newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

ఫుల్ జోష్‌లో జ‌గ‌న్ స‌ర్కార్‌..!

25-09-201925-09-2019 06:32:32 IST
Updated On 25-09-2019 12:23:33 ISTUpdated On 25-09-20192019-09-25T01:02:32.726Z25-09-2019 2019-09-25T01:02:27.456Z - 2019-09-25T06:53:33.115Z - 25-09-2019

ఫుల్ జోష్‌లో జ‌గ‌న్ స‌ర్కార్‌..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న అంశాల్లోనే విజ‌యాల‌ను సాధిస్తూ జ‌గ‌న్ స‌ర్కార్ ఫుల్ జోష్‌తో పాల‌న‌లో దూసుకుపోతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఏ అంశాల‌పైన అయితే ప్ర‌తిప‌క్షాలు రాద్దాంతం చేశాయో వాటినే సాధ్యం చేసి సాధించి చూపెట్టింది జ‌గన్ ప్ర‌భుత్వం. కీల‌క నిర్ణ‌యాల అమ‌లులో రాష్ట్ర అడ్డంకులు వ‌చ్చినా వెన‌క్కు త‌గ్గ‌కుండా ముందుకెళ్లి విజ‌యం సాధించింది.

ప్ర‌ధానంగా జ‌గన్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న రివ‌ర్స్ టెండరింగ్ విధానం సూప‌ర్ స‌క్సెస్ అయింది. పోల‌వ‌రం ప్రాజెక్టుతో మొద‌లైన రివ‌ర్స్ టెండ‌రింగ్ విధానం అనుకున్న విధానంకంటే ఎక్కువ ఫ‌లితాన్నే ఇచ్చింది.

ఈ ప్ర‌క్రియ‌లో దాదాపు 839 కోట్లు ఆదా అయింది. రివ‌ర్స్‌టెండ‌రింగ్ విధానంపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చినా సీఎం జ‌గ‌న్ వెన‌క‌డుగు వేయ‌లేదు. ప్ర‌భుత్వ ఖ‌జానాకు కోట్ల‌లో మిగిల్చి న‌వంబ‌ర్ నుంచి ప‌నుల‌ను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు.

ఒక్క పోల‌వ‌రం రీ టెండ‌రింగ్ విధానం జ‌గ‌న్ స‌ర్కార్‌కు బిగ్ బూస్ట్ ఇచ్చింది. ఈ ఒక్క నిర్ణ‌యంతో గ‌వ‌ర్న‌మెంట్ అంతా ఫుల్ జోష్‌లో క‌నిపిస్తోంది. అది ఏ రేంజ్‌లో ఉందంటే ఏకంగా టీడీపీనే మూసేస్తారా..? అని స‌వాల్ చేసే స్థాయికి వెళ్లింది. రెండేళ్ల‌లో పోల‌వ‌రం పూర్తి చేస్తే దేవినేని ఉమా రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటారా..? అని మంత్రి అనీల్ ఛాలెంజ్ విసిరారు.

పీపీఏల పునఃస‌మీక్ష‌ను కూడా సీఎం జ‌గ‌న్ ఛాలెంజ్‌గా తీసుకున్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పీపీఏల విష‌యంలో భారీ అవినీతికి పాల్ప‌డింద‌ని ఆరోపిస్తున్నారు. వాటిని రీ వెరిఫై చేసి ప్ర‌భుత్వానికి ఎంతోకొంత ఆదా చేయాల‌న్న‌ది ముఖ్య‌మంత్రి ఆలోచ‌న‌.

అయితే, ఈ నిర్ణ‌యంపై ప్ర‌తిప‌క్ష టీడీపీ, బీజేపీలు విమ‌ర్శ‌లు గుప్పించాయి. కొన్ని విద్యుత్ సంస్థ‌లు కోర్టును కూడా ఆశ్ర‌యించాయి. అయితే ఈ విష‌యంలో హైకోర్టు తీర్పు ప్ర‌భుత్వానికి అనుకూలంగా వ‌చ్చింది.

విద్యుత్ కొనుగోలు ఒప్పందాళ్ల పునఃస‌మీక్ష‌కు అవ‌కాశ‌మే లేద‌న్న విద్యుత్ కంపెనీల వాద‌న‌ను హైకోర్టు తోసిపుచ్చింది. రీ వెరిఫై చేస్తామ‌న్న ప్ర‌భుత్వ వాద‌న‌ను హైకోర్టు స‌మ‌ర్ధించింది. ఈ అంశం కూడా జ‌గ‌న్ స‌ర్కార్‌కు మంచి మైలేజ్ తెచ్చిపెట్టింది.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle