరూ చర్చించుకోబోయే అంశాలపైనే మీడియా దృష్టి పెట్టింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle