newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

ఫస్ట్ టైం ట్వీటిన జగన్

10-02-201910-02-2019 14:03:00 IST
Updated On 10-02-2019 19:02:46 ISTUpdated On 10-02-20192019-02-10T08:33:00.472Z10-02-2019 2019-02-10T08:32:52.337Z - 2019-02-10T13:32:46.525Z - 10-02-2019

ఫస్ట్ టైం ట్వీటిన జగన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జగన్ ఫస్ట్ టైం ట్వీట్ చేశారు. అది కూడా రాజకీయాలకు సంబంధించి కాదు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ఇతివృత్తంతో నిర్మించిన 'యాత్ర' సినిమా నిర్మాత దర్శకులను అభినందిస్తూ చేసిన ట్వీట్ అది. సినిమాపరంగా వైఎస్ వ్యక్తిత్వాన్ని తెరకెక్కించిన మూవీ టీమ్ తమ సమష్టికృషితో , అంకితభావంతో నిర్మించి విజయవంతంగా 'యాత్ర'చిత్రాన్ని విడుదల చేసినందుకు జగన్ అభినందించారు. శనివారం మూవీ టీం జగన్‌తో భేటీ అయింది.

గత శుక్రవారం యాత్ర సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీ వైఎస్ అభిమానుల్నే కాదు, సినీ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. వైఎస్సార్ చేపట్టిన పాదయాత్రను ఆధారంగా చేసుకుని మహి వి. రాఘవ్ ‘యాత్ర’ సినిమాను తెరకెక్కించారు. వైఎస్సార్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు.ఈ మూవీ వైసీపీకి ఎన్నికల్లో కలిసి వస్తుందని ఆ పార్టీనేతలు భావిస్తున్నారు. 

Image may contain: text

‘‘ ‘యాత్ర’ మూవీ జననేత రాజశేఖర్ రెడ్డిని మళ్ళీ జనం ముందు నిలిపింది. మమ్ముట్టి రాజన్న పాత్రలో జీవించారు. రాజశేఖర్ రెడ్డి అకాలమరణం పొంది ఇంతకాలం అయినా, ఆయన్ని జనం మరిచిపోలేదనడానికి ఈ మూవీకి వస్తున్న ఆదరణే నిదర్శనం. రాజశేఖర్ రెడ్డి జీవించి ఉంటే ఏపీకి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. యాత్ర మూవీ అంతా చూడాల్సిన చిత్రం’’ అని ‘న్యూస్ స్టింగ్’ తో అన్నారు వైసీపీ అధికార ప్రతినిధి పద్మజారెడ్డి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle