newssting
BITING NEWS :
*జపాన్ టీంని ఓడించిన ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం *ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం... దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్*బీహార్ లో మెదడువాపు వ్యాధికి బలమయిన 152 మంది చిన్నారులు *ప్రజావేదికను కూల్చేయండి.. సీఎం జగన్ ఆదేశం*కొనసాగుతున్న ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్*అఫ్గాన్‌పై బంగ్లా ఘనవిజయం

ఫిరాయింపు ఎంపీల‌కు ప‌రేషాన్‌

09-03-201909-03-2019 07:50:12 IST
Updated On 09-03-2019 18:21:11 ISTUpdated On 09-03-20192019-03-09T02:20:12.787Z09-03-2019 2019-03-09T02:19:58.111Z - 2019-03-09T12:51:11.441Z - 09-03-2019

ఫిరాయింపు ఎంపీల‌కు ప‌రేషాన్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై గెలిచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎంపీలకు కొత్త ప‌రేషాన్ వ‌చ్చి ప‌డింది. ఎన్నిక‌లు ద‌గ్గర ప‌డుతున్న వేళ వాళ్లకు సీట్ల విష‌య‌మై అధినేత నుంచి హామీ రాక‌పోవ‌డంతో త‌ల ప‌ట్టుకొని కూర్చున్నారు. మ‌ళ్లీ త‌మ స్థానాల నుంచి పోటీ చేసి ఎంపీలుగా ఇంకోసారి పార్లమెంటులో అడుగుపెట్టాల‌నుకుంటున్న వారి క‌లలు నెర‌వేరేలా లేవు. దీంతో కొత్త పార్టీల వైపు చూస్తున్నారు. అధినేత వ‌ద్ద త‌మ అసంతృప్తిని వెళ్ళగక్కినా భ‌రోసా రాక‌పోవ‌డంతో వారి రాజ‌కీయ జీవితం ఆగ‌మ్యగోచ‌రంగా మారిపోయింది.

సీనియ‌ర్ నేత ఎస్పీవై రెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో నంద్యాల పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే, ప్రమాణ స్వీకారం కూడా చేయ‌క‌ముందే ఆయ‌న వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరి ఈ సీజ‌న్‌లో పార్టీ ఫిరాయింపుల‌కు ఆద్యుడిగా ఘ‌న‌త వ‌హించారు. నాలుగున్నరేళ్లుగా ఆయ‌న తెలుగుదేశం పార్టీలో సంతోషంగానే కొన‌సాగుతున్నారు. అయితే, టిక్కెట్ల విష‌యం వ‌చ్చే స‌రికి ఆయ‌న‌కు స‌మ‌స్యలు మొద‌ల‌య్యాయి. ఈసారి నంద్యాల ఎంపీ స్థానంతో పాటు ఎమ్మెల్యే స్థానాన్ని త‌న కూతురికి గానీ, అల్లుడికి గానీ ఇవ్వాల‌ని చంద్రబాబు ముందు త‌న విన‌తిని ఉంచారు.

అయితే, నంద్యాల ఎమ్మెల్యే స్థానానికి ఇప్పటికే సిట్టింగ్‌గా భూమా బ్రహ్మానంద‌రెడ్డి ఉన్నారు. ఆయ‌న మ‌ళ్లీ టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇక‌, ఎంపీ స్థానానికి కూడా ఎస్పీవై రెడ్డి కుటుంబానికి టిక్కెట్ ద‌క్కడం డౌట్ గానే క‌నిపిస్తోంది. ఈ స్థానాన్ని శివానంద‌రెడ్డి ఆశిస్తున్నారు. నందికొట్కూరు టీడీపీ ఇంఛార్జిగా ఉన్న ఆయ‌న‌కు ఎమ్మెల్యే గౌరు చ‌రిత స్వయానా సోద‌రి. త‌న‌కు పార్లమెంటు టిక్కెట్‌తో పాటు త‌న సోద‌రికి పాణ్యం అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాల‌నే హామీతోనే గౌరు దంప‌తుల‌ను ఆయ‌న వైసీపీ నుంచి టీడీపీలోకి తెస్తున్నారు. 

దీంతో నంద్యాల ఎంపీ టిక్కెట్ ఆయ‌న‌కు ఇంచుమించు ఖాయ‌మైంది. ఎస్పీవై రెడ్డి కుటుంబానికి మ‌హా అయితే నంద్యాల ఎమ్మెల్యే స్థానం ఇవ్వవ‌చ్చని ప్రచారం జ‌రుగుతోంది. దీంతో ఎస్పీవై రెడ్డి ప‌క్క పార్టీల వైపు చూస్తున్నార‌ట‌. వైసీపీలోకి ఆయ‌న‌ను తీసుకునే అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో జ‌న‌సేన నేత‌ల‌తో చ‌ర్చలు జ‌రుపుతున్నార‌ని స‌మాచారం. ఈనెల 10న అనుచ‌రుల‌తో స‌మావేశ‌మై భ‌విష్యత్ కార్యాచ‌ర‌ణ నిర్ణయించుకోనున్నారు.

ఇక, క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక‌ది కూడా ఇదే ప‌రిస్థితి. బీసీ కోటాలో గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో రాజ‌కీయాల‌కు కొత్త అయినా ఆమెకు జ‌గ‌న్ టిక్కెట్ ఇచ్చారు. కర్నూలు జిల్లాలో ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ గాలిలో ఆమె గెలిచారు. త‌ర్వాత కొంత‌కాలం పార్టీలో ఉన్న ఆమె టీడీపీలో చేరిపోయారు. మ‌ళ్లీ క‌ర్నూలు ఎంపీ టిక్కెట్ త‌న‌దే అన్న ధీమాతో ఆమె ఇంత‌కాలం ఉన్నారు. ఇప్పుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేర‌డంతో ఆమె ఆశ‌లు అడియాస‌ల‌య్యాయి. ఆయ‌న‌కు ఎంపీ టిక్కెట్ హామీపైనే పార్టీలోకి తీసుకోవ‌డంతో బుట్టా టిక్కెట్‌కు ఎస‌రొచ్చింది. దీంతో ఆమె కోట్ల చేరిక కార్యక్రమానికి కూడా హాజ‌రుకాలేదు. పార్టీ కార్యక్రమాల‌కు కూడా దూరంగానే ఉంటున్నారు.

అర‌కు ఎంపీ కొత్తప‌ల్లి గీత రాజ‌కీయ భ‌విత‌వ్యం కూడా వీరికి భిన్నంగా ఏమీ లేదు. వైసీపీకి రాజీనామా చేశాక ఆమె కొంత‌కాలం టీడీపీతో స‌ఖ్యత‌గా ఉన్నారు. త‌ర్వాత టీడీపీకి కూడా దూరం జ‌రిగి బీజేపీతో క‌లిశారు. త‌ర్వాత ఆ పార్టీకి కూడా దూర‌మై ఏకంగా జ‌నజాగృతి పేరుతో కొత్త పార్టీనే పెట్టుకున్నారు. ఆరు నెల‌ల క్రిత‌మే పార్టీ పెట్టినా ఇప్పటివ‌ర‌కు ఆ పార్టీ చ‌డీచ‌ప్పుడు లేదు. దీంతో అస‌లు అర‌కు నుంచి కొత్తప‌ల్లి గీత అయినా పోటీలో ఉంటారా అనేది అనుమానంగానే మారింది. మొత్తానికి ఫిరాయింపు ఎంపీల ముగ్గురి రాజ‌కీయ భ‌విత‌వ్యం ప్రశ్నార్థకంగా మారిన‌ట్లు క‌నిపిస్తోంది


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle