newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

ఫిరాయింపు ఎమ్మెల్యేలు హ్యాపీయేనా ..!

20-03-201920-03-2019 08:05:24 IST
Updated On 20-03-2019 12:23:14 ISTUpdated On 20-03-20192019-03-20T02:35:24.361Z20-03-2019 2019-03-20T02:35:17.083Z - 2019-03-20T06:53:14.568Z - 20-03-2019

ఫిరాయింపు ఎమ్మెల్యేలు హ్యాపీయేనా ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

గ‌త అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిక్కెట్ల కేటాయింపులో పెద్ద పీట వేశారు. వైసీపీ నుంచి గెలిచి వ‌చ్చిన వారిని తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగానే భావించి ఎక్కువ మందికి టిక్కెట్లు కేటాయించారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో వారికి ఉన్న బ‌లాన్ని, పాత టీడీపీ నేత‌ల బ‌లాన్ని బేరీజు వేసుకొని టిక్కెట్లిచ్చారు.

ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న పాత నేత‌ల‌ను చంద్రబాబు బుజ్జగించారు. కొంద‌రికి ఎమ్మెల్సీ, నామినేటెడ్ ప‌ద‌వులు ఇచ్చారు. మ‌రికొంద‌రు టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జిలు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీలోకి రాగానే వారు వైసీపీలోకి వెళ్లిపోయారు. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు చాలావ‌ర‌కు టిక్కెట్ల కేటాయింపు సులువైంది.

2014 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ 102 అసెంబ్లీ స్థానాల‌ను కైవ‌సం చేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 67 స్థానాల‌ను ద‌క్కించుకుంది. త‌ర్వాత జ‌రిగిన రాజ‌కీయ ప‌రిణామాల్లో వైసీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. వారిలో న‌లుగురికి మంత్రి ప‌ద‌వులు కూడా ల‌భించాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల‌తో క‌లిపి టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 125కి చేరింది. త‌ర్వాత ఓ ఎమ్మెల్యే మృతిచెంద‌గా, మరో ఎమ్మెల్యే హత్యకు గురయ్యారు. ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీ, జ‌న‌సేన‌లోకి చేరిపోయారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 120 కి చేరింది.

మొత్తం 120 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 14 మందికి మిన‌హా అంద‌రికీ చంద్రబాబు నాయుడు మ‌ళ్లీ టిక్కెట్లు కేటాయించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు కూడా టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో జ‌మ్మల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డికి క‌డ‌ప ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. జ‌లీల్ ఖాన్‌కు బ‌దులు ఆయ‌న కూతురికి టిక్కెట్ ఇచ్చారు. ప్రత్తిపాడులో వరుపుల సుబ్బారావుకు టిక్కెట్ ద‌క్కలేదు. ఇక్కడ ఆయ‌న మ‌నవడు వ‌రుపుల రాజాకు టిక్కెట్ ఇచ్చారు. యర్రగొండపాలెంలో డేవిడ్‌రాజు, కోడుమూరులో మణిగాంధీకి టీడీపీ టిక్కెట్లు ఇవ్వలేదు.

కదిరిలో చాంద్‌ బాషాకు కూడా టిక్కెట్ ద‌క్కలేదు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంక‌ట‌ప్రసాద్‌కు టిక్కెటిచ్చారు. బద్వేలులో జయరాములుకు కూడా టిక్కెట్ ఇవ్వలేదు. క‌ర్నూలు టిక్కెట్ కోసం అనేక చ‌ర్చలు, క‌స‌ర‌త్తుల త‌ర్వాత ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్ రెడ్డిని కాద‌ని టీజీ వెంక‌టేష్ కుమారుడు టీజీ భ‌ర‌త్‌కు టిక్కెట్ ఇచ్చారు.

ఇక‌, ఇద్దరు ఫిరాయింపు ఎంపీల్లో ఒక్కరికి కూడా టిక్కెట్ ద‌క్కలేదు. నంద్యాల ఎంపీ టిక్కెట్ మ‌ళ్లీ ఆశించిన ఎస్పీవై రెడ్డిని కాద‌ని మాండ్ర శివానంద‌రెడ్డికి ఇచ్చారు. క‌ర్నూలు టిక్కెట్ ఆశించిన బుట్టా రేణుక‌ను ప‌క్కన పెట్టి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి ఇచ్చారు. ఇప్పటికే బుట్టా రేణుక తిరిగి వైసీపీలో చేర‌గా ఎస్పీవై రెడ్డి జ‌న‌సేన నుంచి బ‌రిలో ఉండాల‌ని భావిస్తున్నారు. టిక్కెట్ ద‌క్కని ప‌లువురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు తిరిగి వైసీపీలో చేరేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. ఇప్పటికే వ‌రుపుల సుబ్బారావు వైసీపీలో చేరిపోయారు. మొత్తానికి టిక్కెట్ల కేటాయింపులో పెద్దగా స‌మ‌స్యలు లేకుండానే ఫిరాయింపు ఎమ్మెల్యేల‌ను చాలా వ‌ర‌కు చంద్రబాబు టిక్కెట్లు కేటాయించ‌గ‌లిగారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle